విజయవాడ (చైతన్యరథం): గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం సాయంత్రం విజయవాడలోని ఏపీ రాజభవన్లో ‘ఎట్ హోం’ కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. రిపబ్లిక్ డే రోజు సాయంత్రం ఎట్ హోం కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఇచ్చిన తేనీటి విందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకుర్, హైకోర్టు న్యాయమూర్తులు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, పొంగూరు నారాయణ, పయ్యావుల కేశవ్, కింజరాపు అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, సవిత, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, ఎంపీలు, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకటరావు,గద్దె రామ్మోహన్, శ్రీరామ్ తాతయ్య, మండలి బుద్ధ ప్రసాద్, వర్ల కుమార్ రాజా, వెనిగండ్ల రాము, చీఫ్ సెక్రటరీ విజయానంద్, డీజీపీ ద్వారకా తిరుమల రావు, ఇతర సీనియర్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, సీనియర్ ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, వివిధ పార్టీల ముఖ్యనేతలు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఒకరి కొకరు ఆత్మీయంగా పలుకరించుకుంటూ గవర్నర్ ఏర్పాటు చేసిన ఆతిథ్యాన్ని స్వీకరించారు. అతిధులు అల్పాహారం, హై టీ ని స్వీకరించి కుశల ప్రశ్నలతో గడిపారు..