- ఆ సామర్థ్యం ఏపీకి ఉంది
- క్వాంటమ్ మిషన్, యాక్షన్ ప్లాన్, రోడ్ మ్యాప్ రూపొందించిన రాష్ట్రాల్లో ఏపీ ఒకటి
- కలలు కనడం మాత్రమే కాదు.. వాటిని సాకారం చేస్తాం
- క్వాంటమ్ కంప్యూటింగ్‌పై సదస్సులో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్
- ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ(2025-30)ని విడుదల చేసిన మంత్రి
విశాఖపట్నం (చైతన్యరథం): క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో దేశాన్ని ముందుండి నడిపించే సామర్థ్యం ఏపీకి ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. క్వాంటమ్ కంప్యూటింగ్ పై (A్‌ఎaఅఱతీపష్ట్రaతీ ూబaఅ్‌బఎ – దీబఱశ్రీసఱఅస్త్ర Iఅసఱa’ం Iఅసఱస్త్రవఅశీబం ూబaఅ్‌బఎ ూ్aషస ఱఅ Aఅసష్ట్రతీa ూతీaసవంష్ట్ర) అంశంపై సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ ప్రాంగణంలో శనివారం జరిగిన సదస్సులో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. క్వాంటమ్ కంప్యూటింగ్ అంశంపై కీలక ప్రసంగం ఇవ్వడానికి తాను సరైన వ్యక్తిని కాదనిపిస్తోందన్నారు. ఈ రంగంపై నాకు చాలా పరిమితమైన అవగాహన మాత్రమే ఉంది. నేను ఇప్పటికీ నేర్చుకుంటున్నాను. ఇంత గొప్ప ప్యానల్ సమక్షంలో ఉండటం నాకు గర్వకారణంగా ఉంది. ఏదైనా అమలు చేయాలంటే ముందు ఒక కల ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లో మనం కేవలం కలలు కనటం మాత్రమే కాదు.. వాటిని సాకారం కూడా చేస్తాం.
అందుకే భారతదేశ విజన్‌ను సాకారం చేసేలా క్వాంటమ్ మిషన్, యాక్షన్ ప్లాన్, రోడ్ మ్యాప్ రూపొందించిన తొలి రాష్ట్రాలలో ఒకటిగా నిలిచాం. అమరావతిలో క్యాంటమ్ వ్యాలీకి మొత్తం నాలుగు ముఖ్యమైన పునాదులు రూపొందించాం. మొదటిది అసలైన క్వాంటమ్ కంప్యూటర్‌ను ఏర్పాటుచేయడం, దానికి సంబంధించిన వినియోగ సందర్భాలు, పరిశోధనలను అభివృద్ధి చేయడం.. రెండోది దానికి సంబంధించిన సాప్ట్ వేర్ అభివృద్ధి, మూడోది ప్రతిభావంతమైన ఎకోసిస్టమ్‌ను నిర్మించడం, నాలుగోది అత్యంత ప్రతిష్టాత్మకమైన హార్డ్ వేర్ మాన్యుఫ్యాక్చరింగ్. క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో దేశాన్ని ముందుండి నడిపించే సామర్థ్యం ఏపీకి ఉంది. సీఎం చంద్రబాబు క్వాంటమ్ మిషన్ గురించి, క్వాంటమ్ కంప్యూటర్ తీసుకురావాలని చెప్పినరోజు నేను చాట్ జీపీటీకి వెళ్లి క్వాంటమ్ మిషన్, క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏమిటని వెతికాను. ఇప్పుడు పూర్తిస్థాయి మిషన్‌ను నిర్మించే స్థాయికి వచ్చామని మంత్రి లోకేష్ చెప్పారు.
23 సంస్థలతో ఎంఓయూలు
అనంతరం ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ(2025-30)ని మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. నారా లోకేష్ సమక్షంలో క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో 23 సంస్థలతో ఈ సందర్భంగా ఎంవోయూలు కుదుర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్మ, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ సెక్రటరీ కాటంనేని భాస్కర్, ఇండియా స్ట్రాటజిక్ ఇనీషియేటివ్స్ అండ్ అకాడ్ కాయిన్ హెడ్ సీవీ శ్రీధర్, ఐఐటీ తిరుపతి డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ, నేషనల్ క్వాంటమ్ మిషన్ డైరెక్టర్ జేబీవీ రెడ్డి, ప్రైమస్ పార్టనర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కో-ఫౌండర్, సీఈవో దేవరూప్ ధర్, డైరెక్టర్ అండ్ సీటీవో అమిత్ సింగీ, క్యూఎన్‌యూ ల్యాబ్స్ ఛైర్మన్, కో-ఫౌండర్ శ్రీనివాసరావు ఆలూరి, క్వాంట్రల్ ఓఎక్స్ కో-ఫౌండర్, సీఈవో విశాల్ ఛత్ర, మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ పార్టనర్ ఎస్‌డీఈ-మేనేజర్ గణేష్ శ్రీనివాసన్, పాస్కల్ సీఈవో రాబర్ట్ మారో, తదితరులు పాల్గొన్నారు.













