- పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత
విశాఖపట్నం(చైతన్యరథం): జాతీయ అగ్నిమాపక వారోత్స వాల సందర్భంగా విశాఖ ఆర్‌కే బీచ్ వద్ద అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్యఅతిథిగా హాజర య్యారు. ఈ సందర్భంగా ఫైర్ సర్వీసెస్ విభాగానికి చెందిన డైరెక్టర్ పి.వి.రమణ, డైరెక్టర్ (అడ్మిన్) మురళి పాల్గొన్నారు. కార్యక్రమంలో నిర్వహించిన మెగా ఫైర్ సర్వీస్ డెమో అతిథు లు, నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంది. అత్యంత క్లిష్ట పరిస్థి తుల్లో ప్రాణాలు, ఆస్తులను రక్షించడంలో అగ్నిమాపక సిబ్బంది పోషించే కీలక పాత్రను అధికారులు వివరించారు. అలాగే వారోత్సవాల భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను అనిత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అగ్ని ప్రమాదాల సమయంలో ప్రజలు పాటించాల్సిన జాగ్రత్తలను డెమోల ద్వారా వివరించామని చెప్పారు. 2018లో అగ్నిమాపక శాఖకు పరికరాలు కొనుగోలు చేశామని, 2019 నుంచి 2024 వరకు గత ప్రభుత్వం ఈ విభాగాన్ని పట్టించు కోలేదని ఆమె విమర్శించారు.
తాజాగా రూ.232 కోట్లతో ఫైర్ వాహనాలను కొనుగోలు చేశామని, వాటిని ముఖ్యమంత్రి ప్రారంభించారని వెల్లడించారు. ఆధునిక సాంకేతికతను వినియో గిస్తూ డ్రోన్లను కూడా ఉపయోగిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని, ఎక్కడైనా విపత్తు సంభవించినప్పుడు ప్రాణాల ను సైతం లెక్కచేయకుండా అగ్నిమాపక సిబ్బంది విధులు నిర్వ ర్తిస్తున్నారని ప్రశంసించారు. ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కార్యక్రమం ముగింపులో వివిధ విభాగాల్లో ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటించిన వారిని హోం మంత్రి సత్కరించారు. అనంతరం అగ్నిమాపక శాఖ అధికారులు హోం మంత్రి అనితను ఘనంగా సత్కరించారు.














