- మోసాలు, భూకబ్జాలపై బాధితుల గోడు
- న్యాయం చేయాలని నాయకులకు వినతులు
- అర్జీలు స్వీకరించిన రామ్మోహన్నాయుడు,నేతలు
మంగళగిరి(చైతన్యరథం): టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరి ష్కార వేదికలో అక్రమాలు, మోసాలు, భూ కబ్జాలపై ఫిర్యాదు చేసేందుకు అర్జీదారులు పెద్దఎత్తున తరలివచ్చారు. వారి నుంచి కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, ఏపీ ఫైబర్‌నెట్ కార్పొరేషన్ చైర్మన్ జీవీ రెడ్డి, గౌడ కార్పొరేష న్ చైర్మన్ గురుమూర్తి అర్జీలు స్వీకరించారు.
` తమ భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారని సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం రావులచెరువు గ్రామానికి చెందిన కె.చంద్రశేఖర్ ఫిర్యాదు చేశాడు. సర్వే చేసి అప్పగిం చాలని ఎన్నిసార్లు అర్జీలు అధికారులకు పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు. తమ భూమిని సర్వే చేసి తమకు అప్పగించాలని వేడుకున్నారు.
` కలెక్టర్ ఉత్తర్వులను మార్చేసి అక్రమ పద్దతిలో మైన్ లీజు పొంది రూ.1690 కోట్లు కృష్ణసాయి గ్రానైట్స్ వారు కొట్టేశారని.. దీనిపై విచారణ జరిపితే భారీ అవినీతి బయటకు వస్తుందని ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలానికి చెందిన రంగారావు ఫిర్యాదు చేశారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని తెలిపారు. పర్యావరణ అనుమతులకు మించి నిబంధనలు ఉల్లంఘించి చీమకుర్తి ప్రాంతంలో అధిక పరిమాణంలో తవ్వకాలు జరుపుతున్నా అధికారులు తప్పుడు నివేదికలతో అక్రమాలను కప్పెడుతున్నారని, వాటిపై కూడా విచారణ జరిపించాలని కోరారు.
` 2014-2019 నరేగా పెండిరగ్ బిల్లులు దాదాపు 4,23,014 వర్కులకు ఆమో దింపబడిన రూ.132.8 కోట్లు క్లోస్డ్ మోడ్‌లో ఉండటం వల్ల పేమెంట్ జరపలేకపోతు న్నారని గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్రం తో మాట్లాడి ఓపెన్ చేయించాలని, గత ప్రభుత్వం నిర్వాకం వల్ల పేమెంట్స్ అప్లోడ్ చేయడానికి కిందిస్థాయి అధికారులు విముఖత వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఏసీబీ కేసు లపై క్లారిటీ ఇప్పించి నిధులు విడుదలయ్యేలా చూడాలని కోరారు.
` నల్లె నాగార్జున అనే వ్యక్తి ఆయుస్మాన్ భారత్ కార్డుల వర్క్ ఇప్పిస్తానని తన వద్ద రూ.కోటి తీసుకుని మోసం చేశాడని కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన హుసన్బాషా ఫిర్యాదు చేశాడు. అతనిపై చర్యలు తీసుకు తన డబ్బులు వచ్చేలా చూడాలని వేడుకున్నా డు.
` తమ పిల్లలకు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రత్నబాబు, కృష్ణచైతన్య, రాజేష్ అనే వ్యక్తులు రూ.6,40,000 తీసుకుని తమను మోసం చేశారని గుంటూరుకు చెందిన మండెపూడి కోటయ్య ఫిర్యాదు చేశాడు. వారిపై చర్యలు తీసుకుని డబ్బు ఇప్పించాలని వినతిపత్రం అందజేశాడు.
` గత ప్రభుత్వంలో 72,306 జతల యూనిఫాం దుస్తులను స్కూల్ పిల్లలకు కుట్టి ఇచ్చిన తమకు డబ్బులు ఇవ్వకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని కడప జిల్లాకు చెంది న హుసెన్ బాషా ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన రూ.19,34,208లను విడుదల చేసి సహకరించాలని కోరారు.
` చంద్రన్న బీమాలో బీమా మిత్రలుగా పనిచేస్తున్న 1800 మందిని గత ప్రభుత్వం అన్యాయంగా తొలగించిందని.. తమను తిరిగి విధుల్లోకి తీసుకుని ఉపాధి అవకాశం కల్పించాలని పలువురు బీమా మిత్రలు అర్జీ ఇచ్చారు.
` కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకూడ్లురు గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని పలువురు గ్రామస్తులు విన్నవించారు. నాడు టీడీపీ ప్రభుత్వంలో ఈ తాగునీటి సమస్యను పరిష్కరించడానికి సమ్మర్ స్టోరేజ్‌ను ప్రతిపాదిస్తే.. గత వైసీపీ ప్రభుత్వం దీన్ని పూర్తిగా గాలికొదిలేసిందని తెలిపారు. దయచేసి పనులను పూర్తి చేసి గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.
` గుడారాలు వేసుకుని బతుకుతున్న తమకు నిలువు నీడలేదని..ప్రభుత్వం ఇల్లు కట్టించి ఆదుకోవాలని గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు ఎస్టీ కాలనీ కి చెందిన పేదలు అర్జీ ఇచ్చారు.
` తమ ఇంట్లో 15 సవర్ల బంగారం దొంగలు ఎత్తుకెళ్లారని, పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తే కేసు తీసుకోవడం లేదని ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ఎస్.చిన్న రమణయ్య ఫిర్యాదు చేశాడు.
` తాము గతంలో కొన్న భూమిని కబ్జాదారులు ఆక్రమించుకునేందుకు యత్నిస్తు న్నారని ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన పేరెడ్డి నాగిరెడ్డి ఫిర్యాదు చేశాడు. తమ భూమిని కబ్జా కాకుండా చూడాలని కేంద్రమంత్రికి విన్నవించారు.