అబద్ధాలు, అభూతకల్పనలు, మోసాలు `జగన్‌రెడ్డి ప్రత్యేకత. వాటికి ఆయనే బ్రాండ్ అంబాసిడర్ కూడా. కూటమి ప్రభుత్వం జగన్మాయలు, అబద్ధాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టకుంటే ఏపీ భవిష్యత్ మరోసారి ప్రమాదంలో పడొచ్చు. జగన్నాటకాలతో జనాన్ని మరోసారి మాయ చెయ్యడానికి సిద్ధమయ్యాడు జగన్. అధికారం కోసం అర్రులుచాస్తున్న జగన్‌రెడ్డి.. ఏ గడ్డి కరవడానికైనా సిద్దపడుతున్నాడు. విధ్వంస పాలనకు పాల్పడిన జగన్‌రెడ్డి, తన పాలన బ్రహ్మాండమని పబ్లిక్‌లో బుకాయించడానికీ వెనకాడటం లేదు. ఒకవైపు రాష్ట్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం సర్వశక్తులూ ఒడ్డుతుంది. వైసీపీ హయాంలో దగాపడిన ప్రజా జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా.. విలక్షణ సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. ఏపీ జనం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి చంద్రబాబు 15శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. చంద్రబాబు సమర్ధ నాయకత్వంలో ఏపీలో అమలుచేస్తున్న పాలసీలు, విధానాలు రాష్ట్రాభివృద్ధికి దోహదపడుతున్నాయి. ఈ వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు కనిపిస్తున్నా.. వైసీపీ కళ్లకు కనిపించకపోవడం దురదృష్టకరం. అధికారంలో లేకున్నా.. రాష్ట్ర ప్రగతి అడుగు ముందుకు పడకుండా అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఏపీఎండీసీ జారీ చేసిన బాండ్లలో పెట్టుబడులు వద్దంటూ దాదాపు 200 దేశీయ, విదేశీ సంస్థలకు మెయిల్స్ పెట్టించి.. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకొంటున్నది వైసీపీ అధినేత జగన్‌రెడ్డి.. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గనే అన్నది జగమెరిగిన సత్యం. రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడుతుంటే.. రాష్ట్రంనుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ సొంత మీడియాలో కథనాలు రాయిస్తున్నదీ జగన్
ముఠానే!
రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) బాండ్ల జారీ ద్వారా రూ.9వేల కోట్ల రుణ సమీకరణకు ప్రభుత్వం నిర్ణయిస్తే.. ఆ బాండ్లను ఎవరూ కొనకుండా జగన్, బుగ్గన బృందాలు ఎలాంటి కుట్రలు పన్నారో ప్రభుత్వం గుర్తించింది. జర్మనీలో ఉద్యోగం చేసే వ్యక్తి ద్వారా బాండ్లు కొనొద్దంటూ ఇన్వెస్టర్లకు మెయిల్స్ పెట్టించిన కుట్ర ఎట్టకేలకు బయటపడిరది. ఏపీఎండీసీ బాండ్ల జారీపై హైకోర్టులో పిల్ వేయించి.. విషయం కోర్టు పరిధిలో ఉంది కనుక.. పెట్టుబడులు పెట్టొద్దంటూ ఇన్వెస్టర్లకు మళ్లీ మెయిల్స్ పెట్టిందీ, కోర్టులో ఉండగా బాండ్ల జారీపై ప్రభుత్వం ముందుకెలా వెళ్తుందని రోత పత్రికలో రాతలు రాయించిదీ.. జగన్ బృందాలేనన్నది బహిరంగ రహస్యం. ఇంత జరిగిన తరువాత కూడా బుగ్గన ప్రెస్‌మీట్లు, జగన్ ట్వీట్లు చేసి, మళ్లీ మళ్లీ ఇన్వెస్టర్లకు పంపించిన దురాగతాన్ని ఏమనాలి? జగనాసురుడి విశ్వప్రయత్నాలు విఫలమయ్యాయని చెప్పడానికి `చంద్రబాబు ప్రభుత్వంపై ఇన్వెస్టర్లు ప్రదర్శిస్తోన్న విశ్వాసమే నిలువెత్తు నిదర్శనం. చివరకు `ఏపీఎండీసీ బాండ్ల వ్యవహారం రాజ్యాంగ విరుద్ధమని, నిబంధనలకు వ్యతిరేకమని ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రి, ఆర్‌బీఐ, సెబీ, ఇతర ఎక్స్చేంజీలకు ఫిర్యాదులు చేయించారు. ఇందులో నిబంధనల ఉల్లంఘన లేదని కేంద్రం, సెబీ, ఆర్‌బీఐ తేల్చిచెప్పిన తర్వాతే బాండ్ల ఇష్యూకి అనుమతి దొరకడం, రూ.9,000 కోట్ల రుణానికి క్లియరెన్స్‌లు రావడం `చంద్రబాబు సచ్ఛీలతకు నిదర్శనం కాకపోదు. గతంలో ఏపీఎండీసీ బాండ్ల జారీ ద్వారా రూ.7వేల కోట్లు అప్పు తెచ్చుకునేందుకు అనుమతిస్తూ వైసీపీ హయాంలో.. 2024 మార్చి 15న బుగ్గన జీవో 35 జారీ చేశారు.
ఇప్పుడు అదే బాండ్ల జారీ ద్వారా రూ,9,000 కోట్లు రుణానికి కూటమి ప్రభుత్వం 2025 మార్చి 11న జీవో 32 ఇచ్చింది. అప్పుడు రాజ్యాంగ విరుద్ధం కానిది.. ఇప్పుడు రాజ్యాంగ వ్యతిరేకమెలా అవుతుందో వైకాపాసురులే సమాధానం చెప్పాలి.
ఇక `ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై జగన్ ముఠా పనిగట్టుకొని విష ప్రచారం చేస్తోంది. రాజధానిలో తాజాగా భూసమీకరణ చేపట్టాల్సిన గ్రామాలపై అక్కసు వెళ్లగక్కుతోంది. ఇటీవల 8 గ్రామాల్లో మలివిడత భూసమీకరణ చేపట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడంతో.. దీనికి వ్యతిరేకంగా రాజధానిలో విషప్రచారానికి పాల్పడిరది వైసీపీ. మైకులు పట్టుకుని మరీ.. భూసమీకరణకు రైతులు భూములివ్వొద్దని ప్రచారం చేశారంటే `వైసీపీ తెంపరితనం అర్థం చేసుకోవచ్చు. ఇలా.. అధికారం లేక తీవ్ర అసహనానికి గురవుతున్న జగన్ `ప్రగతిని అడ్డుకునే ప్రయత్నాలకు పదును పెడుతూనే ఉన్నాడు. జగన్‌రెడ్డి అబద్ధాల పట్ల కూటమి ప్రభుత్వం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. అబద్ధాన్ని అబద్ధమని విసుగులేకుండా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిరది. జగన్‌రెడ్డి తిరిగి అధికారంలోకి రావడానికి దేనికైనా సిద్ధపడుతున్నాడన్న విషయం అర్థమైనపుడు `ఉపేక్షించడం ఏపీకే ముప్పు. కుప్పంలో కాల్వలో కృత్రిమ గేట్లుపెట్టించి.. కృష్ణా జలాలను పరవళ్లు తొక్కించి మాయచేసిన మాయలోడు, పూర్తికాకమునుపే వెలిగొండ పాజెక్టును జాతికి అంకితంచేసి మహా మాయగాడి విషయంలో ప్రభుత్వం అప్రమత్తం కావడమే కాదు, ప్రజలూ తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది.
`నీరుకొండ ప్రసాద్