- వైవీ సుబ్బారెడ్డి విచారణలో నిజం చెబుతారా
- భూమన కరుణాకర్‌రెడ్డికీ నోటీసులు ఇవ్వాలి
- కల్తీ నెయ్యి దోషులను వెనకేసుకొస్తున్న వైసీపీ
- జగన్ పాలనలో తిరుమలను అపవిత్రం చేశారు
- మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ
మంగళగిరి(చైతన్యరథం): కల్తీ నెయ్యి దోషులను జగన్‌రెడ్డి వెనకేసుకొస్తున్నారని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురా ధ ధ్వజమెత్తారు. ఆయనపై 31 క్రిమినల్ కేసులు ఉన్నాయని, 16 నెలలు జైలుశిక్ష అనుభవించి, 16 ఏళ్లుగా బెయిల్‌పై తిరుగుతు న్నారని దుయ్యబట్టారు. సీబీఐ పిలిచినా కోర్టుకు రాకుండా.. వర్చు వల్‌గా హాజరవుతానంటూ రాజ్యాంగాన్ని సైతం పక్కన పెట్టారని ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2014లో టీడీపీ చేతిలో ఓడిపోయిన జగన్, 2019లో ఓటమి భయంతో సొంత బాబాయి వివేకా హత్యను సానుభూతి కోసం ‘ట్రంప్ కార్డు’గా ఉపయోగిం చుకుని గెలిచారని సంచలన ఆరోపణ చేశారు. అంతే కాకుండా ఇసుక, లిక్కర్, అక్రమ మైనింగ్, గంజాయి మాఫియాలతో వేల కోట్లు దోచారని మండిపడ్డారు. చివరికి దేవాలయాలను వదలని హీన చరిత్ర ఆయనది.
హిందువుల మనోభావాలపై, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తుల నమ్మకంపై గత ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి ప్రదర్శించిందని ఆరోపించారు. వెంకటేశ్వర స్వామిని ఏమాత్రం కొలవని వై.వి.సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి వంటి నాస్తికులను టీటీడీ చైర్మన్లుగా నియమించి ఈ పవిత్ర సంస్థ ను అపవిత్రం చేశారన్నారు. రాజశేఖర్‌రెడ్డి హయాంలో కూడా నాస్తికుడిని చైర్మన్‌గా నియమించడం జరిగిందని గుర్తు చేశారు. అమరావతిలో టీటీడీ ఆలయం కోసం చంద్రబాబు కేటాయించిన స్థలాన్ని జగన్ ముఖ్యమంత్రిగా ఉండి కుదించడం కూడా హిందూ మతంపై కక్ష కట్టడానికి నిదర్శనమన్నారు. జగన్‌రెడ్డి ఏ మతస్థుడో స్పష్టంగా చెప్పలేరని, సాంప్రదాయం ప్రకారం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించలేదు. ఆయన సతీమణి తిరుమలకు రాదు.. ఓట్ల కోసం ఇంట్లో తిరుమల సెట్టింగ్ వేయించుకుని నాటకాలు ఆడతారు.. పంతులు తీర్థం ఇస్తే దులుపు కుంటారని విమర్శించా రు. ఇది కేవలం ‘కల్తీ నెయ్యి’ కాదని, సబ్బులు, పెయింట్ల తయా రీకి వాడే రసాయనాలను కలిపి ‘నెయ్యి వాసన’ వచ్చే లిక్విడ్‌ను తయారు చేసి లడ్డూలో వాడారని స్పష్టం చేశారు.
ఈ విధంగా 63 లక్షల కిలోల కల్తీ నెయ్యి/రసాయనాలు ఉపయోగించి, రూ.250 కోట్లకు పైగా డబ్బును దోచుకున్నారని విమర్శించారు. ప్రతిపక్షం లో ఉన్నప్పుడు టీడీపీ హెచ్చరించినా పట్టించుకోలేదని, అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో వచ్చిన సిట్ నివేదికలో ఈ కల్తీ నిజమని తేలిందని పేర్కొన్నారు. రసాయనాలు సరఫరా చేసిన బోలే బాబా అనే వ్యక్తి వైష్ణవి కంపెనీ ద్వారా వై.వి.సుబ్బారెడ్డితో ఒప్పందం కుదుర్చుకున్నారని, ఈ విషయంలో వై.వి.సుబ్బారెడ్డికి కూడా సిట్ నోటీసులు ఇచ్చిందని తెలిపారు. వై.వి.సుబ్బారెడ్డి అన్న ప్రసాదా లను మలినం చేస్తే, కరుణాకర్‌రెడ్డి హయాంలో పరకామణిలో దొంగతనం జరిగిందని, దాని నుంచి అతన్ని కాపాడటానికి అతని ఆస్తులు రాయించుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు. కల్తీ నెయ్యి స్కామ్‌కు సంబంధించి సిట్ విచారణలో వై.వి.సుబ్బా రెడ్డి నిజాలు బయటపెడతారా లేదా అనేది రాష్ట్ర ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న విషయం. ఒకవేళ ఆయన నిజాలు చెబితే వెనుక ఉన్నవారి నుంచి ఆయనకు ‘గొడ్డలి పోటుకో’ లేదా ‘గుండె పోటుకో’ గురయ్యే ప్రమాదం ఉందా అనే సందేహాలు భయాలు ప్రజల్లో ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఎవరు ఉన్నారో, దోచుకున్న రూ.250 కోట్లు ఎక్కడ ఉన్నాయో తేలాలని ప్రజలు ఆశిస్తున్నారు.
భక్తుల మనోభావాలను దెబ్బతీశారు
తిరుమల లడ్డూను హిందువులు అత్యంత పవిత్రంగా పిల్లల అన్నప్రాశనలో సైతం వాడతారని, అలాంటి దాన్ని అపవిత్రం చేయడం కోట్ల మంది మనోభావాలను దెబ్బతీయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు టీటీడీ అభివృద్ధికి పాటుపడ్డారని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీ చైర్మన్‌గా బి.ఆర్.నాయుడు గారిని నియమించడం వల్ల లడ్డూ, ఉచిత భోజనం నాణ్యత బ్రహ్మాండంగా మెరుగుపడ్డాయి. స్వయంగా వైసీపీ మాజీ మంత్రి పోలవరం ప్రాజెక్టుల గురించి తెలియని, ఇరిగేషన్ ప్రాజెక్టులంటే ఏమిటో తెలియని వ్యక్తి, గత ఐదేళ్లుగా ‘లంబాడీ డ్యాన్సులు వేసు కుంటూ’ కాలం గడిపి, చంద్రబాబు, ఆయన సతీమణిని దుర్భాష లాడిన వ్యక్తి ఎప్పుడూ ఇతరులను విమర్శించే ‘మాట్లాడితే అశుభం తప్ప శుభం పలకని’ అంబటి రాంబాబు కూడా టీటీడీ భోజనం బాగుందని వీడియో విడుదల చేశాడు. మరీ ఇతను ఏ గొడ్డలి పోటుకు గురిఅవుతాడో తెలియదు. ఉచిత భోజనశాలలో కాకుం డా కాంప్లెక్స్‌లో ఉన్న భోజన వసతి ఏర్పాటు చేసిన ఘనత కూట మి ప్రభుత్వానిది.. బీఆర్ నాయుడుది.
కమాండ్ కంట్రోల్ సిస్టమ్ పెట్టి అనేక విధాలుగా టీటీడీ అభివృద్ధి పథకంలోకి తీసు కెళ్లడమే కాకుండా దళితవాడల్లో సహా 500కు పైగా దేవాలయాలు కట్టి హిందూ ధర్మాన్ని కాపాడాలని ఈ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. టీటీడీని అపవిత్రం చేసి భక్తులకు ఉన్న నమ్మకాన్ని వైసీపీ నేతలు తుడిచిపారేశారు. వై.వి.సుబ్బారెడ్డిని ఈ స్కామ్ వెనుక ఉన్న అందరినీ ఖచ్చితంగా శిక్షించాలని, దోచుకున్న రూ. 250 కోట్లు ఎక్కడ ఉన్నాయో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. కరుణాకర్‌రెడ్డి కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. అతనికి కూడా నోటీసులు ఇవ్వాలి. సిట్ బృందం మరింత దూకు డు పెంచి హిందూ మతం యొక్క నమ్మకాన్ని కాపాడాలని కోరారు. కిలో నెయ్యిలో ఒక 20 కిలోల రసాయనాలు కలిపితే అది కల్తీ నెయ్యి అంటారు. నెయ్యి అనేది లేకుండా రసాయనాలతో ఒక లిక్విడ్‌ను తయారు చేసి నెయ్యి అనే నామకరణం చేసి దాన్ని తీసుకొచ్చి లడ్డూలో కలిపారు. కల్తీ నెయ్యి కలిసిన లడ్డూ తిని అనారోగ్యం పాలైన వారందరిని ఆ వెంకటేశ్వర స్వామే కాపాడా రని పేర్కొన్నారు.












