- నామినేటెడ్ పోస్టులపై సీఎం చంద్రబాబు వెల్లడి
- పార్టీకోసం పనిచేసిన వాళ్లకే తొలి ప్రాధాన్యమని హామీ
- ‘క్యూబ్స్’ సభ్యులకే పదవులంటూ స్పష్టీకరణ
- ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేలా దిశానిర్దేశం
- ఎంపీ, మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం టెలికాన్ఫరెన్స్
అమరావతి (చైతన్య రథం): జూన్‌లోపు ప్రభుత్వంలోని అన్ని నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇతర పార్టీలనుంచి వచ్చి చేరిన వారికంటే.. ఎప్పటి నుంచో పార్టీలో ఉండి పనిచేసిన వారిని నేతలు ప్రోత్సహించాలన్నారు. మొదటినుంచీ పార్టీని నమ్ముకున్న వారికే పదవులు దక్కేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని తేల్చి చెప్పారు. 214 మార్కెట్ కమిటీలు, 1100 ట్రస్ట్ బోర్డులున్నాయని, వచ్చే జూన్‌లోగా ఈ నియామకాలు పూర్తి చేస్తామన్నారు. పార్టీ ముఖ్య నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, పార్టీ ఇన్ఛార్జిలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… పదవి పొందిన వాళ్ల రెండేళ్ల పనితీరుపై సమీక్ష చేస్తామన్నారు. దాని ఆధారంగా మళ్లీ నిర్ణయాలు, భవిష్యత్ అవకాశాలు ఉంటాయని వివరించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల నియామకంపై ఎమ్మెల్యేలు సరైన ప్రతిపాదనలు పంపాలని సూచించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల్లో పదవి ఆశిస్తున్న వాళ్లు క్యూబ్స్ (క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్) విభాగాల్లో సభ్యులుగా ఉండాలన్నారు. కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు న్యాయం చేసేలా నామినేటెడ్ పదవులు ఇస్తామని వెల్లడిరచారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాలు, నేతల పనితీరువంటి అంశాలపై ఇందులో చర్చించారు.
2029లో మళ్లీ గెలిచేలా ప్రతి ఒక్కరి పనితీరు ఉండాలని తేల్చి చెప్పారు. ఏడు నెలల కాలంలో ఎన్నో పథకాలు, కార్యక్రమాలు, అభివృద్ది పనులు చేపట్టామన్న చంద్రబాబు ఈ విషయాలను నిరంతరం ప్రజలకు వివరించాలని స్పష్టం చేశారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన పథకాలన్నీ అమలు చేస్తామని, ఈ విషయంలో వైకాపా తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టాలని నేతలకు సూచించారు. మెంబర్షిప్ బాగా చేసిన వారికి పదవుల్లో ప్రోత్సహిస్తామన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని, కార్యకర్తలకు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలన్నారు. చరిత్రలో తిరుగులేని విజయాన్ని అందించిన ప్రజలు, కార్యకర్తల ఆశలు తీర్చేందుకు, ఆకాంక్షల మేరకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన పథకాలన్నీ అమలు చేస్తామని… ఈ విషయంలో వైసీపీ తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టాలని సూచించారు. గత ఐదేళ్లు కార్యకర్తలు తిరుగులేని పోరాటం చేశారని, వారి కష్టం ఫలితమే మొన్నటి ఎన్నికల విజయమని అభివర్ణించారు. కార్యకర్తలను ఎప్పుడూ గౌరవించుకోవాలని, ఎన్నికలు అయిపోయాయి నేను ఎమ్మెల్యే, ఎంపి అయిపోయాను అని ఎవరూ భావించవద్దని నేతలకు సూచించారు. మంత్రులు జిల్లాల్లో ఎమ్మెల్యేలతో కూర్చుని పార్టీ అంశాలపై చర్చించి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. నరేగా పెండిరగ్ బిల్లులు చెల్లించేలా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు పని చేయాలని, ప్రజల్లో సంతృప్తి కలిగేలా… భవిష్యత్‌పై నమ్మకం, భరోసా కలిగేలా పని చేయడమే కూటమి ప్రభుత్వ విధానంగా వివరించారు. ఇప్పుడు ప్రజలకు ఏంచేస్తాం… భవిష్యత్‌లో ఏంఇస్తాం అనేది ప్రజలకు పార్టీ నేతలు వివరించాలన్నాంరు. ఇప్పటికే వ్యవస్థలను గాడిలో పెట్టామని, రానున్న రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు ప్రారంభిస్తామని పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.