- మదనపల్లె ఫైల్స్ తరహాలో.. మద్యం లెక్కల పత్రాలు తగలెట్టేశారా
- జగన్ నివాసం వద్ద అగ్ని ప్రమాదంపై ఎన్నో అనుమానాలు
- దొంగే దొంగ..దొంగ అన్నట్లుగా సోషల్ మీడియాలో వైసీపీ తప్పుడు ప్రచారం
అమరావతి (చైతన్యరథం): తాడేపల్లిలో మాజీ సీఎం జగన్ నివాసం వద్ద బుధవారం రాత్రి కొన్ని వస్తువులు, కాగితాలు తగలబెట్టడం చర్చనీయాంశమైంది. మద్యం కుంభకోణంపై సిట్ (స్షెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) ఏర్పాటు ప్రకటన వచ్చాక కొన్ని గంటల్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే కొన్ని పత్రాలకు ఇంటి గేటు బయట తగలబెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. అగ్ని ప్రమాదం మాటున, జగన్ దాచుకున్న కీలకమైన లిక్కర్ డాక్యుమెంట్లు, డైరీలు దగ్ధం చేసినట్లు ఈ సందర్భంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ రెడ్డి హయాంలో ఏపీలో
ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేసిందేనని టీడీపీ నేతలు పలు అనుమానిస్తున్నారు. ఉదయం లిక్కర్ స్కామ్‌పై సిట్ పడిరది.. రాత్రికి తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడిరది. ప్యాలెస్ బయట తగలబడిన కాగితాలు, డైరీలు ఏంటి? సిట్ ఇంటి దాకా వస్తుందని.. ముందే లిక్కర్ స్కామ్‌కి సంబంధించి తాను రాసుకున్న లెక్కలు, డాక్యుమెంట్లు తగలబెట్టారా? ఇప్పటి వరకు ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ ఎందుకు బయట పెట్టలేదు? ఎన్ని కుట్రలు చేసినా వదిలేది లేదు. సిట్ వస్తుంది.. విచారణ చేస్తుంది.. అవినీతిని బయటకు తీస్తుంది.. గెట్ రెడీ.. స్టే ట్యూన్డ్ టు తాడేపల్లి ఫైల్స్.. అంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
మద్యం కుంభకోణంపై దర్యాప్తునకు ఏర్పాటు చేసిన సిట్‌కు విజయవాడ పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు నేతృత్వం వహిస్తున్నారు. ఈ కేసులో ఎంతటి వారు ఉన్నా.. వదలద్దని.. ఎవరినైనా ప్రశ్నించాలని.. పేర్కొంటూ.. ప్రభుత్వం విశేష అధికారాలు ఈ సిట్‌కు కట్టబెట్టింది. అంతేకాదు.. ఎంతవారినైనా అరెస్టు చేసే అధికారం కూడా కల్పించింది.
ఈ పరిణామం జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే తాడేపల్లి ప్యాలస్ వద్ద అగ్గి రాజుకోవడం.. దీనిలో కొన్ని ఫైళ్లు, డైరీలు కూడా తగలబడడం వంటివి అనేక సందేహాలకు తావిస్తున్నాయని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మదనపల్లె ఫైల్స్ దహనం తరహాలో.. తాడేపల్లి ప్యాలెస్‌లో పోగుపడిన లెక్కల చీటీల మొదలు మొత్తం వదిలించుకోవాలని చేసిన ప్రయత్నం లాగా కనిపిస్తోంది అనే చర్చ జరుగుతోంది. జగన్ తాడేపల్లి ప్యాలస్ దగ్గర కిలోమీటర్ వరకు స్పష్టంగా చిత్రీకరించగల సీసీ కెమెరాల వ్యవస్థ ఉంది. అక్కడికి బయటవారు వెళ్లి తగలెట్టే సాహసాలు ఎవరూ చెయ్యలేరు. తమ ప్యాలస్ పక్కన రోడ్డుకు అటు పక్క తగలెట్టించి మళ్లీ భద్రతా లోపాలు అని గగ్గోలు పెడుతూ సానుభూతి పొందే గులకరాయు, కోడికత్తి లాంటి డ్రామాలకు దిగారు అని జనం నవ్వుకుంటున్నారు.
మద్యం కుంభకోణంపై తాజాగా సిట్ ఏర్పాటుతో ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు వెల్లడికావడంతో జగన్‌లో కంగారు మొదలైందని అంటున్నారు. తాడేపల్లి ప్యాలెస్‌కు జగన్ మోహన్ రెడ్డి చాలా రోజుల తర్వాత వచ్చారు. లండన్ పర్యటన ఆ తర్వాత బెంగళూరు వెళ్లి వ్యవహారాలు చక్కబెట్టుకుని వచ్చిన జగన్.. తాడేపల్లి ప్యాలెస్ లో లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన లెక్కల పత్రాలను కూడా బయటకు తీసి తగులబెట్టించారనే అనుమానాలు వస్తున్నాయి. అక్కడ ఉంది పచ్చి గడ్డి, మొక్కలు. ఈ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ గడ్డి మండుతుంది అంటే, ఎవరో ఒకరు అక్కడ పెట్రోల్ పోసి మంట అంటించి ఉంటారు. తగలబడుతున్న ప్రదేశంలో కాగితాలు కూడా ఉన్నట్లు చెబుతున్నారు.
తాడేపల్లి ప్యాలెస్‌లో అధునాతన సీసీటీవీలు ఉన్నాయి. వాటిలో చూస్తే నిజానిజాలు తెలుస్తాయి కానీ ఆ పని చేయకుండా జగనన్న ఇల్లు తగులబెట్టేందుకు కొందరు ప్రయత్నించారు.. అంటూ వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేయడమేమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వం వైఫల్యం అని చెప్పడం, జగన్ పై సానుభూతి వచ్చేలా చేయడం అనే ద్విముఖ వ్యూహంతో బాటు సీక్రెట్ ఫైళ్లు విజయవంతంగా తగలబెట్టుకోవచ్చుననే దుర్బుద్ధితోనే ఇలా చేశారనేది అందరి అనుమానం. అసలు అక్కడ మంటలు చెలరేగడం, దాన్ని ఆర్పేందుకు ప్రయత్నించకుండా జగన్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బంది దాన్ని వీడియో తీయడం లాంటి చర్యలు మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాల్సిన జగన్ రెడ్డి సెక్యూరిటీ వాళ్లు ఇద్దరు మాత్రమే మంటలు ఆర్పుతుంటే దాదాపు ఐదుగురు వీడియోలు తీసే పనిలో ఉన్నారు. సెక్యూరిటీ వాళ్లు మంటలు ఆర్పాలా? లేక వీడియోలు తీయాలా?ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు.
ఫిర్యాదు ఇచ్చి, తాడేపల్లి ప్యాలస్ సీసీ కెమెరాల ఫుటేజీ ఇచ్చి జగన్ సహకరిస్తే.. ప్రభుత్వం ఈ విషయంపై దర్యాప్తు చెయ్యవచ్చు. ప్రభుత్వం తాడేపల్లి ప్యాలెస్ లోని సీసీ టీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని విచారణ జరిపితే కానీ అసలు విషయం బయటకు రాదు. అయితే ఈ లోపు సీసీటీవీ ఫుటేజీని ఉంచుతారా, తీసేస్తారా అనేది కూడా అనుమానాస్పదంగానే ఉంది.