చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

వ్యవసాయం, అనుబంధ రంగాల సమీక్షలో సీఎం చంద్రబాబు

by చైతన్యరధం
Apr 25, 2026 at 6:15am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఏడాదంతా పొలం పచ్చగా ఉండాలి -రైతన్న పంట పండాలి
  • ఎల్‌నినో ఎదుర్కొనేలా ముందస్తు చర్యలు -పీఎండీఎస్ అమలు
  • 50 లక్షల ఎకరాల్లో హార్టీకల్చర్ సాగుకు యాక్షన్ ప్లాన్
  • హెక్టారుకు తగిన సగటు యూరియా వినియోగం
  • ఈ ఏడాది 11 లక్షల హెక్టార్లలో ప్రకృతి సాగు
  • 250 ఎకరాల్లో కోకో సిటీ -ఎక్స్‌పీరియన్స్ సెంటర్
  • వ్యవసాయం, అనుబంధ రంగాల సమీక్షలో సీఎం చంద్రబాబు

అమరావతి (చైతన్య రథం): రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేలా… రైతులకు భద్రత, అధిక ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. డిమాండ్ ఉన్న పంటల్ని సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని… ఏది లాభదాయకమో దాని గురించి వివరించి చెప్పాలని సీఎం అన్నారు. అలాగే 365 రోజులు పంటలు పండించేలా చూడాలని, భూమిని భాగాలుగా విభజించి ఒకే రైతు వివిధ రకాల పంటలు సాగు చేసేలా ప్రోత్సహించాలన్నారు. క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వ్యవసాయం, అనుబంధ రంగాలపై ఆయా శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రైతులు ప్రకృతి సాగు కింద చేసే ఉత్పత్తులను సర్టిఫికేషన్‌తో విక్రయించేలా చర్యలు చేపట్టాలని, దీంతో ఆయా ఉత్పత్తులకు అధిక ధర లభిస్తుందని అధికారులతో సీఎం చెప్పారు.

రాష్ట్రంలో గతేడాది రబీలో హెక్టారుకు యÖరియా వినియోగం తగ్గడం శుభపరిణామమని అన్నారు. రైతు బజార్ల నుంచి డోర్ డెలివరీ చేసేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని, దీని కోసం ఏదైనా ఏజెన్సీ సేవలు వినియోగించుకునేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. రాయలసీమను గ్లోబల్ హార్టీకల్చర్ హబ్‌గా చేసేందుకు క్లస్టర్ల వారీగా అభివృద్ధి కార్యాచరణ చేపట్టాలన్నారు. ప్రపంచంలోనే తొలిసారిగా కోకో పంటకు సంబంధించి ‘కోకో సిటీ’ ఏర్పాటు చేస్తున్నామని… కోకో సిటీ ఔత్సాహిక రైతులకు ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌గా ఉండాలని అధికారులకు సీఎం సూచించారు. 250 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేసేందుకు సరైన ప్రాంతాన్ని ఎంపిక చేయాలని ఆదేశించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 25-04-2026

సింగపూర్ మోడల్‌పై ఏపీ దృష్టి

గొడ్డలి రాజకీయాలే జగన్ నైజం!

ఏపీ మష్రూమ్ మిషన్ 2026-31
అరకు ఏజెన్సీలో కుంకుమ పువ్వు సాగును మరింత విస్తరించేలా, మంచి నాణ్యమైన దిగుబడులు వచ్చేలా అధ్యయనం జరపాలన్నారు. ఏపీ మష్రూమ్ మిషన్ 2026-2031 కింద ఏడాదికి లక్ష మెట్రిక్ టన్నుల దిగుబడి సాధించాలని సీఎం లక్ష్యాన్ని నిర్దేశించారు. అనంతపురంలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్న ఆపిల్ పండ్లు రుచికరంగా ఉన్నాయని, వాతావరణం కూడా అనుకూలించిందని అధికారులు చెప్పగా, మరింత విస్తీర్ణంలో సాగు జరిపేలా అక్కడ వాతావరణాన్ని అధ్యయనం చేయాలని చెప్పారు. అలాగే అవకాడో, అంజీర్, పనస, జామ, మిరియాల సాగును పెంచేలా దృష్టి పెట్టాలని నిర్దేశించారు. అంజీర్‌వంటి పండ్లను డ్రైఫ్రూట్‌గా మార్చి వాటి విలువ పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో మొత్తం 50 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ సాగు జరిగేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. బీపీఎల్‌కు దిగువున ఉన్న రైతు కుటుంబాలకు అనుబంధంగా డెయిరీ, లైవ్ స్టాక్ ద్వారా అదనపు ఆదాయం పొందేలా సహకారం అందిచాల్సి ఉందని సీఎం అన్నారు. దీనికి ప్రభుత్వంనుంచి సాయం అందించేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు.

8 లక్షలు దాటిన ఫార్మర్ యాప్ రిజిస్ట్రేషన్లు
రాష్ట్రమంతా క్రాప్ సర్వే చేస్తున్నామని… సాగవుతున్న పంటలు, అక్కడ జలవనరుల వివరాలు నమోదు చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఫార్మర్ యాప్‌తో రాష్ట్రంలో రైతులు, భూ విస్తీర్ణం, భూసార పరీక్షలు, యÖరియా-పురుగుమందులు-విత్తనాల వినియోగం వివరాలు, ప్రభుత్వం నుంచి అందుతున్న పథకాలు వంటి సమాచారం అంతా యాప్‌లో పొందుపరిచామని అధికారులు వివరించారు. ఆ ఏరియాలో భూగర్భ జలాలు, సమీప జలవనరుల వివరాలు ఉంటాయని, ఏ పంటలు రైతులు వేసుకుంటారనే దానిబట్టి అక్కడ వాతావరణ సమాచారం, యÖరియా, విత్తనాలు అవసరాలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఫార్మర్ యాప్ రిజిస్ట్రేషన్లు ఇప్పటివరకు 8 లక్షల మంది రైతులు చేసుకున్నారని అధికారులు వివరించగా, రిజిస్ట్రేషన్‌తో పాటు దానిని ఎంతమంది రైతులు వినియోగించి లబ్ది పొందుతున్నారనేది ముఖ్యమని సీఎం అన్నారు. రైతన్నా మీకోసం ఫేజ్ 1లో 48.73 లక్షల కుటుంబాలు, ఫేజ్ 2లో 46.21 లక్షల రైతు కుటుంబాలకు పంచ సూత్రాలపై అవగాహన కల్పించామని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు.

ఏపీపై ఎల్‌నినో ఎఫెక్ట్- ముందస్తు చర్యలు
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలతో సగటు వర్షపాతం తక్కువగా, 92 శాతమే నమోదు కావొచ్చని అధికారులు అంచనాలు వివరించారు. ఎల్‌నినో ప్రభావం రాష్ట్రంలోని వర్షాధారిత ప్రాంతాలపై తీవ్రంగా పడే అవకాశం ఉందని, ముఖ్యంగా అనంతపురం, సత్యసాయి, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో వానలు తగ్గొచ్చన్నారు. ఇది పప్పుధాన్యాలు, నూనెగింజలు, నీటి ఆధారిత ఉద్యాన పంటలపై ప్రభావం చూపిస్తుందని అభిప్రాయపడ్డారు. ఎల్‌నినో నివారణ చర్యల్లో భాగంగా పీఎండీఎస్ (ప్రీ`మాన్‌సూన్ డ్రై సూయింగ్) విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వర్షాలకు ముందే విత్తనాలు వేసే పీఎండీఎస్ విధానంతో రైతులకు అధిక దిగుబడి రావడంతోపాటు ఖర్చు, ఎరువులు, నీటి వనరులు వినియోగం తగ్గుతుందన్నారు. దీంతో ఎకరాకు రూ.5,000 నుంచి రూ.7,000 వరకు రైతులు అదనపు ఆదాయం పొందుతారని చెప్పారు. ఈ ఏడాది 20 లక్షల ఎకరాల్లో దీనిని అమలు చేసేలా చూడాలని సీఎం సూచించారు. దీనిని వీబీ జీ రామ్ జీతో అనుసంధానించే అంశాన్ని పరిశీలించాలన్నారు.

అన్ని గ్రామాల్లో ప్రకృతి సాగుకు ప్రణాళికలు
2025-26లో 4,116 గ్రామ పంచాయతీల్లో 17.74 లక్షల రైతులు 9.26 లక్షల హెక్టార్లలో ప్రకృతి సాగు చేశారని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. అయితే 2026-27లో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ముఖ్యమంత్రి భారీగా లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ ఏడాది మొత్తం 13,300 గ్రామ పంచాయతీలకూ ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలని… 25 లక్షల రైతులు, 11 లక్షల హెక్టార్లలో సాగు చేసేలా చూడాలన్నారు.

ఆరఎస్కే ఇంటిలిజెన్స్ హబ్ డ్యాష్ బోర్డ్
రాష్ట్రంలోని రైతు భరోసా కేంద్రాల పనితీరును, వ్యవసాయ రంగ సమాచారాన్ని పర్యవేక్షించేలా రూపొందించిన ఆరఎస్కే ఇంటిలిజెన్స్ హబ్ డ్యాష్ బోర్డ్ గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇది ముఖ్యంగా రైతులకు సేవలను మెరుగుపరచడమే కాకుండా, విత్తనాలు-ఎరువుల సరఫరా, పంటల వివరాలను, ఇ క్రాంపింగ్, పంటల బీమా తదితర వివరాలను డిజిటల్‌గా ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుందన్నారు. రైతులు తమ ఆర్డర్లు, స్టాక్ వివరాలను లైవ్ డ్యాష్‌బోర్డ్‌లో చూసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ఈ డ్యాష్ బోర్డులో కచ్చితమైన సమాచారం రియల్ టైమ్‌లో అప్డేట్ అయ్యేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు.

Previous Post

గొడ్డలి రాజకీయాలే జగన్ నైజం!

Next Post

సింగపూర్ మోడల్‌పై ఏపీ దృష్టి

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 25-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 25-04-2026

కార్యకర్త
@ April 25, 2026
సింగపూర్ మోడల్‌పై ఏపీ దృష్టి
ఆంధ్రప్రదేశ్

సింగపూర్ మోడల్‌పై ఏపీ దృష్టి

చైతన్యరధం
@ April 25, 2026
గొడ్డలి రాజకీయాలే జగన్ నైజం!
ఆంధ్రప్రదేశ్

గొడ్డలి రాజకీయాలే జగన్ నైజం!

చైతన్యరధం
@ April 25, 2026
పాలనా సంస్కర్తకు ప్రతిష్ఠాత్మక అవార్డు
ఆంధ్రప్రదేశ్

పాలనా సంస్కర్తకు ప్రతిష్ఠాత్మక అవార్డు

చైతన్యరధం
@ April 25, 2026
చైతన్యరధం ఈ పేపర్ 24-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 24-04-2026

కార్యకర్త
@ April 24, 2026
వైసీపీ నేతల వందల కోట్ల భూ కుంభకోణంలో పెద్ద దస్తగిరి బలి 
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నేతల వందల కోట్ల భూ కుంభకోణంలో పెద్ద దస్తగిరి బలి 

చైతన్యరధం
@ April 24, 2026
తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా భవనాలు
ఆంధ్రప్రదేశ్

తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా భవనాలు

చైతన్యరధం
@ April 24, 2026
శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛ ఇంధన స్వయం సమద్ధి

చైతన్యరధం
@ April 24, 2026
Load More

ముఖ్య వార్తలు

సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

చైతన్యరధం
@ April 25, 2026
ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

చైతన్యరధం
@ April 24, 2026
ఎన్డీయేతోనే తమిళనాడుకు పూర్వవైభవం

ఎన్డీయేతోనే తమిళనాడుకు పూర్వవైభవం

చైతన్యరధం
@ April 22, 2026
మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి

మహిళలను ఓడించింది..డీఎంకేనూ ఓడించండి

చైతన్యరధం
@ April 21, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

సింగపూర్ మోడల్‌పై ఏపీ దృష్టి

సింగపూర్ మోడల్‌పై ఏపీ దృష్టి

చైతన్యరధం
@ April 25, 2026
సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

చైతన్యరధం
@ April 25, 2026
గొడ్డలి రాజకీయాలే జగన్ నైజం!

గొడ్డలి రాజకీయాలే జగన్ నైజం!

చైతన్యరధం
@ April 25, 2026
పాలనా సంస్కర్తకు ప్రతిష్ఠాత్మక అవార్డు

పాలనా సంస్కర్తకు ప్రతిష్ఠాత్మక అవార్డు

చైతన్యరధం
@ April 25, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist