చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

కరువు రహితంగా రాష్ట్రం

కూటమి ప్రభుత్వం ప్రణాళికలు

by చైతన్యరధం
Dec 30, 2024 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
కరువు రహితంగా రాష్ట్రం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • వరదల కాలంలో గోదావరి జలాలు బనకచర్లకు తరలించేందుకు భారీ ప్రాజెక్టుకు రూపకల్పన
  • కృష్ణాడెల్టాకు, సీమకు 280 టీఎంసీలు తరలించేందుకు ప్రణాళిక
  • దాదాపు రూ.70,000 – 80,000 కోట్ల ప్రాజెక్టుతో రాష్ట్రానికి జలహారతి
  • పోలవరం పూర్తితో 80 లక్షల మందికి తాగునీరు, 7.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు
  • 22.5 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ
  • ఇరిగేషన్‌ శాఖపై ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి సమీక్ష

అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లిచ్చి, రాష్ట్రాన్ని 100 శాతం కరువు రహిత రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ ప్రణాళికలను అమలు చేయబోతున్నారు. ఒకవైపు పోలవరం పూర్తి చేయడం ద్వారా 8 ఉమ్మడి జిల్లాలకు మేలు జరుగుతుంది. పోలవరంతో ఉత్తారంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు లబ్ధి చేకూరుతుంది. అయితే గోదావరి నదిలో వరదల సమయంలో సరాసరి ఏటా 2 నుంచి 3 వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది. ఈ నీటి నుంచి 280 టీఎంసీలను వరదల సమయంలో తీసుకోవడం ద్వారా… కృష్ణా డెల్టాకు, రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలు సహా ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు లబ్ధి చేకూర్చేందుకు సీఎం చంద్రబాబు కార్యచరణ అమలు చేయబోతున్నారు. రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు గోదావరి నీటిని బనకచర్లకు తరలించడమే ఏకైక మార్గం అని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగానే గోదావరి వరద జలాలను తరలించడం ద్వారా రాష్ట్రానికి జలహారం కింద అన్ని ప్రాంతాల నీటి అవసరాలు తీర్చనున్నారు. అటు పోలవరం, ఇటు ఈ కొత్త ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో ప్రతి ఎకరానికి నీళ్లిచ్చే అవకాశం ఏర్పడుతుంది. ప్రభుత్వం ఏర్పడ్డాక 6 నెలలుగా దీనిపై విస్తృత కసరత్తు చేస్తున్న ప్రభుత్వం…ప్రాజెక్టును కార్యరూపం ఇచ్చే విషయంలో కీలక అడుగులు వేస్తోంది. ఉండవల్లిలోని తన నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాజెక్టుపై ఆదివారం ఇరిగేషన్‌ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ప్రాజెక్టు వివరాలు
ఈ భారీ ప్రాజెక్టు ద్వారా విస్తృత స్థాయిలో రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు, పరిశ్రమలకు మేలు జరగబోతోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే 80 లక్షల మందికి తాగునీరు, 7.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు కొత్తగా సాగునీరు అందుతుంది. దీనితో పాటు 22.5 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించవచ్చు. పరిశ్రమలకు దాదాపు 20 టీఎంసీల నీటిని వినియోగించవచ్చు. ఎగువ రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టుల కారణంగా కృష్ణా నదికి తగిన విధంగా నీటి ప్రవాహాలు రావడం లేదు. మరో వైపు గోదావరి నదిలో ప్రతి ఏడాది వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది. ఈ నీటిలో కనీసం 280 టీఎంసీల నీటిని వరద సమయంలో వినియోగించుకోవాలనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీని కోసం రెండుమూడు రకాల ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గోదావరి నీటిని కృష్ణా నదికి తరలిస్తారు. కృష్ణా నది నుంచి నాగార్జున సాగర్‌ కుడి కాలువ ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్‌కు తరలిస్తారు. అక్కడ 200 టీఎంసీల సామర్థ్యంతో బొల్లాపల్లి రిజర్వాయర్‌ నిర్మిస్తారు. అక్కడి నుంచి బనకచర్ల హెడ్‌ రెగ్యులేటర్‌కు నీటికి తరలిస్తారు. బొల్లాపల్లి నుంచి బనకచర్లకు 31 కి.మీ టన్నెల్‌ ద్వారా నీటిని తరలిస్తారు. బనకచర్ల హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి తెలుగుగంగ, ఎస్సార్‌బీసీ, నిప్పుల వాగుకు నీళ్ళు వెళతాయి. నిప్పుల వాగు ద్వారా సోమశిల, కండలేరుకు నీటిని తరలిస్తారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే నీటిని వివిధ లిఫ్టులు, కాలువల ద్వారా అన్ని ప్రాజెక్టులకు తరలిస్తారు.

సంబంధితవార్తలు

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.1,200 కోట్లు విడుదల చేసిన సర్కారు

అరాచక ప్రవర్తనే వారి నైజం

రాజధానిగా అమరావతికి చట్టబద్ధత

ఇటు కృష్ణా డెల్టాకు, అటు సీమకు…
ఈ ప్రాజెక్టు పూర్తైతే ఎంత దుర్భర పరిస్థితులున్నా సీమ జిల్లాలకు, పెన్నా ద్వారా నెల్లూరుకు నీరు ఇవ్వొచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా నాగార్జున సాగర్‌ కుడికాలువ కింద సాగయ్యే పంటలకు కూడా సమృద్ధిగా నీటిని అందజేయవచ్చు. అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కరువు ప్రాంతంగా ఉన్న వెలుగొండ ప్రాజెక్టు నీటి అసవరాలను కూడా తీర్చవచ్చు. గోదావరిలో వరద సమయంలో 280 టీఎంసీల నీటిని సీమకు తరలిస్తారు. పోలవరం ప్రాజెక్టు ఎగువ నుంచి రోజుకు మూడు టీఎంసీల నీటిని తరలిస్తారు. ఒక టీఎంసీ నీళ్లు కృష్ణా డెల్టాకు ఇస్తారు. అంటే 280 టీఎంసీల్లో కనీసం 80 టీఎంసీల నీరు కృష్ణా డెల్టాకు కేటాయిస్తారు. ఈ స్థాయిలో నీటిని గోదావరి నుంచి తరలించాలంటే పోలవరం కుడికాలువ సామర్థ్యాన్ని పెంచాల్సి ఉంటుంది. పోలవరం కుడికాలువను 17 వేల క్యూసెక్కుల సామర్థ్యం నుంచి 28 వేల నుంచి 30 వేల క్యూసెక్కులకు పెంచుతారు. అదే విధంగా తాడిపూడి లిఫ్ట్‌ స్కీమ్‌ కాలువ సామర్థ్యాన్ని కూడా 1500 క్యూసెక్కుల నుంచి 10 వేల క్యూసెక్కులకు పెంచి నీటిని తరలిస్తారు. కేవలం గోదావరికి వరదల సమయంలోనే నీటిని తీసుకోవడం ద్వారా….సముద్రంలో వృథాగా పోయే నీటిని మాత్రమే తీసుకోవడం వల్ల ఈ కొత్త ప్రాజెక్టు వల్ల గోదావరి డెల్టాకు నీటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

కేంద్ర ఆర్థిక సాయానికి ప్రయత్నాలు
ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ ప్రాజెక్టు చేపట్టడం అంత సులభం కాదు. అయితే ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే ఇదే పెద్ద గేమ్‌ ఛేంజర్‌ అవుతుందని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.70 వేల నుంచి రూ.80 వేల కోట్లు ఖర్చు అవుతుందని తెలుస్తోంది. 54 వేల ఎకరాల భూ సేకరణ జరపాల్సి ఉంటుంది. 4 వేల మెగావాట్ల విద్యుత్‌ అవసరం అవుతుంది. పెద్ద మొత్తంలో అటవీ భూములు కూడా సేకరించాల్సి ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే భారీ వ్యయం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇంత వ్యయం చేసే అవకాశం లేదు. దీంతో ఈ ప్రాజెక్టు అవసరాన్ని, ప్రయోజనాలను కేంద్రానికి వివరించిన కేంద్ర సాయం కూడా తీసుకుని దీన్ని పూర్తి చెయ్యాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ వారంలో జరిపిన ఢల్లీి పర్యటనలో కేంద్ర పెద్దలతో ఈ ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు చర్చించారు. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌కు ప్రాజెక్టు అవసరాన్ని వివరించి ఆర్థిక సాయంపై విన్నవించారు. సాధ్యమైనంత త్వరగా ప్రాజెక్టుకు అనుమతులు పొంది, టెండర్ల ప్రక్రియ పూర్తి చెయ్యాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్ర ప్రజల అవసరాల దృష్ట్యా అత్యంత వేగంగా, ప్రాధాన్యంతో ఈ ప్రాజెక్టు పూర్తి చెయ్యాలని భావిస్తున్నామని…అందులో భాగంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని పనులు వేగంగా జరగాలని అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షలో ఇరిగేషన్‌ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌ కుమార్‌తో పాటు ఇతర ఇరిగేషన్‌ శాఖ అధికారులు, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 29-12-2024

Next Post

తమిళనాడును మొదట పాలించింది తెలుగువారే

మరిన్ని వార్తలు

అన్ని రంగాల్లో నెం.1గా ఏపీ..అదే మా లక్ష్యం
ఆంధ్రప్రదేశ్

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.1,200 కోట్లు విడుదల చేసిన సర్కారు

చైతన్యరధం
@ February 11, 2026
అరాచక ప్రవర్తనే వారి నైజం
ఆంధ్రప్రదేశ్

అరాచక ప్రవర్తనే వారి నైజం

చైతన్యరధం
@ February 11, 2026
రాజధానిగా అమరావతికి చట్టబద్ధత
ఆంధ్రప్రదేశ్

రాజధానిగా అమరావతికి చట్టబద్ధత

చైతన్యరధం
@ February 11, 2026
చైతన్యరధం ఈ పేపర్ 11-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 11-02-2026

కార్యకర్త
@ February 11, 2026
మానసిక ఉల్లాసానికే..
ఆంధ్రప్రదేశ్

మానసిక ఉల్లాసానికే..

చైతన్యరధం
@ February 11, 2026
చైతన్యరధం ఈ పేపర్ 10-02-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 10-02-2026

కార్యకర్త
@ February 10, 2026
బీటెక్‌ రవికి భద్రత పునరుద్ధరించండి
ఆంధ్రప్రదేశ్

ఏవియన్ ఇన్ఫ్లుయెంజాపై ఆందోళన వద్దు

చైతన్యరధం
@ February 10, 2026
ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడాలి
ఆంధ్రప్రదేశ్

ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడాలి

చైతన్యరధం
@ February 10, 2026
Load More

ముఖ్య వార్తలు

అన్ని రంగాల్లో నెం.1గా ఏపీ..అదే మా లక్ష్యం

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.1,200 కోట్లు విడుదల చేసిన సర్కారు

చైతన్యరధం
@ February 11, 2026
రాజధానిగా అమరావతికి చట్టబద్ధత

రాజధానిగా అమరావతికి చట్టబద్ధత

చైతన్యరధం
@ February 11, 2026
వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకూడదు

వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకూడదు

చైతన్యరధం
@ February 10, 2026

హిందూ సమాజానికి జగన్ రెడ్డి ద్రోహం

చైతన్యరధం
@ February 9, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

పీపీపీతో రాష్ట్రానికి అదనంగా 220 మెడికల్‌ సీట్లు

చైతన్యరధం
@ November 12, 2025 6:50 AM
మానవతామూర్తికి మహాసత్కారం!

మానవతామూర్తికి మహాసత్కారం!

చైతన్యరధం
@ November 4, 2025 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

అన్ని రంగాల్లో నెం.1గా ఏపీ..అదే మా లక్ష్యం

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.1,200 కోట్లు విడుదల చేసిన సర్కారు

చైతన్యరధం
@ February 11, 2026
అరాచక ప్రవర్తనే వారి నైజం

అరాచక ప్రవర్తనే వారి నైజం

చైతన్యరధం
@ February 11, 2026
రాజధానిగా అమరావతికి చట్టబద్ధత

రాజధానిగా అమరావతికి చట్టబద్ధత

చైతన్యరధం
@ February 11, 2026
మానసిక ఉల్లాసానికే..

మానసిక ఉల్లాసానికే..

చైతన్యరధం
@ February 11, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2024 తెలుగు దేశం పార్టీ. Privacy Policy | Terms ConditionsMarketed by Sanbrains
Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist