తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాన్ని పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మంగళవారం గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆనాటి ప్రమాణ స్వీకారోత్సవ ఫోటోను ఎక్స్ వేదికగా పంచుకున్నారు. నలభై ఒక్క ఏళ్ళ క్రితం 1983లో ఇదే రోజు (జనవరి 9) నందమూరి తారక రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటారు. దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారు. మళ్ళీ చరిత్ర పునరావృతం కావాలి. విధ్వంసకర పాలకుల పీడ నుంచి తెలుగు జాతి విముక్తిని పొంది ప్రపంచంలోనే అత్యుత్తమ స్థానాన్ని అందుకోవాలి. ఎన్టీఆర్ స్ఫూర్తిగా ఆ మహోదయం కోసం ఉద్యమిద్దామని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.