- పెదపలకలూరు ఎల్సీ నెంబర్ 6కు గ్రీన్ సిగ్నల్
- ర్మాణానికి రూ.41 కోట్ల నిధులు మంజూరు
- పక్కా ప్రణాళికతో గుంటూరు నగరాభివృద్ధి
- కేంద్ర సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
గుంటూరు(చైతన్యరథం): ఏడాదిలోపు వంతెనల మంజూరు, రెండున్నర ఏళ్లలో నిర్మాణాల ఎగ్జిక్యూషన్, మూడున్నర ఏళ్ల లోపు నిర్మాణాలు పూర్తి చేసేలా పక్కా ప్రణాళిక తో పనిచేస్తున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. పెదపలకలూరు ఎల్సీ నెంబర్- 6కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంద ర్భంగా ఢల్లీిలో తన కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ గుంటూరు నగరాభివృద్ధికి ఒక స్పష్టమైన ప్రణాళికలు రచించామన్నారు. గుంటూరు జిల్లా వాసుల మూడు దశాబ్దాల కలగా ఉన్న శంకర్ విలాస్ ఆర్వోబీ నిర్మాణంతో పాటు ఔటర్ రింగ్ రోడ్ ఆర్ఓబీ నిర్మాణానికి సైతం కేంద్ర ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించుకోగలిగా మని తెలిపారు. ఇదేక్రమంలో గుంటూరు నల్లపాడు సెక్షన్లోని పెదపలకలూరు (పుల్లడి గుంట – పేరేచర్ల రోడ్డు) ఎల్సీ నెంబర్ 6ను రైల్వేశాఖ ద్వారా మంజూరు చేయించు కున్నామని, ఈ నిర్మాణానికి రూ.41 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని వివ రించారు. ఇప్పటిదాకా మంజూరైన ఈ మూడు ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి ఉండదని, పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే నిర్మాణాలు జరుగుతాయని చెప్పారు. సత్తెనపల్లి, నరసరావుపేట మీదుగా మాచర్ల, హైద రాబాద్ వెళ్లే వారికి ఉపయోగపడతాయి. వ్యవసాయోత్పత్తులకు, రైతాంగానికి, పలు ప్రాంతాల ప్రజల రాకపోకలకు ఈ ఆర్ఓబీ నిర్మాణం కచ్చితంగా ఉపయో గపడుతుం దని ఆశాభావం వ్యక్తం చేశారు.