- మాధవ్‌ను సస్పెండ్ చేయాలి
- న్యూడ్ వీడియోపై సీబీఐ విచారణకు ఆదేశించాలి
రాయదుర్గం: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ డర్టీ పిక్చర్ ఉదంతంలో నిజాలు నిగ్గు తేల్చకుండా జగన్ ప్రభుత్వం నిస్సిగ్గుగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు విమర్శించారు. రాయదుర్గంలో బుధవా రం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారంపై రాష్ట్రంలో అన్ని రాజ కీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మహిళలు పెద్ద ఎత్తు న నిరసనలు తెలిపినట్లు చెప్పారు. బాధ్యయుతమైన ఎంపీ పదవీలో ఉన్న మాధవ్ అసహ్యాకరమైన న్యూడ్ వీడియోతో పట్టుబడితే పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని జగన్మోహన్రెడ్డిని ప్రశ్నించారు. నైతిక బాధ్యత వహించాలన్న ఆలోచన ఉంటే వెంటనే పార్లమెంట్ సభ్యత్వానికి మాధవ్ రాజీనామా చేయాలన్నారు. న్యూడ్ వీడియోలో ఉన్నది గోరంట్ల మాధవా? కాదా? అన్న దానిపై ఎందుకు విచారణ చేయలేదని ప్రశ్నించారు. స్వయంగా జిల్లా ఎస్పీ పక్కీరప్పతో వైసీపీ సర్కార్ తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించిందని మం డాపడ్డారు. నెల రోజుల తరువాత తీరిగ్గా ఎంపీ. మాధవ్ సీ.ఐ.డీకి ఫిర్యాదు చేయడంలో అంత్యర్యమే మిటని ప్రశ్నించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, హోం మంత్రి వనిత మాధవ్ న్యూడ్ వీడియోను ఫారెన్సిక్ ల్యాబ్‌కు పంపిచామని మీడియా ముందు చెప్పారని, ఇంత వరకు ఎందుకు సదరు నివే దికను బయటపెట్టలేదని అడిగారు. మాధవ్ డర్టీ పిక్చరును పరిశీలించిన అమెరికాలోని ప్రైవేట్ ఫోరెన్సిక్ నిపుణులు ఆన్యూడ్ వీడియోలో ఉన్నది ఎంపీ మాధవ్ అని స్పష్టంగా తేల్చిచెప్పినట్లు తెలిపారు. మాధవ్ తన న్యూడ్ వీడియోపై సీ.ఐ.డీ కి ఫిర్యాదు చేయక ముందే సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ ఎందుకు మీడియా ముం దుకు వచ్చి వివరణ ఇచ్చారని ప్రశ్నించారు. న్యూడ్ వీడియోలో ఉన్నది ఎంపీ గోరంట్ల మాధవ్ కాదనీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎందుకు చెప్పడంలేదని అడిగారు. పచ్చి నిజాన్ని దాచి, నగ్న సత్యాన్ని సమాధి చేసి,ప్రతిపక్షాలపై బురదజల్లే ప్రయత్నం వైసీపీ సర్కా ర్ చేస్తోందని దుయ్యబట్టారు. జగన్మోహన్రెడ్డి పెట్టె అక్రమ కేసులకు, ఉడత ఊపులకు తెలుగుదేశం పార్టీ భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇప్పటి కైనా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంపీ.మాధవ్‌ను సస్పె ండ్ చేసి,న్యూడ్ వీడియోసంఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు.