అనకొండ జగన్‌రెడ్డి అండ్ కో పాపాలతో తిరుమల కొండ అపవిత్రమైంది. గుడిని.. గుడిలో లింగాన్ని మింగిన చందంగా కలియుగ వేంకటేశ్వరస్వామినీ వదల్లేదు. జగన్‌రెడ్డి అండ్ కో పాప పంకిలాలతో భక్తులకు అభయమిచ్చే ఆపదమొక్కులవాడికీ కష్టాలు తప్పలే దు. కోట్లాది మంది అత్యంత ఇష్టంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం కమీషన్ల కక్కుర్తి తో కల్తీ నెయ్యితో అపవిత్రమైన వేళ ఆ వ్యవహారం బట్టబయలు కావడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వామి వారి భక్తులలో ఆగ్రహావేశాలు తెప్పించింది. అధికార కాంక్షతో ఏం చేసినా చెల్లుబాటు అవుతుందన్న అహంకారంతో అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు ఏడుకొండ లవాడితోనూ ఆడుకున్నారు. తిరుమల పవిత్రతను మంటగలిపి జగన్‌రెడ్డి, సుబ్బారెడ్డి, కరు ణాకర్‌రెడ్డి, ధర్మారెడ్డి భక్తుల మనోభావాలను దెబ్బతీసి అనంతపాపాలను మూటగట్టుకోవ డం చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది.
నెయ్యి మాత్రమే కాదు..ఇతర పదార్థాలూ నాసిరకమే
కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తిరుమలను ప్రక్షాళన చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబా బు ఆదేశాల మేరకు ఈవో శ్యామలరావు తిరుమలలోని వివిధ విభాగాలతో సమీక్షలు చేసిన సందర్భంలో ప్రసాదాల నాణ్యత సరిగా లేదని, వాసన వస్తుందని భక్తులు ఫిర్యాదు చేశారు. నెయ్యి నాణ్యతా పరీక్షల కోసం శాంపిళ్లను గుజరాత్‌కు చెందిన నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డ్‌కు పంపించారు. వారి నివేదికలో నెయ్యిలో పెద్దఎత్తున కల్తీ జరిగిందని తేలిం ది. పాలకు సంబంధించినవి కాకుండా ఇతరత్రా కొవ్వులు (సోయా బీన్, పొద్దుతిరుగుడు, ఆవాలు, అవిసెలు, పందికొవ్వు, బీఫ్ టాలో, చేప నూనె) కలిశాయని వెల్లడైంది. ఈ అంశంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం దర్యాప్తు చేస్తుండగా జగన్ రెడ్డి అండ్ కో దుర్మార్గాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నెయ్యి కల్తీ మాత్రమే కాకుండా లడ్డూలలో వాడే జీడిపప్పు, యాలకులు, కిస్మిస్‌లు కూడా నాసిరకమే వాడారన్న నిర్ఘాంత పోయే నిజాలు బయటపడటం విస్మయానికి గురిచేస్తోంది.
ఐదేళ్లూ భక్తుల విశ్వాసంతో చెలగాటం
దేవుడిపై విశ్వాసం లేని జగన్‌రెడ్డి ఐదేళ్ల అరాచక పాలనలో భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. తన హయాంలో 300కు పైగా దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలు జరిగాయి. నాడు ముఖ్యమంత్రిగా ఒక్కరోజు కూడా ఘటనా స్థలాలను పరిశీలిం చలేదు సరికదా కనీసం జరిగిన అపచారాలను ఖండిరచింది లేదు. తన పదవీ కాలంలో హిందూమత ఆచారాలు, తిరుమల తిరుపతి దేవస్థానం సాంప్రదాయాలపై ఏ మాత్రం విశ్వాసం చూపని ఆయన ఆలయాల పవిత్రతను దెబ్బతీశారు. క్రైస్తవాన్ని ఆచరించే జగన్ రెడ్డి, ఆయన కుటుంబానికి హిందూ మతం పట్ల విశ్వాసం లేదన్నది జగమెరిగిన సత్యం. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన ఈ పదిహేను సంవత్సరాల్లో తిరుమల సందర్శనలో ‘‘నాకు తిరుమల వెంకటేశ్వరుడి మీద పూర్తి నమ్మకం ఉంది’’ తిరుమల ఆలయ నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఫారంలో సంతకం చేయకపోవడమే ఇందుకు నిదర్శనం.
నాడు వైఎస్సా ర్ సైతం అసెంబ్లీ సాక్షిగా ఏడుకొండలు మీద విషం కక్కిన విషయం రాష్ట్ర ప్రజలకు విది తమే. జగన్‌రెడ్డి సైతం ఆయననే అనుసరిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా పింక్ డైమండ్ అంటూ బ్రహ్మపదార్థాన్ని అంటగట్టి చంద్రబాబుపై దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చాక కోర్టులో వేసిన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న ఆయన దుష్ట బుద్ధి జగద్విదితమే. అసలు పింక్ డైమండ్ ఉంటేనే కదా విచారణ చేయడానికి! తన రాజకీయ మనుగడ కోసం ఎదుటి వారి కి సైతం అవినీతిని ఆపాదించి చెప్పిన అబద్ధాన్నే వంద సార్లు చెప్పించి ప్రజలను నమ్మిం చాలని చూడటం ఆయన నైజం. తిరుమల కొండపై అన్యమత ప్రచారం చేయించిన విషయాన్ని ఎవరూ మరిచిపోలేరు.
టీటీడీని ఏటీఎంగా మార్చుకున్న జగన్‌రెడ్డి అండ్ కో
టీటీడీని ఆదాయ వనరుగా మార్చుకుని ఏటీఎంలా తన రాజకీయ అవసరాలకు వాడు కున్నారు జగన్‌రెడ్డి అండ్ కో. ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం దర్శనం టిక్కెట్లతో వ్యాపారం చేసి సాధారణ భక్తులను ఇబ్బందులకు గురిచేశారు. వీఐపీ బ్రేక్, సేవా టిక్కెట్లు, దర్శనం టిక్కెట్లు, ప్రసాదాలు ఇలా అన్నింటిలోనూ బ్లాక్ మార్కెట్ నడిపి కోట్లు దండుకున్నారు. శ్రీవారి ట్రస్టు సహా గత ఐదేళ్లలో అనేక కుంభకోణాలకు తెరతీశారు. అన్నప్రసాదం సైతం అధ్వానంగా మార్చిన వైనం..తరిగొండ వెంగమాంబ సత్రంలో భక్తులు తిరగబడిన సంఘట న దేశమంతా చూసింది. డాలర్ల కుంభకోణం, మయన్మార్‌లో శ్రీవారి తలనీలాలు పట్టు బడ్డటం, టీటీడీ ఫిక్స్‌డ్ డిపాజిట్ నిధులు రూ.5 వేల కోట్లు దారి మళ్ళించడానికి ప్రయ త్నించడం, ఈవో ధర్మారెడ్డి పీఏ సురేష్‌ని బెదిరించి అతను ఆత్మహత్య చేసుకునేలా చేయడం, శ్రీవారి సొమ్మును కాజేసీ 2021లో ఏపీ హైకోర్టు జడ్డికి రూ.2 కోట్ల విలువైన వజ్రాలు పొదిగిన బంగారు వాచ్‌తో టీటీడీ ఈవో ధర్మారెడ్డి చేత ప్రలోభపెట్టాలని ప్రయ త్నించడం వంటి కార్యాలతో తిరుమల ప్రతిష్టను దిగజార్చడం భక్తులు మరిచిపోరు. అసలు ఏ మాత్రం అర్హత లేని, హిందువు కాని ధర్మారెడ్డిని ఈవోగా నియమించడంలోనే ఆయన ఆంతర్యమేంటనేది అవగతమవుతుంది. అప్పటి చైర్మన్ సుబ్బారెడ్డి పాలక మండలి సమా వేశంలో సేవల ధరలను వేలానికి పెట్టడం చూసి భక్త జనం సైతం ఛీకొట్టారు. ఇక కరు ణాకర్‌రెడ్డి కూలగొట్టాల్సిన అవసరం లేకున్నా కాంట్రాక్టుల్లో కమీషన్ల కోసం భవనాలను కూలగొట్టించడం చూశాం. స్వామి వారి సొమ్మును సివిల్ వర్క్స్ పేరుతో దుర్వినియోగం చేయడంపైనా పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ వ్యవహారంలో భారీగా ముడుపులు దండుకున్నారు. సామాన్య భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా లడ్డూ సహా అన్నింటి ధరలనూ పెంచేశారు. రూ.25 ఉన్న లడ్డూ ధరను కరుణాకర్‌రెడ్డి హయాంలో రూ.50కి పెంచేశారు. రూ.100 ఉన్న పెద్ద లడ్డూ ధరను రూ.200కి పెంచేశారు. ధర పెరిగితే నాణ్య త పెంచాల్సింది పోయి జంతు కొవ్వులున్న కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేయించి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. తన పాలనలో చివరి ఆరునెలల్లో రూ.1400 కోట్ల టెండర్లలోని గూడుపుఠాణి ఏమిటో కూడా తేల్చాల్సిన రాష్ట్ర ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. కల్తీ నెయ్యి, నాసి రకం సరుకుల వ్యవహారంలో బాధ్యులను బోనెక్కించటంతో పాటుగా జగన్ రెడ్డి పాలనలో ఏడుకొండల స్వామి సన్నిధిలో జరిగిన అపచారాలు, ఆకృత్యా లన్నింటిపై నిజాలు వెలుగులోకి రావడం ఖాయం. అందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
పాపం ప్రక్షాళన అంటూ కొత్త నాటకం
పాపం జరిగింది జగన్ ప్రభుత్వ హయాంలో అయితే.. చంద్రబాబు పాపం ప్రక్షాళన కోసం పూజలు అంటూ కొత్త నాటకానికి తెరతీశారు. హిందూమత ఆచారాలు, తిరుమల తిరుపతి దేవస్థానం సాంప్రదాయాలపై ఏ మాత్రం విశ్వాసం చూపని ఆయన తగుదునమ్మా అంటూ తిరుమల సందర్శనకు బయలుదేరడం ఏ సంకేతం ఇస్తుంది. పాపం పండేసరికి తిరుమల విశిష్టత ఇప్పుడు గుర్తుకువచ్చిందా? మరి డిక్లరేషన్ మీద సంతకం విషయంలో మీ విశ్వా సం ఏమైంది? సతీ సమేతంగా డిక్లరేషన్‌పై సంతకం చేసి దర్శనానికి వెళ్లగలరా? పండిట్ నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ బ్రాహ్మణురాలైనా..ఆమె భర్త పార్సీ కాబట్టి డిక్లరేషన్‌పై సంతకం చేసి దర్శనానికి వెళ్లారు. కుటుంబమంతా క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్న జగన్‌రెడ్డి డిక్లరేషన్‌పై సంతకం పెట్టాల్సిన బాధ్యత లేదా? కల్తీ నెయ్యిపై విచారణ జరిపిం చాలని ప్రధానికి లేఖ రాసిన ఆయన తన పాలనలో టీటీడీ చైర్మన్ల అవినీతిపై విచారణ కోరే ప్రయత్నం చేయరు. చేసిన పాపం చాలక లడ్డూ ప్రసాదాన్ని రాగి చెంబుతో, పందికొవ్వు, చేపనూనెలను బంగారంతో పోల్చే దుస్సాహసానికి సైతం ఒడిగట్టడం క్షమించరాని నేరం. హిందూ మతం పట్ల విశ్వాసం లేని ఆయన తిరుమల పవిత్రత గురించి మాట్లాడడం సిగ్గు చేటు. సచ్చీలురమని దొంగ ప్రమాణాలు చేస్తే నమ్ముతారనుకోవడం పొరపాటు. తిరుమల దర్శనం అంటూ భక్తులను, రాష్ట్ర ప్రజలను వంచించేందుకు కొత్త నాటకానికి తెరలేపిన జగన్‌రెడ్డిని విశ్వసిస్తారనుకోవడం అసాధ్యం.
సౌజన్య, అనలిస్ట్