చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా 

చైతన్యరధం by చైతన్యరధం
October 31, 2026
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు
  • బ్యాలెట్ పేపర్ల భద్రతలో ఎలాంటి లోపాలకు తావుండకూడదు
  • ఫిర్యాదులపై తక్షణ స్పందన, నిష్పక్షపాత విచారణ తప్పనిసరి
  • రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా

అమరావతి (చైతన్యరథం): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా పూర్తి పారదర్శకతతో నిర్వహించేందుకు కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల పరిశీలకులు, పోలీసు అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఆదేశించారు. ఎన్నికల విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం, పక్షపాత ధోరణికి తావులేకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణం కల్పించాలని సూచించారు. శుక్రవారం ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి డాక్టర్ ఎ. మల్లిఖార్జున, ఐజీ బి. రాజకుమారిలతో కలిసి విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి సీడీఎంఏ డాక్టర్ పి.సంపత్కుమార్, కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల పరిశీలకులు, పోలీసు కమిషనర్లు, డీఐజీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ, శాంతి భద్రతలు, రాజకీయ పార్టీల నుంచి అందుతున్న ఫిర్యాదులు, తదుపరి విడత ఎన్నికల సన్నద్ధత, పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్లపై సమీక్షించారు.

ఎన్నికల ప్రారంభ దశలో ఏడు జిల్లాల్లో జరిగిన ఘటనలు చోటుచేసుకోవడంతో పలు ఫిర్యాదులు అందాయని కమిషనర్ తెలిపారు. నామినేషన్ల దాఖలకు ఆటంకాలు కల్పించడం, అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవడం, ఎన్నికల సిబ్బందిపై ఒత్తిడి తీసుకురావడం వంటి అంశాలపై ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి ఫిర్యాదును సంబంధిత డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లకు పంపించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో నిష్పక్షపాత ధోరణి అత్యంత ముఖ్యమని, న్యాయం జరగడమే కాకుండా ప్రజలకు న్యాయం జరిగినట్లు స్పష్టంగా కనిపించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్పష్టం చేశారు. ఎన్నికల అక్రమా లు, అవకతవకలపై ఫిర్యాదులు అందినప్పుడు సంబంధిత అధికారులు తక్షణం స్పందించి నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అన్ని రికార్డులు న్యాయపరమైన పరిశీలనకు లోబడి ఉంటాయని, అభ్యంతరాలు ఉన్నవారు ఎన్నికల ట్రిబ్యునల్ను ఆశ్రయించవచ్చని తెలిపారు. ఎన్నికల సమయంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టడం అధికారుల ప్రధాన బాధ్యత అన్నారు. హింసాత్మక ఘటనలను పూర్తిగా నివారించగలిగితే ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు మార్గం సుగమం అవుతుందని తెలిపారు. తదుపరి విడత పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, తుఫాను ప్రభావిత జిల్లాల్లోనూ అధికారులు చేస్తున్న ఎన్నికల సన్నద్ధతను అభినందించారు.

సున్నితమైన, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత
రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి డాక్టర్ ఎ.మల్లిఖార్జున మాట్లాడుతూ… ఎన్నికలను ప్రశాంతం గా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సున్నిత, అత్యంత సున్నిత, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో లోపల, బయట సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేయాలని… అయితే ఓటర్లగోప్యతకు ఎలాంటి భంగం కలగకుండా తగిన ప్రదేశాల్లో కెమెరాలను అమర్చాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఓటింగ్ కంపార్ట్మెంట్కు ఎదురుగా కెమెరాలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి సంబంధించిన పూర్తి వివరాలతో సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని, పోలింగ్ స్టేషన్ నంబర్, ఓటర్ల సంఖ్య,మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు తదితర వివరాలను పొందుపరచాలని తెలిపారు. పోలింగ్, రీపోలింగ్, కౌంటింగ్ తేదీలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు కార్యాచరణ

ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
పోలీసు సిబ్బంది మోహరింపునకు సంబంధించి ఇప్పటికే నిర్దేశించిన డిప్లొయ్మెంట్ ప్లాన్ను కచ్చితం గా అమలు చేయాలని తెలిపారు. సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి రూపొందించిన పోలీసు బందోబస్తు ప్రణాళికను యథాతథంగా అమలు చేయాలని, సాధారణ పోలింగ్ కేంద్రాల వద్ద స్టాటిక్ పోలీసు బృందాలతోపాటు మొబైల్ పోలీసు బృందాలను కూడా ఏర్పాటు చేయా లని సూచించారు. పోలింగ్కు ముందు రోజు, పోలింగ్ రోజున పోలీసు, రెవెన్యూ, జోనల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. హింసాత్మక ఘటనలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.

ఎన్నికల ప్రక్రియలో ప్రతి బ్యాలెట్ పేపర్కు పూర్తి జవాబుదారీతనం ఉండాలని, ఒక్క బ్యాలెట్ పేపర్ కూడా గల్లంతు కాకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలనికార్యదర్శి డాక్టర్ మల్లిఖార్జున ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల నుంచి రిసెప్షన్ కేంద్రాలకు, అక్కడి నుంచి స్ట్రాంగ్ రూమ్లకు బ్యాలెట్ బాక్సులను తరలించే ప్రతి దశలో నిర్దేశించిన నిబంధనలు, ప్రొటోకాల్ను కచ్చితంగా పాటించాలని తెలిపారు. బ్యాలెట్ బాక్సుల రవాణా, స్వీకరణ, భద్రపరిచే ప్రక్రి యలో వీడియోగ్రఫీ, సీసీ టీవీ పర్యవేక్షణ, అధికారుల సంతకాలు, రిజిస్టర్ల నిర్వహణ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. బ్యాలెట్ పేపర్లు, సంబంధిత ఎన్నికల పత్రాలను రిటర్నింగ్ అధికారులకు అప్పగించే సమ యంలో వాటి సంఖ్య, తేదీ తదితర వివరాలతో లేఖ సిద్ధం చేసి, అధికారుల నుంచి రసీదు పొందాలని తెలిపారు స్ట్రాంగ్ రూమ్లకు సుమారు 100 మీటర్ల దూరంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పోలీసు, సివిల్ అధికారులను అందుబాటులో ఉంచా లని సూచించారు. స్ట్రాంగ్ రూమ్ పరిసరాల్లో జరుగు తున్న కార్యకలాపాలను అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పరిశీలించేందుకు తగిన అవకాశం కల్పించాలని తెలిపారు.

పోలింగ్కు ముందు 48 గంటల నిశ్శబ్ద కాలానికి సంబంధించిన నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. మద్యం విక్రయాల నిషేధం, ఎన్నికల ప్రచారంపై వర్తించే ఆంక్షలను ప్రజలకు, రాజకీయ పార్టీలకు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు పత్రికా ప్రకటనల ద్వారా నిబంధనలను ప్రజలకు వివరించాలని తెలిపారు. ఎన్నికల ప్రచారం కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన స్థానికేతర రాజకీయ నాయకులు, కార్యకర్తలు నిబంధనల ప్రకారం సంబంధిత పట్టణ స్థానిక సంస్థ ల పరిధిని విడిచివెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గెస్ట్ హౌస్లు, హోటళ్లు, కళ్యాణ మండ పాల్లో పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించాలని, అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.

ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో ప్రారంభించి రాత్రి 8 గంటల్లోగా పూర్తిచేసి ఫలితాలు ప్రకటించేలా ఏర్పాట్లు చేయాలని డాక్టర్ మల్లిఖార్జున సూచించారు. మొత్తం 12 గంటల వ్యవధిలో కౌంటింగ్ పూర్తి చేసేందుకు అవసరమైన కౌంటింగ్ టేబుళ్లు, అదనపు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. పోలింగ్ కేంద్రానికి చేరుకున్న అర్హులైనఓటర్లందరికీ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అనుమతించాలని సూచించారు. అలాగే, పోలింగ్ ఏజెంట్లకు సంబంధించి క్రెడెన్షియల్స్ వెరిఫికేషన్ పేరుతో ఎలాంటి అనవసర జాప్యం చేయరాదని, ఎన్నికల నిబంధనల ప్రకారం వారి విధుల నిర్వహణకు ఆటంకం కలిగించరాదని స్పష్టంచేశారు. కౌంటింగ్ ప్రక్రియలో అనవసర జాప్యం జరగకుండా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, కౌంటింగ్ సిబ్బందికి ముందస్తు శిక్షణ అందించాలని సూచించారు. కౌంటింగ్ హాళ్లలో అవసరమైన మౌలిక సదుపాయాలు, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు ముందుగానే పూర్తిచేయాలని, పోస్టల్ రోజున పోలీసు, రెవెన్యూ, జోనల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. హింసాత్మక ఘటనలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.

ఎన్నికల ప్రక్రియలో ప్రతి బ్యాలెట్ పేపర్కు పూర్తి జవాబుదారీతనం ఉండాలని, ఒక్క బ్యాలెట్ పేపర్ కూడా గల్లంతు కాకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలనికార్యదర్శి డాక్టర్ మల్లిఖార్జున ఆదేశించారు.
పోలింగ్ కేంద్రాల నుంచి రిసెప్షన్ కేంద్రాలకు, అక్కడి నుంచి స్ట్రాంగ్ రూమ్లకు బ్యాలెట్ బాక్సులను తరలించే ప్రతి దశలో నిర్దేశించిన నిబంధనలు, ప్రొటోకాల్న కచ్చితంగా పాటించాలని తెలిపారు. బ్యాలెట్ బాక్సుల రవాణా, స్వీకరణ, భద్రపరిచే ప్రక్రి యలో వీడియోగ్రఫీ, సీసీ టీవీ పర్యవేక్షణ, అధికారుల సంతకాలు, రిజిస్టర్ల నిర్వహణ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. బ్యాలెట్ పేపర్లు, సంబంధిత ఎన్నికల పత్రాలను రిటర్నింగ్ అధికారులకు అప్పగించే సమ యంలో వాటి సంఖ్య, తేదీ తదితర వివరాలతో లేఖ సిద్ధం చేసి, అధికారుల నుంచి రసీదు పొందాలని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్లకు సుమారు 100 మీటర్ల దూరంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పోలీసు, సివిల్ అధికారులను అందుబాటులో ఉంచా లని సూచించారు. స్ట్రాంగ్ రూమ్ పరిసరాల్లో జరుగు తున్న కార్యకలాపాలను అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పరిశీలించేందుకు తగిన అవకాశం కల్పించాలని తెలిపారు.

పోలింగ్ కు ముందు 48 గంటల నిశ్శబ్ద కాలానికి సంబంధించిన నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. మద్యం విక్రయాల నిషేధం, ఎన్నికల ప్రచారంపై వర్తించే ఆంక్షలను ప్రజలకు, రాజకీయ పార్టీలకు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు పత్రికా ప్రకటనల ద్వారా నిబంధనలను ప్రజలకు వివరించాలని తెలిపారు. ఎన్నికల ప్రచారం కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన స్థానికేతర రాజకీయ నాయకులు, కార్యకర్తలు నిబంధనల ప్రకారం సంబంధిత పట్టణ స్థానిక సంస్థ ల పరిధిని విడిచివెళ్లేలా చర్యలు తీసుకోవాలని సున్నిత, అత్యంత సున్నిత ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు మరింత పటిష్టం చేయాలి: ఐజీ రాజకుమారి
ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్టమైన పోలీసు భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఐజీ బి.రాజకుమారి పోలీసు అధికారులకు సూచించారు. ముఖ్యంగా సున్నిత, అత్యంత సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రతి కదలికను రికార్డు చేయాలని ఆదేశించారు.

ఎన్నికల సమయంలో పోలింగ్ కేంద్రాలు, సమ స్యాత్మక ప్రాంతాల్లో వీడియోగ్రఫీ, డ్రోన్ కెమెరాలు, బాడీ వోర్న్ కెమెరాలను వినియోగించాలని సూచించా రు. ముఖ్యంగా సున్నిత, అత్యంత సున్నిత ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలకు పాల్పడేందుకు ప్రయత్నించే వ్యక్తులను గుర్తించి, వారి చర్యలను ఆధారాలతో సహా రికార్డుచేసేలా సాంకేతిక పరికరాలను సమర్థవంతం గా ఉపయోగించాలని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలనుంచి పోలింగ్ కేంద్రాలకు, అక్కడ నుంచి కలెక్షన్ పాయింట్ల వరకు బ్యాలెట్ బాక్సులకు పూర్తి భద్రత కల్పించాలని ఆదేశించారు. బ్యాలెట్ బాక్సుల తరలింపు ప్రక్రియలో ఎలాంటి అన ధికారిక విరామాలు, మధ్యంతర నిలుపుదలలు ఉండ కూడదని స్పష్టంచేశారు. పోలింగ్ ప్రారంభమైన తర్వా త నిర్ణీత కలెక్షన్ పాయింట్ మినహా మార్గమధ్యంలో ఎక్కడా ఆగకుండా నిర్దేశిత మార్గంలోనే తరలించేలా పర్యవేక్షించాలని సూచించారు.
స్ట్రైకింగ్ ఫోర్సెస్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ను అవసరమైన ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా అందుబాటు లో ఉంచాలని తెలిపారు. ఎస్పీలు, డీఎస్పీల ఆధ్వర్యం లోని ప్రత్యేక బలగాలను పరిస్థితులకు అనుగుణంగా. వినియోగించాలని సూచించారు. ముఖ్యంగా హైపర్ సెన్సిటివ్ ప్రాంతాలను పోలీసు అధికారులు తరచూ సందర్శిస్తూ పరిస్థితులనుసమీక్షించాలని ఆదేశించారు.

పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వర్తించే పోలీసు సిబ్బందికి ముందుగానే సమగ్ర బ్రీఫింగ్ ఇవ్వాలని తెలిపారు. పోలింగ్ కేంద్రం లోపలికి పోలీసు సిబ్బంది తమంతట తాము ప్రవేశించకూడదని, సంబంధిత ప్రిసైడింగ్ అధికారి పిలుపు లేదా అనుమతి మేరకే లోపలికి వెళ్లాలని స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లో నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ సంయమనంతో వ్యవహరించాలని సూచించారు.
పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో పెద్ద గుంపులు ఏర్పడకుండా నిరంతరం పర్యవేక్షించాలని, చిన్నచిన్న గుంపులుగా ఉన్నప్పటికీ వెంటనే చెదరగొట్టాలని ఆదే శించారు. పోలింగ్కేంద్రానికి నిర్దేశించిన 100 మీటర్ల పరిధిలో ఎవరూ గుమికూడకుండా చూడాలని, అవ సరమైనచోట చట్టబద్ధమైన పోలీసు చర్యలు తీసుకుని పరిస్థితిని అదుపులో ఉంచాలని సూచించారు.

పోలింగ్ ముగింపునకు ముందు చివరి గంట అత్యంత కీలకమైనదని ఐజీ రాజకుమారి పేర్కొన్నా రు. ఈసమయంలో ప్రాక్సీ ఓటింగ్, ఇతరుల పేరుతో ఓటు వేసే ప్రయత్నాలు (ఇంపర్సనేషన్) వంటి అక్ర మాలకు అవకాశం ఉన్నందున పోలీసు సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన ధికారిక వ్యక్తులు పోలింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించ కుండా కఠిన నిఘా ఏర్పాటుచేయాలని, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎన్నికల సమయంలో అందే అత్యవసర సమాచా రం, ఫిర్యాదులు, పోలీసు సహాయం కోరే కాల్స్కు తక్షణమే స్పందించేలా ఎస్పీలు కొన్ని క్యూ టీమ్లను రిజర్స్లో సిద్ధంగా ఉంచాలని సూచించారు. అవసరమైన సందర్భాల్లో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునేలా బలగాల ను అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహిం చేందుకు ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని… ముందస్తు అప్రమత్తత, పటిష్టమైన భద్రత, సమయానుకూల స్పందనతో ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఐజీ రాజకుమారి సూచించారు.

 

Previous Post

చైతన్యరధం ఈ పేపర్ 31-10-2026

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.