కష్టాన్ని నమ్ముకుని స్వశక్తితో ఎదగాలి
విద్యార్థులు వినూత్నంగా ఆలోచించాలి
కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి
డిగ్రీ కాలేజీలో యువతకు జాబ్‌మేళా
కుప్పం(చైతన్యరథం): స్వర్ణ కుప్పం లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలో నాలుగురోజుల పర్యట నలో భాగంగా రెండోరోజు పలు గ్రామాల్లో నారా భువనేశ్వరి పర్యటించారు. కుప్పం డిగ్రీ కాలేజ్‌లో నిర్వహించిన జాబ్‌మేళాలో పాల్గొన్నారు. గుడిపల్లి మండలం పెద్ద కోటమకనపల్లి గ్రామంలో పర్యటించిన మహిళలతో సమావేశమయ్యారు. జాబ్‌మేళాలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్‌మేళా నిర్వహించడం అభినందనీయం. విద్యా ర్థులు వినూత్నంగా ఆలోచించాలి. భవిష్యత్‌పై స్పష్టత ఉండాలి. యువత స్వశక్తితో ఎదగాలి.. కష్టాన్ని నమ్ముకోవాలి. లక్ష్యం ఉంటే ఏదైనా సాధించవచ్చని పేర్కొన్నారు.
సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలి
నాడు విజన్ 2020, నేడు విజన్ 2047 లక్ష్యంతో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారు. ఒక నాయకుడిని నమ్మి ఓటేస్తే గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో ఏం జరిగిందో మనం చూశాం. ముఖ్య మంత్రి చంద్రబాబు ఇచ్చిన మాట తప్పరు. ఓట్ల కోసం హామీలు ఇవ్వరు. ప్రజల కోసం నిలబడతారు. నేను ఏం చేయగలనో అదే హామీ ఇస్తానని చంద్రబాబు నాతో చెబుతూ ఉంటారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు తీసుకొ స్తున్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా చర్యలు తీసుకుం టున్నారు. గృహిణిగా ఉన్న నేను హెరిటేజ్ బాధ్యతలను సవాల్‌గా తీసుకున్నాను. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదు ర్కోవాలి. ప్రతి దానికీ అసంతృప్తికి లోను కాకూడదు. కష్టపడి పని చేస్తే ఎన్నో అవకాశాలు వస్తాయి. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తారు. ప్రయోజకులు కావాలని, భవిష్యత్ బాగుం డాలని తాపత్ర యపడతారు. పిల్లలు జీవితంలో ఉన్నతంగా స్థిరపడితే ముందుగా సంతోషించేది తల్లిదండ్రులే. లోకేష్ పెంప కం, చదువు బాధ్యత నేనే చూసుకున్నా. ఏది మంచి, ఏది చెడో చెప్పి పెంచినట్లు తెలిపారు. అనంతరం జాబ్‌మేళా సందర్భంగా పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
















