- మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి తల్లిని అవమానించారు
- ఒక తల్లిని అవమానిస్తూ మాట్లాడితే రెండు చిన్న మాటలు ఎలా అవుతాయి?
- సొంత తల్లిని, చెల్లిని గౌరవించే అలవాటు మీకు లేకపోవచ్చు, మాకు ఉన్నాయి
- శాసనమండలిలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఫైర్
అమరావతి (చైతన్యరథం): ముఖ్యమంత్రి తల్లిని మాజీ మంత్రి అంబటి రాంబాబు అవమానించారు. ఆయన్ను వదిలిపెడతామా అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ మండలిలో వైసీపీ పక్షనేత బొత్స సత్యనారాయణ, వైసీపీ ఎమ్మెల్సీ బొమ్ము ఇజ్రాయెల్ చేసిన ఆరోపణలను మంత్రి లోకేష్ తిప్పికొట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి తల్లిని అవమానించారో లేదో సమాధానం చెప్పాలి. అంబటి రాంబాబు వినియోగించిన పదాలను ఒక్కసారి గమనించాలి. ముఖ్యమంత్రి తల్లిని అవమానిస్తే వదిలిపెడతామా? మహిళలను మనం గౌరవించాలి.
ఆ బాధ్యత మనందరిపై ఉంది. హౌస్ లోపల, బయట మహిళలను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. మా సొంత కార్యకర్త వైఎస్ భారతిరెడ్డి గురించి మాట్లాడితే.. తక్షణమే చర్యలు తీసుకున్నాం. జైలుకు పంపించాం. మాజీ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి రెండు చిన్న మాటలు మాట్లాడారని చెబుతున్నారు. ఒక తల్లిని అవమానిస్తే చిన్న మాటలు ఎలా అవుతాయి? అలాంటి వ్యక్తిని సభ్యులు సమర్థిస్తే ఎలా? అధికార, ప్రతిపక్ష సభ్యులు ఎవరైనా మహిళలను కించపరిచే పదాలు వాడకూడదు. అలాంటివి పోత్సహించవద్దని కోరుతున్నా. మేం ఎలాంటి కక్ష సాధింపులకు పాల్పడటం లేదు’ అన్నాs”.
ఒక తల్లిని అవమానిస్తూ మాట్లాడితే రెండు చిన్న మాటలు ఎలా అవుతాయి?
ఒక మహిళ గురించి మాట్లాడితే మేం ఎమోషనల్ అవుతాం. ఒక తల్లిని అవమానిస్తూ మాట్లాడితే రెండు చిన్న మాటలు ఎలా అవుతాయి? సొంత తల్లిని, చెల్లిని గౌరవించే అలవాటు మీకు లేకపోవచ్చు. మాకు ఉన్నాయి. మాకు బాధ్యత ఉంది. మహిళల జోలికి వెళితే వదిలిపెట్టేది లేదు. జగన్ రెడ్డి తల్లి అయినా, ఎవరి తల్లైనా, చెల్లైనా, అక్కైనా.. ఎవరి గురించైనా మాట్లాడితే ప్రజాప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అని సీఎం, డిప్యూటీ సీఎం చెప్పారు. నెల్లూరులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. మా మహిళ ఎమ్మెల్యే గురించి ఏం మాట్లాడారో చూశాం. దానికి సమాధానం లేదు. అంబటి రాంబాబు విషయంలో జగన్ రెడ్డి వెళ్లి ప్రెస్ మీట్‌లో సింపుల్‌గా రెండు చిన్న మాటలు అన్నారని చెబుతాడు.
అవి రెండు చిన్న మాటలా? ఒక తల్లిని అవమానిస్తే చిన్న మాటలా? నాయకత్వం వహిస్తున్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడవచ్చా? టీడీపీ వారు ఎవరైనా మాట్లాడితే ఆధారాలు ఇవ్వండి, చర్యలు తీసుకుంటాం. టీడీపీ కార్యకర్త భారతిరెడ్డి గురించి చిన్న పోస్ట్ పెడితే చర్య తీసుకున్నాం. అదీ మా చిత్తశుద్ధి. ఐదేళ్లు మీరు ఏం చేశారు? మా పార్టీ కార్యాలయంపై దాడి చేస్తే ఏం చేశారు? సభలో మా తల్లిని అవమానిస్తే మీరు ఏం చేశారు? అంబటి రాంబాబు ఇచ్చిన స్టేట్ మెంట్ తప్పా, ఒప్పా.. మీరే తేల్చి చెప్పాలని మంత్రి లోకేష్ నిలదీశారు.













