చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

రాష్ట్రంలో మహామ్మారిలా నిరుద్యోగం, గంజాయి : నారా లోకేష్ వెల్లడి

by చైతన్యరధం
March 30, 2023
in ఆంధ్రప్రదేశ్, తాజా సంఘటనలు
Nara Lokesh

Nara Lokesh

Share on FacebookShare on TwitterShare on Whatsapp

రాష్ట్రం లో నిరుద్యోగం, గంజాయి సమస్యలు మహమ్మారిలా మారాయి. వీటి నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ సీరియస్ గా ఆలోచించాలి. టిడిపి అధికారంలోకి రాగానే ఈ రెండింటిపై ప్రత్యేక శ్రద్ధ వహించి పూర్తిగా నిర్మూలిస్తాం. అదే సమయంలో సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూనే అభివృద్ధి సాధించాల్సిన అవసరముంది. సంక్షేమం, అభివృద్ధికి టిడిపి సమప్రాధాన్యం ఇస్తుంది. అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. అభివృద్ధి అనేది టిడిపి కి బలం. ఆ అభివృద్ధి గురించి చెప్పుకోలేక పోవటం మా బలహీనతగా గుర్తించాం అని లోకేష్ చెప్పారు. యువగళం పాదయాత్ర 700 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తన మనసులో మాట, అభిప్రాయాలు, లక్ష్యాలను లోకేష్ మీడియా తో పంచుకున్నారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు లోకేష్ సమాధానాలు ఇచ్చారు.

ప్రశ్న: పాదయాత్రకు ముందు లోకేష్ కి, పాదయాత్ర చేస్తున్న లోకేష్ కి తేడా ఏంటి?
లోకేష్: టీడీపీ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు ఎలా అమలయ్యాయి, ప్రజలు వాటి పట్ల ఆనందంగా ఉన్నారా, లేరా? అనేది ప్రస్తుతం నేను గమనిస్తున్నారు. ఉదా: మేము రజకులకు వాషింగ్ మెషీన్లు ఇచ్చాం. కానీ వాళ్లు కరెంటు బిల్లు ఎక్కవుగా వచ్చి ఇబ్బంది పడుతున్నారనే విషయం మాకు గతంలో తెలియదు. ప్రస్తుతం వాళ్లు కరెంటు బిల్లు ఎక్కువగా రావడంతో ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. దీన్ని బట్టి రజకులకు 500యూనిట్లు వరకు విద్యుత్ బిల్లులో సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించాం. ఇలా ప్రతి పథకంలో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారాలను తెలుసుకుంటూ పాదయాత్ర కొనసాగిస్తున్నాను.

ప్రశ్న: పాదయాత్రలో మహిళలు, వృద్దులు, యువత, పిల్లలు, రైతులను కలుస్తున్నారు. వారి వద్ద మీరు గమనించిన ప్రధాన సమస్యలేంటి?
లోకేష్: రాష్ట్రంలో నిరుద్యోగం ప్రధాన సమస్య. విచ్చల విడిగా సాగుతున్న గంజాయి సరఫరా రెండో ప్రధాన సమస్య. మహిళలను నిత్యావసరాల ధరలు విపరీతంగా వేధిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం పన్నుల భారం ప్రజలపై మోపడంతో ఇబ్బందులు పడుతున్నారు.

ప్రశ్న: పాదయాత్రలో మీ మనసును కలిచివేసిన ఘటన ఏంటి?
లోకేష్: ప్రధానంగా రెండు ఘటనలు నన్ను తీవ్రంగా కలిచివేశాయి. మొదటిది సత్యవేడు నియోజకవర్గం దాటుతూ ఉండగా చివరి 200మీటర్లలో ఓ మహిళ బోండాలు తయారుచేసి అమ్ముతోంది. ఆమె వద్దకు వెళ్లి మన ప్రభుత్వం వచ్చాక ఏం కావాలని కోరుకుంటుందో అడిగాను. ఆమె మాట్లాడుతూ ‘‘నేను చిన్న హోటల్ నడుపుతూ నా కొడుకులు ఇద్దర్నీ చదివించాను. వాళ్లకు నేడు ఉద్యోగాలు లేవు. వాళ్లకు మీరు ప్రభుత్వంలోకి వచ్చాక ఉద్యోగాలిప్పించండి’’ అని కోరింది. రెండవ ఘటన పలమనేరులో మిస్బ ఆత్మహత్య. వైసీపీ నాయకులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకాలు సాగిస్తున్నారు. వైసీపీ నాయకుడు సుధాకర్ కూతురికి రెండవ ర్యాంకు, మిస్బకు మొదటి ర్యాంకు వస్తోందనే కారణంతో మిస్బకు బలవంతంగా టీసీ ఇచ్చి పంపేయడంతో ఆ చెల్లి ఆత్మహత్య చేసుకుంది. తాను బాగా చదువుకోవాలని, డాక్టర్ కావాలని తన డ్రాయింగ్ పుస్తకంలో రాసుకున్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత చాలా బాధపడ్డాను.

ప్రశ్న:పాదయాత్ర చేస్తున్నప్పుడు సాధారణంగా కాళ్లనొప్పులు వస్తాయి. కానీ మీ కాళ్లనొప్పులు మర్చిపోయేంత ఆనందాన్ని కలిగించిన ఘటనలు ఏమైనా ఉన్నాయా?
లోకేష్: నేను పెనుకొండ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ ఉండగా ఓ మహిళా ఉద్యోగి నా వద్దకు వచ్చి నన్ను ఆప్యాయంగా పలకరించింది. తాను మాట్లాడుతూ గతంలో నేను ఇంటిని చూసుకునేదాన్ని, కంపెనీలు మా ప్రాంతానికి రావడంతో నేను ఉద్యోగం చేస్తున్నాను. మా పిల్లల్ని, ఇంటిని చాలా చక్కగా చూసుకోగలుగుతున్నానని చెప్పడంతో నా మనసు ఆనందంతో ఉప్పొంగింది. నా కాళ్లనొప్పులు మర్చిపోయాను. మరిన్ని కంపెనీలు తెచ్చి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలనే బలమైన కోరిక ఏర్పడింది.

ప్రశ్న:సెల్ఫీ విత్ లోకేష్, సెల్ఫీ ఛాలెంజ్ కార్యక్రమాలు చేస్తున్నారు. రెండింటిలో మీకు ఏది అంటే బాగా ఇష్టం?
లోకేష్: నాకు ఈ రెండు కార్యక్రమాలంటే అమితమైన ఇష్టం. సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంతో సామాన్యులను కలుసుకుని, వారి సమస్యలు తెలుసుకునే అవకాశం కలుగుతోంది. సెల్ఫీ ఛాలెంజ్ తో మేం గతంలో ఏం చాశామో, వైసీపీ ప్రభుత్వం కంపెనీలు, ఫ్యాక్టరీలు తేవడంలో ఎంత విఫలమైందో రాష్ట్ర ప్రజలకు చెప్పడానికి బాగా ఉపయోగపడుతోంది. నేను ఇప్పటి వరకు అనేక సెల్ఫీ ఛాలెంజ్ లు ప్రభుత్వానికి విసిరాను. దీనిపై ప్రభుత్వం, ఐటీ,పరిశ్రమలు,మౌలికసదుపాయాలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా స్పందించలేదు.

ప్రశ్న:రాష్ట్రంలో నిరుద్యోగం ప్రధాన సమస్య. దీన్ని పరిష్కరించడానికి మీ ప్రణాళిక ఏంటి?
లోకేష్: నిరుద్యోగ సమస్యను మూడు రకాలుగా పరిష్కరించాలి. ప్రైవేటు రంగంలో పెట్టుబడులు తెచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించాలి. గతంలో టీడీపీ పాలనలో 40వేల పరిశ్రమలు తెచ్చి వాటిలో 6లక్షల ఉద్యోగాలు ఇచ్చామని వైసీపీ ప్రభుత్వమే ఒప్పుకుంది. భవిష్యత్తులో కూడా పెట్టుబడులు తెచ్చేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. వాటిని తూచా తప్పకుండా చేస్తాం. రెండవది ప్రభుత్వరంగంలోని ఖాళీలన్నీ భర్తీ చేయాలి. వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు. మేం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఖాళీలన్నీ జాబ్ క్యాలెండర్ ద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం. మూడవది స్వయం ఉపాధి ద్వారా యువతకు జీవనోపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. అంతేగాకుండా వ్యాపార రంగంలో ఆసక్తి ఉన్న యువతకు ప్రభుత్వం అండగా నిలిచి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం.

ప్రశ్న: ప్రత్యక్షంగా 25వేల మందికి నేరుగా ఉద్యోగాలు ఇచ్చిన కియా కంపెనీ ప్రస్తుతం మీ ముందు ఉంది. ఈ కంపెనీ కోసం చాలా రాష్ట్రాలు పోటీపడ్డాయి. కానీ ఏపీకే ఎలా తీసుకువచ్చారు? అది ఎలా సాధ్యమైంది?
లోకేష్: చంద్రబాబు అంటే ఒక బ్రాండ్. విజనరీకి మారుపేరు చంద్రబాబు అని గూగుల్ లో వస్తుంది. చంద్రబాబు క్యాబినెట్ కూర్పులో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. సమర్థులకే ఆయన మంత్రి పదవులు కట్టబెడతారు. ఉమ్మడి అనంతపురం జిల్లాను మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ గా తీర్చిదిద్దాలనేది మా ఉద్దేశం. అలాగే కడపకు ఉక్కు ఫ్యాక్టరీ. కర్నూలుకు సిమెంట్ ఫ్యాక్టరీ. చిత్తూరుకు ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీ. ప్రకాశం జిల్లాకు పేపర్ మిల్. గుంటూరు, కృష్ణాకు రాజధాని ఉంది. తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు ఫిషరీస్, ఫార్మా, డిఫెన్స్ డెవలప్ మెంట్. ఉత్తరాంధ్రకు ఐటీ. ఇలా అన్ని జిల్లాలకు ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి వికేంద్రీకరణ చేసిన ఘనత చంద్రబాబుది. రాజధాని ఒక్కటే ఉండాలి. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనేది మా నినాదం. కియా, టీసీఎల్, ఫాక్స్ కాన్, డిక్సన్, సెల్ కాన్, అదానీ డేటా సెంటర్, డిఫెన్స్ అకాడమీ, అదానీ డేటా సెంటర్ ఏదీ రాజధానిలో లేవు. చంద్రబాబు మరోసారి వెంటనే సీఎం అయి ఉంటే మరో 5లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా కంపెనీలు వచ్చేవి. కియా పరిశ్రమ వల్ల ఉమ్మడి అనంతపురంజిల్లా తలసరి ఆదాయం రూ.30వేలు పెరిగింది. ఇంకా ఎన్నాళ్లు ఉపాధి, ఉద్యోగాలు కోసం కర్నాటక, తమిళనాడు, తెలంగాణ వైపు మనం చూడాలి? మనం ఎందుకు నంబర్ వన్ కాకూడదు? ఇది చంద్రబాబు నినాదం. అందుకే కియాను ఏపీకి తెచ్చి చూపించారు.

ప్రశ్న: టీడీపీ పాలనలో వచ్చిన కియా కంపెనీ వద్ద మీ పాదయాత్ర 700కిలోమీటర్లు పూర్తిచేశారు. ఆ కంపెనీ లోగో చూస్తుంటే మీ అనుభూతి ఏంటి?
లోకేష్: కియా కంపెనీ లోగో చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. లోగో చాలా చిన్నగా ఉండొచ్చు, కానీ దాన్ని తీసుకురావడం వెనుక చాలా కష్టం ఉంది. అనంతపురంజిల్లా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాం. కియా పరిశ్రమను పెట్టాం. అయినా ప్రజలు మమ్మల్ని ఎందుకు తిరస్కరించారు? అని చాలా బాధపడ్డాను. అందుకే నేను సెల్ఫీ ఛాలెంజ్ కార్యక్రమాన్ని తీసుకున్నాను. దీని ద్వారా మేం ఏం చేశాం? వైసీపీ ఏం చేసింది? ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. పెనుగొండలో ఇన్ని కంపెనీలు వచ్చాయనే సంగతి నేను చూసేవరకు కూడా నాకూ పెద్దగా అవగాహన లేదు. కానీ వాటిని చూశాక ఇన్ని వందల కంపెనీలు ఇక్కడున్నాయా? అని నేను ఆశ్చర్యపోయాను. టీడీపీ బలం సమర్థవంతంగా పనులు చేయడం. చేసిన పనులను చెప్పకోలేకపోవడం బలహీనతగా గుర్తించాం. అందుకే పాదయాత్ర ద్వారా టీడీపీ రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పడానికి ఒక అవకాశంగా భావిస్తున్నాం.

ప్రశ్న:ఒక్క రాజధానితో రాష్ట్రాభివృద్ధి సాధ్యం కాదు. మూడు రాజధానులతో సాధ్యం అని అధికారపార్టీ అంటోంది. దానిపై మీ అభిప్రాయం ఏంటి?
లోకేష్: మూడు రాజధానులను వైసీపీ ప్రభుత్వం ప్రకటించి ఇప్పటికి మూడేళ్లు అయ్యింది. ఇప్పటికైనా ఈ మూడు రాజధానుల్లో ఒక్క ఇటుక అయినా వాళ్లు పెట్టారా? లేదు. కానీ మూడు రాజధానుల పేరుతో కాలక్షేపం చేస్తున్నారు. రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి కూడా తీసుకురాలేదు. కియా పరిశ్రమను జగన్ రెడ్డి తన పాదయాత్రలో చూసి ఫేక్ కంపెనీ అని విమర్శించారు. జగన్ రెడ్డి ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఇది ఫేక్ కంపెనీనా? నిజమైన కంపెనీనా? రాష్ట్ర ప్రజలు కూడా జగన్ రెడ్డి చెప్పేవి అబద్దాలా? నిజాలా? తెలుసుకోవాలి.(మాజీమంత్రి అమర్నాథ్ రెడ్డితో కలిసి కియా కంపెనీ వద్ద సెల్ఫీ దిగి ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. అదేవిధంగా కియా కంపెనీలో తయారైన ఓ కార్ ముందు కూడా లోకేష్ సెల్ఫీ దిగి ఛాలెంజ్ విసిరారు.) కియా కంపెనీని ఫేక్ అంటున్న వైసీపీ వాళ్లు తిక్కలోళ్లు అని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి.

ప్రశ్న: అన్ని రంగాల్లో ఏపీ ముందంజలో ఉందని వైసీపీ నాయకులు చెబుతున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి?
లోకేష్: వైసీపీ ప్రభుత్వం రెండు రంగాల్లో ముందంజలో ఉంది. హత్యలు, గంజాయి సరఫరాలో వైసీపీ ప్రభుత్వం నంబర్ వన్ స్థానంలో ఉంది. పెట్టుబడులు, ఉద్యోగాలు కల్పించడంలో మాత్రం చివరిస్థానంలో ఉన్నారు.

ప్రశ్న: టీడీపీ ప్రభుత్వం ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోతుంది?
లోకేష్: టీడీపీ పొత్తు ప్రజలతోనే ఉంటుంది. ప్రజల సమస్యలను టీడీపీ తెలుసుకుంటోంది. వారి సమస్యలపై పోరాడుతోంది. ఎన్నికలు సమీపించే సమయంలో పొత్తులపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది.

ప్రశ్న:ముందస్తు ఎన్నికలు వస్తాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దానికి టీడీపీ సిద్ధంగా ఉందా?
లోకేష్: ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ సిద్ధంగా ఉంది. జగన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్ని నెరవేర్చిన తర్వాత మాత్రమే ప్రజల వద్దకు వెళ్లి ఓటు అడగాలని, ప్రజలు కూడా జగన్ రెడ్డిని నిలదీయాలని కోరుతున్నాం.

ప్రశ్న: టీడీపీ పాలనలో రూ.6లక్షల కోట్ల అవినీతి జరిగింది. పింక్ డైమండ్ ను లోకేష్ దోచుకున్నాడు. అనే ఆరోపణలు ఉన్నాయి. ఆ డబ్బంతా ఎక్కడ దాచారు?
లోకేష్: దోపిడీ సొమ్ము అంతా జగన్ రెడ్డి ఇంట్లో ఉంటుంది. టీడీపీ పాలనలో అవినీతి జరిగిందని వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారే తప్ప, నిరూపించలేకపోయారు. అంటే మేం అవినీతికి పాల్పడలేదని రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. జగన్ రెడ్డి దోచుకున్న డబ్బుతో బుల్లెట్ ఫ్రూప్ కారుల్లో తిరుగుతున్నారు.

ప్రశ్న: వైఎస్ వివేకానందరెడ్డిని చంద్రబాబు, లోకేష్ చంపించారని వైసీపీ నాయకులు నేటికీ ఆరోపిస్తున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి?
లోకేష్: ఒక అబద్దాని వెయ్యిసార్లు చెబితే ప్రజలు నమ్ముతారనేది వైసీపీ నమ్ముకున్న సిద్ధాంతం. సొంత బాబాయ్ ని చంపిన జగన్ రెడ్డి మాపై ఆరోపణలు చేస్తున్నాడు. అధికారంలోకి రాకముందు సీబీఐ విచారణ కావాలని కోరి, అధికారంలోకి వచ్చాక సీబీఐ విచారణను విరమించుకున్న వ్యక్తి జగన్ రెడ్డి. నేడు సీబీఐ విచారణలో జగన్ రెడ్డి, భారతీరెడ్డిల సహాయకులు, అధికారులు కూడా హాజరయ్యారు. వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన అంశాలన్నీ జగన్ రెడ్డి చుట్టూనే తిరుగుతున్నాయి. దీన్నిబట్టి రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే వివేకానందరెడ్డిని ఎవరు చంపారో అర్థమైపోయింది. మనం చెప్పాల్సిన అవసరం లేదు.

ప్రశ్న: ప్రతి వంద కిలోమీటర్లకు ఒక హామీ ఇస్తున్నారు. వాటిని అమలు చేయడం సాధ్యమేనా?
లోకేష్: నేను ఇచ్చే హామీని అమలు చేయడం నూటికి నూరుశాతం సాధ్యం. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడం ప్రభుత్వం బాధ్యత. ఆర్థికపరమైన అంశాల గురించి మేం ఆలోచించం. ప్రజల సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలనేదే మా ఆలోచన. ఇచ్చిన ప్రతి హామీని ఎలా నెరవేర్చాలో మాకు స్పష్టత ఉంది.

ప్రశ్న: 55రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు. పార్టీలో చేయాల్సిన మార్పులు, చేర్పులను ఏమైనా గమనించారా?
లోకేష్: యువగళం పాదయాత్రకు యువత పెద్దఎత్తున వస్తున్నారు. పార్టీలో వాళ్లు అధికంగా భాగస్వామ్యమవుతున్నారు. పార్టీలో యువతను పెద్దఎత్తున ప్రోత్సహించాలనే అంశాన్ని మేం గమనించాం. ఈ అంశాన్ని రానున్న కాలంలో అమలు చేస్తాం.

ప్రశ్న: వైసీపీ పాలనలో దళితులపై దాడులు, హత్యలు విపరీతంగా పెరిగాయి. మీరు అధికారంలోకి వచ్చాక దళితులకు మీరు ఏం భరోసా ఇస్తారు?
లోకేష్: వైసీపీ పాలనలో దళితుల ప్రాణాలకు రక్షణ లేకుండాపోయింది. విపరీతంగా దళితులపై దాడులు పెరిగిపోయాయి. కఠినతరమైన చట్టాలను సైతం వైసీపీ వాళ్లు తమ చుట్టాలుగా మార్చేసుకున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ దళితుడు సుబ్రహ్మణ్యంను దారుణంగా చంపి డోర్ డెలివరీ చేశాడు. అనంతబాబు బెయిల్ పై జైలు నుండి బయటకు వస్తే వైసీపీ నాయకులు, కార్యకర్తలు అనంతబాబు చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక డాక్టర్ సుధాకర్ తో మొదలుకుని తాజాగా పులివెందులలో వెటర్నరీ డాక్టర్ అచ్చన్న వరకు దళితులపై దమనకాండ కొనసాగిస్తూనే ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై చేయి వేయాలంటే భయపడే విధంగా కఠినతరంగా చట్టాలను అమలు చేస్తాం. దళితులకు టీడీపీ అండగా నిలుస్తుందని హామీ ఇస్తున్నాం.

ప్రశ్న: లోకేష్ కి పాదయాత్ర చేయడానికి ఏం అర్హత ఉంది? అని అధికారపక్షం ప్రశ్నిస్తోంది. దానికి మీ సమాధానం ఏంటి?
లోకేష్: గత నాలుగేళ్లుగా వైసీపీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల కంటే రెండున్నరేళ్లు నేను మంత్రిగా చేసిన పనులే ఎక్కువ. వందల కొద్దీ కార్యక్రమాలు మేం గతంలో చేశాం. రానున్న కాలంలో కూడా చేస్తాం. మేం చేసిన పనుల్లో చంద్రబాబు బ్రాండ్ స్పష్టంగా కనిపిస్తోంది.

Tags: lokesh padayatralokesh padaytralokesh yuvagalamlokesh yuvagalam padayatraNara lokeshnara lokesh padayatranara lokesh padayatra livenara lokesh padayatra yuvagalamnara lokesh yuva galam padayatraNara lokesh yuvagalamnara lokesh yuvagalam padayatrapadayatrayuva galam padayatrayuvagalamyuvagalam liveyuvagalam lokeshyuvagalam padayatrayuvagalam padayatra liveyuvagalam padayatra live todayyuvagalam yatrayuvagalum padayatra
Previous Post

700 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న యువగళం పాదయాత్ర

Next Post

తెలుగుదేశ‌మే గుడి..ఎన్టీఆర్ ట్ర‌స్టే బ‌డి – నారా లోకేష్‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసిన‌ ప్ర‌యోజ‌కులైన పిల్ల‌లు

మరిన్ని వార్తలు

పారిశ్రామికవేత్తలకు ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్

పారిశ్రామికవేత్తలకు ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం

November 14, 2026
ఏపీ అభివృద్ధి ప్రస్థానంపై ‘టైమ్’ ప్రత్యేక ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్

ఏపీ అభివృద్ధి ప్రస్థానంపై ‘టైమ్’ ప్రత్యేక ప్రశంసలు

November 14, 2026
ఏపీ ప్రభుత్వంతో దిగ్గజ కంపెనీల ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్

ఏపీ ప్రభుత్వంతో దిగ్గజ కంపెనీల ఒప్పందాలు

November 14, 2026
సీఐఐ సదస్సుతో ఏపీకి 303 ప్రాజెక్టులు రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు
ఆంధ్రప్రదేశ్

సీఐఐ సదస్సుతో ఏపీకి 303 ప్రాజెక్టులు రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు

November 14, 2026
పారిశ్రామిక ఒప్పందాల అమలుపై..ఏటా ఆడిట్ రిపోర్ట్
ఆంధ్రప్రదేశ్

పారిశ్రామిక ఒప్పందాల అమలుపై..ఏటా ఆడిట్ రిపోర్ట్

November 14, 2026
సమర్థ నాయకత్వంతో అద్భుతాలు సృష్టించొచ్చు
ఆంధ్రప్రదేశ్

సమర్థ నాయకత్వంతో అద్భుతాలు సృష్టించొచ్చు

November 14, 2026
Next Post
Nara Lokesh

తెలుగుదేశ‌మే గుడి..ఎన్టీఆర్ ట్ర‌స్టే బ‌డి - నారా లోకేష్‌కి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసిన‌ ప్ర‌యోజ‌కులైన పిల్ల‌లు

ముఖ్య వార్తలు

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

2035కి హెల్తీ, వెల్దీ, హ్యాపీ ఏపీ ఆకాంక్ష

by చైతన్యరధం
November 13, 2026

యువతకు ఉద్యోగాలతో పాటు ఆరోగ్యం, ఆనందం, ఆత్మవిశ్వాసం ముఖ్యం పిల్లలకు తల్లిదండ్రులు క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య నేర్పాలి యువతలో సాధించాలన్న తపన రావాలి.. నమ్మకంతో ముందడుగు వేయాలి ‘యంగ్...

మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం

మంత్రి లోకేష్ సమక్షంలో తొలిరోజు పెట్టుబడుల ప్రవాహం

by చైతన్యరధం
November 13, 2026

52,956 మందికి ఉద్యోగావకాశాలు విశాఖపట్నం(చైతన్యరథం): సీఐఐ 31వ భాగస్వామ్య సద స్సు తొలిరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఇన్వెస్టర్లు పెద్దఎత్తున పెట్టుబడులు...

ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్‌కు ప్రత్యేక కారిడార్

ఏపీలో రేర్ ఎర్త్ మినరల్స్‌కు ప్రత్యేక కారిడార్

by చైతన్యరధం
November 13, 2026

ఎకో సిస్టమ్ అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దాం పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు, రాయితీలు ఇందుకోసం రాష్ట్రంలో ప్రత్యేక వ్యవస్థలు రష్యా పారిశ్రామికవేత్తలకు మంత్రి లోకేష్ ఆహ్వానం విశాఖపట్నం(చైతన్యరథం): భారత్-రష్యా...

పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్దే అజెండా

పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్దే అజెండా

by చైతన్యరధం
November 13, 2026

25 రంగాలు.. ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఈ సదస్సులో 303 ఒప్పందాలు.. రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.32.49 లక్షల కోట్లు విశాఖ...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

ఇన్ పుట్ సబ్సిడీ-పంటల బీమాతో పెట్టుబడికి రక్షణ

by చైతన్యరధం
November 4, 2026

అన్నదాతలు ముందుకొచ్చేలా వ్యవసాయ శాఖ చొరవ చూపాలి అధికారులతో టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి (చైతన్యరథం): భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ ఒక్క రైతు, కౌలుదారు...

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

అర్నబ్ తుఫాన్ పై హైఅలర్ట్

by చైతన్యరధం
October 27, 2026

ఆస్తి, ప్రాణనష్టం లేకుండా ముందస్తు చర్యలు ముంపు ప్రాంతాల్లో షెల్టర్లకు బాధితుల తరలింపు ప్రతి 4 గంటలకూ ప్రజలకు హెచ్చరికల జారీ ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 14-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 14-11-2026

by కార్యకర్త
November 14, 2026

పారిశ్రామికవేత్తలకు ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం

పారిశ్రామికవేత్తలకు ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం

by చైతన్యరధం
November 14, 2026

ఏపీలో గ్రీన్ ఎనర్జీ, ఐటీ, క్రీడా రంగాల్లో విస్తృత అవకాశాలు పెట్టుబడులకు ఆర్‌పీఎస్‌జీ గ్రూప్‌కు సీఎం చంద్రబాబు ఆహ్వానం విశాఖపట్నం (చైతన్య రథం): ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామికవేత్తలకు ఒక్క...

ఏపీ అభివృద్ధి ప్రస్థానంపై ‘టైమ్’ ప్రత్యేక ప్రశంసలు

ఏపీ అభివృద్ధి ప్రస్థానంపై ‘టైమ్’ ప్రత్యేక ప్రశంసలు

by చైతన్యరధం
November 14, 2026

ఏపీ ప్రగతి నమూనాను ప్రపంచానికి చాటుతాం ‘టైమ్’ ఇంటర్నేషనల్ ఎండీ డామియన్ డగ్లస్ రాష్ట్రంలో శరవేగంగా ప్రాజెక్టుల ప్రారంభం ఆరు నెలల్లోనే ‘గూగుల’ ఏఐ హబ్‌కు శంకుస్థాపన:...

ఏపీ ప్రభుత్వంతో దిగ్గజ కంపెనీల ఒప్పందాలు

ఏపీ ప్రభుత్వంతో దిగ్గజ కంపెనీల ఒప్పందాలు

by చైతన్యరధం
November 14, 2026

సీఐఐ సదస్సు రెండో రోజు సీఎం సమక్షంలో 12 ఎంఓయూలు జేఎస్‌డబ్ల్యూ, ఇండియన్ ఆయిల్, ఎయిర్ ట్రంక్-జేసీకే ఇన్ ఫ్రా కంపెనీల ఒప్పందాలు ప్రతిష్టాత్మక పీ4 కార్యక్రమానికి...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.