- కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులపై సీఎం సమీక్ష
- ప్రతిపాదిత ప్రాజెక్టులను ఏర్పాటుచేసే అంశంపై దిశానిర్దేశం
- ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం
అమరావతి (చైతన్యరథం): కేంద్రం నుంచి ఎక్కువ నిధులు రాబట్టుకునేలా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. గత పాలకులు కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు ఖర్చు పెట్టకుండా పథకాలను నిర్వీర్యం చేశారని.. యుటిలిటీ సర్టిఫికెట్ల విషయంలో సమస్యలు తలెత్తాయన్నారు. ప్రభుత్వ శాఖలు అన్నీ వివిధ పథకాలకు కేటాయించిన నిధుల్ని ఖర్చు చేయగలిగితే అదనపు నిధుల్ని కూడా డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. వచ్చే బడ్జెట్లోగా గరిష్ఠ కేటాయింపులు చేసుకునేలా ప్రణాళికలు ఉండాలని అధికారులకు సూచించారు. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన చాలెంజ్ విధానంలోనూ మరికొన్ని నిధులు సాధించుకునేలా కార్యాచరణ చేసుకోవాలన్నారు. కేంద్రం ప్రకటించిన రేర్ ఎర్త్ కారిడార్ ను శ్రీకాకుళం విజయనగరం-విశాఖ జిల్లాల్లో ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. వీటితో పాటు ఇతర విలువైన ఖనిజాలకు సంబంధించి వ్యాల్యూ చైన్ పరిశ్రమల్ని ఏర్పాటు చేసే ఆలోచన చేయాలన్నారు. ఈస్ట్కెస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటులోనూ తీర ప్రాంతంలో ఉన్న మూలపేట నుంచి దిగువున కృష్ణపట్నం వరకు ప్రతిపాదన చేయాలన్నారు. కంటైనర్ మాన్యుఫాక్చరింగ్, ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన ఏర్పాటు చేసుకునేలా ప్రతిపాదనలు సమర్పించాలన్నారు.
మెగాటెక్స్ టైల్ పార్కును పల్నాడు ప్రాంతంలోను, స్పోర్ట్ మాన్యుఫాక్చరింగ్ హబ్ను తిరుపతిలో ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 20 లో భాగంగా సెమీ కండక్టర్ డిజైన్ తదితర ప్రాజెక్టులను అమరావతిలో ఏర్పాటుచేసేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. వీటితో పాటు రాజధాని ప్రాంతంలోని హెల్త్ సిటీలో బయోడిజైన్, మెస్టిక్ పార్క్, బయో ఫార్మా శక్తి మిషన్ లాంటి ఎకోసిస్టం వస్తుందన్నారు. మెడికల్ టూరిజం-హీల్ ఇన్ ఏపీ అన్న విధానంలో అమరావతిలో ప్రాజెక్టులు చేపట్టాలన్నారు. హిందూపురంలో ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ తయారీని ప్రతిపాదించాలన్నారు. తిరుపతిని ప్రతిపాదించాలన్నారు. తిరుపతిని టూరిజం డెస్టినేషన్ కింద అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. కేంద్రం మంజూరు చేసిన 1000 ఎలక్ట్రిక్ బస్సులను సద్వినియోగం చేసుకుని మరిన్ని ఇ-బస్సులు సాధించేలా ప్రణాళిక చేయాలన్నారు. కొబ్బరి, కోకో, కాజు, కాఫీ పంటలకు ఎక్కువ నిధులను సాధించుకునే అవకాశం ఉంద న్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ ప్రాజెక్టులను కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు ఆస్కారం ఉందన్నారు.













