అమరావతి: పాలన చేతకాని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఓ వైపు అప్పులు తెచ్చి లూటీ చేస్తూ మరో వైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించటమే కాక చివరకు కేంద్రం ఇచ్చిన విపత్తు నిధులు సైతం దారి మళ్లించటం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నేత బత్యాల చెంగల్రాయుడు ద్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం విపత్తు నిధి కింద కరోనా మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లింపుకు కేటాయించిన నిధుల్లో దాదాపు రూ.1,100 కోట్ల మేర నిధుల నుంచి వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించింది. నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్‌ను పిడి ఎకౌంటులోకి మార్చటం దుర్మార్గపు చర్య. ఏ అవసరాలకు ఎస్డీఆర్ఎఫ్ నిధులు ఉపయోగించాలంటే వాటికే వినియోగించాలి. కానీ కరువు కోసం అని చెప్పి ఆ నిధులను వేరే వాటికి ఎలా మళ్లిస్తారు? ఎస్డీఆర్ఎఫ్ కు సంబంధించిన ఏ వ్యయాన్ని అయినా 2245 నంబర్ మేజర్ హెడ్ కిందనే నమోదు చేయాలి. పబ్లిక్ ఖాతాలో నమోదు చేయకూడదు. విపత్తుల నిర్వహణ నిధి (ఎస్డీఆర్ఎఫ్) ఖాతా నుంచి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి వ్యక్తిగత డిపాజిట్ ఖాతాలకు (పీడీఏ) నిధులు మళ్లించడమే కాకుండా రెండేళ్లుగా వాటిని వినియోగించపోవటం ఎస్డీఆర్ఎఫ్ మార్గదర్శకాలను ఉల్లంఘించటమేనని అన్నారు.
కరోనా మృతుల సొమ్ము కూడా దారిమళ్లిస్తారా?
వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన కుటుంబాలకు ఒక్క రూపాయి కూడ ఆర్థిక సాయం చేయకపోగా నేషనల్ డిజాష్టర్ రిలీఫ్ ఫండ్ కింద కేంద్రం ఇచ్చిన డబ్బును మృతుల కుటుంబాలకు ఇవ్వకుండా నిదుల్ని దారి మళ్లించటం శవాలు మీద చిల్లర ఏరుకోవడమే. పొంతన లేని స్టేట్ మెంట్లతో ప్రభుత్వం తరపున న్యాయవాదులు న్యాయస్ధానానికి సైతం తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారు. కరోనా మృతుల లెక్కల్లోనూ వైసీపీ ప్రభుత్వం తప్పులు లెక్కలు చూపింది. 2019,2020లో ప్రభుత్వ వైఫల్యంతో లక్షల్లో కరోనాతో ప్రజలు చనిపోతే ప్రభుత్వం మాత్రం చనిపోయిన వారి సంఖ్యను కేవలం 36 వేలుగా చూపడటం దివాలా కోరుతనం. కరోనాతో చనిపోయిన వారిని కూడా కరోనా నుంచి బయటపడ్డాక చనిపోయారని తప్పుడు సమాచారం ఇచ్చారు. కరోనాతో అడ్మిట్ అయి రికవరీ అయి ఇంటికి వచ్చాక చనిపోయిన కరోనాతో చనిపోయినట్లే అవుతుంది. కానీ వాటిని పరిగణలోకి తీసుకోలేదు. కేరళ, కర్ణాటక, ఢల్లీి, ఇతర పొరుగు రాష్ట్రాలలో కరోనాతో చనిపోయిన వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఆర్థిక సాయం ఇవ్వటంతో పాటు నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్‌ను కూడ పూర్తిగా వారి కుటుంబాలకు అందజేశాయి. కేరళలో రూ.3 లక్షలు, కర్ణాటక, ఢల్లీిలో 50వేల రూపాయలు కరోనా మృతులకు ఇచ్చారు. కానీ ఏపీ లో కరోనా వల్ల 14,471 మరణాలు అని చెప్పి 11వేల మందికి డబ్బులు ఇచ్చామని వైసీపీ చెబుతోంది. సుప్రీం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో 36,205 క్లెయిమ్స్ వచ్చాయని చెప్పారు. మరి కేంద్రం నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ కింద రూ.1100 కోట్లు ఇస్తే ఎందుకు వారి కుటుంబాలకు ఇవ్వలేదు? దీనికి సంబంధించి నిధులను దారి మళ్ళించారని కాగ్ కూడా నివేదిక ఇచ్చింది.
ఎస్సీ,ఎస్టీ, బిసిల నిధులు దారిమళ్లించారు!
జగన్ రెడ్డి కేవలం కరోనా నిధులు మాత్రమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు చెందాల్సిన నిదుల్ని సైతం దారి మళ్లించారు. మహిళల అభ్యున్నతి కోసం వారు కూడ బెట్టుకున్న అభయ హస్తం నిధులు రూ.2,100 కోట్లు దారి మళ్లించారు. బిసి కార్పోరేషన్ 26 వేల కోట్లు, ఎస్సీ కార్పోరేషన్ రూ.6,548 కోట్లు, ఎస్టీ కార్పోరేషన్ 1000 కోట్లు, మైనార్టీ కార్పొరేషన్ రూ.1500 కోట్లు వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించింది. చివరకు పంచాయితీ, మున్సిపాలిటి నిధులు రూ.12 వేల కోట్లు దారిమళ్లించారు. కడప జిల్లా పరిషత్ సమావేశంలో చైర్మన్ సమక్షంలో సభ్యులంతా జిల్లా పరిషత్‌కు వచ్చిన నిధులను, మండలాలకు, గ్రామ పంచాయితీకి వచ్చిన నిధులను ప్రభుత్వం దారి మళ్ళించడం వల్ల మేము గెలిచినందుకు ప్రజలకు ఏం న్యాయం చేయాలని గెలిచినందుకు కూడ సిగ్గుగా ఉందని వాపోయారు. వచ్చిన నిధులను తక్షణం వెనక్కి ఇవ్వాలని, లేదంటే అందరూ రాజీనామాలు చేయవలసిన పరిస్థితి వస్తుందని జెడ్పీటీసీలంతా ఆందోళన చేసిన పరిస్దితి నెలకొంది.
జగన్ రెడ్డి చేతగానితనంతో రాష్ట్రం దివాలా!
మొదట దశ కరోనాలో బ్లీచింగ్ పౌడర్ నిదుల్లో సైతం అవతకతవకలకు పాల్పడ్డారు. బ్లీచింగ్ పౌడరు పేరుతో మైదా పిండి చల్లారు. కరోనాతో చనిపోయిన వారి లెక్కలను సంక్రమంగా చూపిస్తే వారికి ఆర్థిక సాయం చేయాలన్న కారణంతో చనిపోయిన వారి పేర్లను కూడ రాష్ట్ర ప్రభుత్వం పొందుపర్చలేదు. తక్షణమే దారి మళ్లించిన నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నిధులు రూ.1,100 కోట్లు తిరిగి జమచేయాలి. కరోనా 4వ దశను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. కరోనా ఫ్రంట్ లైన్లు వారియర్లు, అంగన్ వాడీలకు పెండిరగ్ జీతాలు వెంటనే చెల్లించాలి. జగన్‌రెడ్డి చేతకాని పాలనతో రాష్ట్రం దివాలా తీసి మరో శ్రీలంకలా తయారైంది. కాబట్టి కేంద్రం ఇస్తున్న నిధుల్ని దారి మళ్లించకుండా ప్రజలకు న్యాయం చేయాలని బత్యాల చెంగల్రాయుడు అన్నారు.