చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
    • తెలంగాణ కమిటీలు
    • అనుబంధ విభాగాలు
    • బి.సి సాధికార సమితి
    • ఎస్.సి సాధికార సమితి
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఇది.. అత్యుత్తమ ప్యాకేజీ!

ప్రభుత్వ సహాయక చర్యల కృషిని ప్రశంసిస్తున్నారని వ్యాఖ్య

by చైతన్యరధం
Sep 18, 2024 at 6:00am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఇది.. అత్యుత్తమ ప్యాకేజీ!
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • గతంలో.. ఏ ప్రభుత్వం చేసింది లేదు..
  • కష్టాలున్నా.. మానవత్వంతో ముందుకొస్తున్నా
  • ప్రతి ఇంటికీ రూ.25 వేల ఆర్థిక సాయం
  • దెబ్బతిన్న చిరు వ్యాపారులకూ రూ.పాతికవేలు
  • ఎంఎస్‌ఎంఈల టర్నోవర్‌బట్టి పరిహారం
  • బాధిత రైతులకూ పూర్తిస్థాయి ఆర్థిక భరోసా
  • చేనేత, మత్స్యకార వర్గాలకూ వరద పరిహారం
  • బాధితులకు ఆహార సరఫరాలో లోటు చేయలేదు
  • నష్టపోయిన ప్రతి ఒక్కరినీ అన్నివిధాలా ఆదుకుంటా
  • వరద ప్యాకేజీ ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు
  • ప్రభుత్వ సహాయక చర్యల కృషిని ప్రశంసిస్తున్నారని వ్యాఖ్య

అమరావతి (చైతన్య రథం): రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా కృష్ణా, బుడమేరు వరదలు సంభవించి విజయవాడ నగరాన్ని అతలాకుతం చేసినప్పటికీ, కేవలం పదిరోజుల్లో అందరి సహకారంతో నగరంలో పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావడం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ వరదవల్ల నష్టపోయిన ప్రతి ఒక్క కుటుంబాన్నీ అన్ని విధాలుగా ఆదుకునేందుకు అత్యుత్తమ ప్యాకేజీ రూపొందించి అమలు చేయడం జరుగుతుందంటూ ప్యాకేజీ వివరాలను చంద్రబాబు ప్రకటించారు. ‘గతంలో ఎప్పుడు లేనివిధంగా భారీస్థాయిలో కురిసిన వర్షాలవల్ల కృష్ణానదిలో 11.43 లక్షల క్యూసెక్కుల వాటర్‌ రావడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. నిజానికి ఈ ప్రాజెక్టు 11.09 లక్షల క్యూసెక్కుల వాటర్‌ డిశ్చార్జ్‌ చేసే సామర్థ్యంతో రూపొందించారు. తొలి ఆనకట్టు 100 ఏళ్ల క్రిందట, ప్రస్తుత ప్రాజెక్టు 75 ఏళ్లక్రిందట నిర్మించి దాదాపు 175 ఏళ్ల పురాతనమైన ఈ ప్రాజెక్టులోకి ఒకేసారి 11.43 లక్షల క్యూసెక్కుల వరద రావడం భారీ విపత్తుకు కారణమైంది’ అని చంద్రబాబు వివరించారు.

అదే సమయంలో బుడమేరు కూడా పొంగడంవల్ల విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయని, దాదాపు ఏడురోజులపాటు 6-7 అడుగులమేర నీరు నగరంలోని పలు ప్రాంతాల్లో నిలిచిపోయిందన్నారు. అదేవిధంగా తమహయాంలో ప్రారంభించిన బుడమేరు ఆధునీకరణ పనులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం కూడా మరొక కారణమని అంటూ, బుడమేరు పరీవాహక ప్రాంతం పూర్తిగా దురాక్రమణలు, కబ్జాలు గురవ్వడం ఇంకో కారణమన్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందినవారి బోట్లు ఒక్కోటి 40 మెట్రిక్‌ టన్నులుండే 3 బోట్లను కృష్ణా నదిలో వదిలిపెట్టడంవల్ల అవి వచ్చి నేరుగా కౌంటర్‌ వెయిట్‌ను ఢీకొట్టడంవల్ల అవి ఇరిగిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. మొన్నటివరకు వాటికి రిపేర్లు చేయడంతోపాటు, ఆ బోట్లను తీయడానికి ఎంత కష్టపడటం జరిగిందో అందరూ చూశారన్నారు. రాష్ట్రంలో ఉండే గజ ఈతగాళ్లు, అనుభవం ఉన్నవాళ్లు వచ్చినా తీయలేని పరిస్థితి ఏర్పడిరదన్నారు. అయినా అన్ని సమస్యలను అధిగమించి తగు చర్యలు తీసుకుంటున్నట్టు చంద్రబాబు వివరించారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 15-03-2026

చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026

రూ.119 కోట్లతో టీసీసీ!

నాతో పాటు మా మంత్రివర్గం, ఉన్నతాధికారులు పది రోజులపాటు రేయింబవళ్లు పర్యవేక్షించడం వల్ల నగరంలో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈనెల 20కి 100 రోజులవుతుందని, ఈలోగానే ఎదురైన విపత్కరమైన పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవడం జరిగిందన్నారు.
వరద విప్తతునుండి ప్రజలను కాపాడేందుకు తమ ప్రభుత్వం చేసిన అవిరళ కృషిని రాష్ట్రంతోపాటు దేశం మొత్తం గుర్తించిందన్నారు. నేను అహ్మదాబాద్‌ వెళ్లినప్పుడు ఈ విషయాన్ని అందరూ ప్రస్తావిస్తూ ప్రభుత్వం చేసిన అవిరళ కృషిని ఎంతగానో మెచ్చుకున్నారన్నారని చంద్రబాబు ప్రస్తావించారు. అదేవిధంగా పలువురు దాతలు స్వచ్చందంగా ముందుకువచ్చి పెద్ద ఎత్తున విరాళాలు అందజేస్తున్నారని, వారందరికీ పేరుపేరునా రాష్ట్ర ప్రభుత్వం తరపున, 5 కోట్ల ప్రజల తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ప్యాకేజీ వివరాలను చంద్రబాబు ప్రకటిస్తూ.. విజయవాడ నగరంలోని 32 వార్డుల్లోని 179 సచివాయాల్లోని వరద బాధితులను అన్నివిధాలుగా ఆదుకునేందుకు ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటు పాడైపోయిన గృహోపకరణాల మరమ్మతుకు తగు చర్యలు కూడా తీసుకుంటున్నట్టు చంద్రబాబు వివరించారు.

ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజ్‌ ప్రకారం 32వార్డుల్లోని 179 సచివాలయాల పరిధిలో గ్రౌండ్‌ ప్లోర్‌ నీటి మునిగిన వాళ్లందరికీ రూ.25 వేల చొప్పున ఆర్థికసాయం అందజేస్తామని, ఒక ఇంటికి రూ.25 వేలు ఇవ్వడమనేది చరిత్రలో ఇది మొదటిసారన్నారు. ఒకప్పుడు రూ.4 వేల రూపాయలు ఇచ్చిన పరిస్థితి ఉందన్నారు. వరద సమయంలో ఏ ఒక్కరికీ భోజనాల విషయంలో ఏమాత్రము లోటుచేయలేదని, రాయితీపై కూరగాయలు, 25 కేజీల బియ్యం, కేజీ పామాయిల్‌, కేజీ పంచదార, కేజీ పప్పు, రెండు కేజీల ఉల్లిపాయలు, రెండుకేజీల ఆలుగడ్డలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పుడు ప్రతి ఇంటికి రూ.25 వేల ఆర్థికసాయం చేస్తున్నామన్నారు.

అదేవిధంగా ఫస్ట్‌ ఫ్లోర్‌, సెకండ్‌ ఫ్లోర్‌, ఆపైన అంతుస్తుల్లో ఉండే అందరికీ రూ.10 వేల ఆర్థికసాయం చేస్తామన్నారు. వరదలో నీటమునిగిన ఇతర ప్రాంతాలకు చెందినవారికి కూడా రూ.10 వేలు సాయం అందజేస్తామన్నారు. కిరాణా షాపులు, టీ కొట్లు వంటి షాపులున్న అందరికీ రూ.25 వేల సాయం అందచేస్తామన్నారు. అదేమాదిరిగా రిజిస్టర్‌ చేసుకున్న ఎంఎస్‌ఎంఈలకు టర్నోవర్‌ రూ.40 లక్షలకంటే తక్కువవుంటే వాళ్లందరూ జీఎస్టీ ఫైల్‌ చేయాల్సిన పనిలేదని, జీఎస్టీ రిజిస్ట్రేషన్‌ చేసుకోనివాళ్లకి రూ.50 వేలు ఇస్తామన్నారు. అదే సమయంలో ఎంఎస్‌ఎంఈలు రూ.40 లక్షలనుంచి రూ.1.5 కోట్లు టర్నోవర్‌ ఉన్నవాళ్లకి రూ.లక్ష ఇస్తామన్నారు. అలాగే రూ.1.5 కోట్లు ఆపైనవుంటే రూ.1.5 లక్షలు ఇస్తామన్నారు. టూవీలర్స్‌కు ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌, రిపేర్లు చేసుకునేందుకు సహకరిస్తున్నామన్నారు. ఇప్పటివరకు రూ.71.50 కోట్లకు క్లెయిమ్‌కు సంబంధించి 9,088 వెహికల్స్‌ క్లెయిమ్స్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారన్నారు. వీటిలో 2,345 క్లెయిమ్స్‌ సెటిలయ్యాయని, రూ.6.21 కోట్లు అందజేయడం జరిగిందన్నారు. 6,748 క్లెయిమ్స్‌ పెండిరగ్‌ ఉన్నాయని, ఇందుకు రూ.65.29 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు.

గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని సీఎం చంద్రబాబు అన్నారు. విప్తతుల నిర్వహణకై కేంద్రం ఇచ్చిన కలామిటీ ఫండ్‌ దాదాపు రూ.2 వేల కోట్ల ఖర్చుపెట్టి వాటికి ఎటువంటి లెక్కలు చూపకపోవడం వల్ల కేంద్రంనుండి రావాల్సిన నిధులు ఆగిపోయాయన్నారు. గత ప్రభుత్వం పోలవరం నిధులతో పాటు పంచాయతీరాజ్‌లో ఫైనాన్స్‌ కమిషన్‌ డబ్బులు రూ.990 కోట్లు డైవర్ట్‌ చేయడం జరిగిందన్నారు. ఎంతో కష్టకాలంలో రూ.990 కోట్లు ఇచ్చి రూ.1,100 కోట్లు మళ్లీ తీసుకు రావడం జరిగిందన్నారు. రూ.1650 కోట్లు ధాన్యం ఇచ్చిన రైతులకు బకాయిలుంటే అవి మేమే చెల్లించిన పరిస్థితి ఏర్పడిరదన్నారు. రూ.10.50 లక్షల కోట్లు అప్పుతో పాటు పెద్దఎత్తున పెండిరగ్‌ బిల్లు చెల్లించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రూ.518 కోట్లు తక్షణమే విడుదల చేయాలని కేంద్రానికి లేఖ రాస్తున్నామన్నారు.

రైతులకు పూర్తిస్థాయి భరోసా..
వరదల కారణంగా నష్టపోయిన రైతులను పూర్తిస్థాయిలో ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. రైతుకు సాయం ప్రకటిస్తూ.. హెక్టార్‌ వరికి రూ.25 వేలు, ఎకరాకు రూ.10 వేలు సాయం అందిస్తామన్నారు. హెక్టార్‌ పత్తికి రూ.25 వేలు, వేరుశనగకు రూ.25 వేలు, హెక్టార్‌ చెరకుకు రూ.25 వేలు, హెక్టార్‌ పొగాకుకు రూ.15 వేలు, హెక్టార్‌ మొక్కజొన్న, రాగికి రూ.15 వేలు ఆర్థికసాయం అందిస్తామన్నారు. హెక్టార్‌ సోయాబీన్‌, పొద్దుతిరుగుడు, పొగాకుకు రూ.15 వేలు. జనపనార, కొర్రలు, సామలకు రూ.15 వేలు, పసుపు, అరటికి రూ.35 వేల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారు. కూరగాయలకు రూ.25 వేలు, మిరపకు రూ.35 వేలు, బొప్పాయికి రూ.25 వేలు, టమాటకు రూ.25 వేలు, జామకు రూ.35 వేలు, పూలకు రూ.25 వేలు, ఉల్లిపాయ రూ.25 వేలు, నిమ్మకు రూ.35 వేలు సాయం అందించనున్నట్టు ప్రకటించారు. మామిడికి రూ.35 వేలు, కాఫీకి రూ.35 వేలు సాయం. పుచ్చకాయకు రూ.25 వేలు, నర్సరీకి రూ.25 వేలు, దానిమ్మకు రూ.35 వేలు, సపోటకు రూ.35 వేలు, డ్రాగన్‌ ఫూట్‌కు రూ.35 వేలు, పామాయిల్‌ చెట్టుకు రూ.1500, సెరీకల్చర్‌కు రూ.25 వేలు,

కొబ్బరి చెట్టుకు రూ.1500 సాయం ప్రకటించారు.
పశునష్టం జరిగిన వారినీ ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం వెల్లడిరచారు. ఒక్కో కోడికి రూ.100, పశువులకు రూ.50వేలు, ఎద్దులకు రూ.40వేలు. దూడలకు రూ.25వేలు, గొర్రెలకు రూ.7500 అందిస్తామన్నారు. షెడ్డు ధ్వంసమైతే రూ.5వేలు, ఎడ్ల బండ్లు కోల్పోయిన వారికి కొత్తవి అందిస్తామన్నారు. అలాగే, మత్స్యకారులనీ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఫిషింగ్‌ బొట్‌, నెట్‌ పాక్షికంగా దెబ్బతింటే రూ.9 వేలు, పూర్తిగా డ్యామేజ్‌ అయితే రూ.20 వేలు ఇస్తామన్నారు. వరదల్లో నష్టపోయిన ప్రతి చేనేత కార్మికులకి రూ.25 వేలు ఇస్తామన్నారు. వరదల్లో నష్టపోయిన 2 వీలర్స్‌ కి రూ.3 వేలు, ఆటోలకి రూ.10 వేలు ఇస్తాం, తోపుడు బళ్ళు ఎంత రేటు అయినా కొత్తవి కొనిస్తాం.
పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానమిస్తూ.. ముంపుకు గురైన ప్రాంతాల్లో ప్రస్తుతం నివశిస్తున్న బాధితులకు మరియు కౌలుదారులకు ఈ ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.

ఎట్టి పరిస్థితుల్లో విశాఖ ఉక్కును ప్రైవేటీకరించకుండా చూస్తామన్నారు. గతంలో తమ హయాంలోనే విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు అవసరమైన ఆర్థిక సహాయన్ని కేంద్రం నుండి తీసుకురావడం జరిగిందన్నారు. అదేవిధంగా ఈసారి కూడా కేంద్రంనుండి తగిన ఆర్థిక సహాయాన్ని పొందేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను లాభాలబాట పట్టించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు సాంకేతికంగా, లాజిస్టిక్‌, పరిపాలనపరంగా ఉన్న సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు ఉద్యోగులు కూడా సహకరించాల్సి ఉందన్నారు. అమరావతిపై విమర్శలు చేస్తున్న తెలివైన మేధావులు చెన్నై, బెంగళూరు, ముంబై, హైదరాబాద్‌ సిటీలను మార్చేయమని చెప్పాలని ఎద్దేవా చేశారు. అమరావతిపై ఎందుకు విషం కక్కుతున్నారని ఆయన ప్రశ్నించారు? తిరుపతి, నెల్లూరు, కర్నూలు, రాజమహేంద్రవరంలకు వరదలు వచ్చి

Previous Post

సేఫ్‌జోన్‌లో అమరావతి

Next Post

బీసీలకు పూర్వవైభవం

మరిన్ని వార్తలు

చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 15-03-2026

కార్యకర్త
@ March 15, 2026
చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 14-03-2026

కార్యకర్త
@ March 14, 2026
రూ.119 కోట్లతో టీసీసీ!
ఆంధ్రప్రదేశ్

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!
ఆంధ్రప్రదేశ్

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం
ఆంధ్రప్రదేశ్

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం
ఆంధ్రప్రదేశ్

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్

విద్యుత్‌రంగ వెలుగులకు ఇదే సాక్ష్యం

చైతన్యరధం
@ March 14, 2026
రాష్ట్రానికే గర్వకారణం
ఆంధ్రప్రదేశ్

హెచ్‌సీలకు ప్రత్యేక పదోన్నతులు

చైతన్యరధం
@ March 14, 2026
Load More

ముఖ్య వార్తలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
అమూల్ తరహాలో స్వయం బ్రాండ్

ప్రజా ప్రతినిధుల ద్వారా లబ్దిదారులకు సంక్షేమ లేఖలు

చైతన్యరధం
@ March 13, 2026
మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

మారిటైం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్‌గా ఏపీ

చైతన్యరధం
@ March 13, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

రూ.119 కోట్లతో టీసీసీ!

రూ.119 కోట్లతో టీసీసీ!

చైతన్యరధం
@ March 14, 2026
అన్నదాతకు కూటమి భరోసా!

అన్నదాతకు కూటమి భరోసా!

చైతన్యరధం
@ March 14, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తాం

బడి భోజనం బాగాలేకపోతే కఠినచర్యలు

చైతన్యరధం
@ March 14, 2026
మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

మీ విజయగాథ స్ఫూర్తిదాయకం

చైతన్యరధం
@ March 14, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 40 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 40 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist