.తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరాం చిన్నబాబు డిమాండ్
మదనపల్లి: ఎంపీ పదవికి గోరంట్ల మాధవ్ తక్షణమే రాజీనామా చేయాలని తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరాం చిన్నబాబు డిమాండ్ చేశారు. ఒక ఎంపీ స్థానంలో ఉండి ఇలా అశ్లీలంగా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్త్రీ జాతిని కించపరిచేలాగా చేయడం చాలా బాధాకరమన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని… పోలీసులు కేసు నమోదు చేయాలన్నారు. రాష్ట్రంలో దిశా చట్టం ఉందా… అసలు మహిళా కమిషన్ ఏమైందని నిలదీశారు. ఈ సమావేశంలో రాజంపేట ప్రధాన కార్యదర్శి యాలగిరి దొరస్వామి నాయుడు, రాజంపేట అధికార ప్రతినిధి ఆర్‌జె వెంకటేష్, రాజంపేట బీసీ అధ్యక్షులు సురేంద్ర యాదవ్, రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు, రాష్ట్ర బీసీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి గుత్తికొండ త్యాగరాజు, రాష్ట్ర మైనార్టీ ఉపాధ్యక్షులు ఎస్‌ఎం రఫీ, రాజంపేట పార్లమెంట్ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి విజయమ్మ, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి రాటకొండ హర్షవర్ధన్ రెడ్డి, మదనపల్లి నియోజకవర్గ తెలుగు అధ్యక్షులు నాదెళ్ల అరుణ్ తేజ, రాజంపేట పార్లమెంట్ కార్యాలయ కార్యదర్శి పూల మురళి, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు సుధాకర్, మదనపల్లి నియోజకవర్గ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బాబ్జాన్, రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత అధికార ప్రతినిధి బొగ్గు భాస్కర్, పటాన్ ఖాదర్ ఖాన్, శ్రీరాములు, దుబ్బిగాళ్ల భాస్కర్, నియోజకవర్గం టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.