కల్లూరు: వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి పతనం తప్పదని మాజీ ఎమ్మెల్యే పాణ్యం టీడీపీ ఇన్చార్జి గౌరు చరిత అన్నారు. బుధవారం కర్నూలు అర్బన్ 34వ వార్డు కృష్ణారెడ్డినగర్, గణేష్ నగర్ లలో వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఆమె కాలనీల్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ విద్యుత్, బస్ చార్జీలు పెంపునకు నిరసనగా కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిత్యావసర, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలతోపాటు కరెంటు, బస్సు చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని అన్నారు. సిమెంటు, ఇసుక కొరత తీవ్రంగా ఉందని, దీంతో కార్మిక నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైందని పేద కుటుంబాలు. రోడ్డున పడ్డాయని ఆరోపించారు. ఒంటరి మహిళలకు పింఛన్ పథకం తొలగింపు. అమ్మఒడి పథకంలో దాదాపు లక్ష మంది లబ్ధిదారులకు పథకాలు అందకుండా దూరం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కాసాని మహేష్ గౌడు, ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు ఎస్.పి. రోజ్, తెలుగు యువత అధ్యక్షుడు గంగాదర్ గౌడు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ పెరుగు పురుషోత్తంరెడ్డి, జిల్లా కార్యదర్శి క్యాతూరు మధు, మాదన్న, ఎన్పీ రామకృష్ణ బ్రాహ్మణ పల్లె నాగిరెడ్డి, శ్రీనివాసరావు, జయన్న, పవన్ పాల్గొన్నారు.