రాయదుర్గంః ఆర్టీసీ చార్జీలు పెంచడం పేదలపై పెనుభారం మోపడమేనని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక మూడు సార్లు టికెట్ రేట్లు పెంచడం ప్రజలను వంచించడమేనని శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఇప్పటికే ప్రయాణికులపై సుమారు రూ.2300కోట్ల భారం పడిరదన్నారు. సామాన్యుల వాహనాన్ని పేదలకు దూరం చేసే సర్కారు అసంబద్ధ నిర్ణయాలను అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. జగన్‌రెడ్డి అసమర్థ పాలనకు పెరుగుతున్న బస్సు ఛార్జీలు నిదర్శనంగా నిలుస్తాయన్నారు. తాజా పెంపుదల నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేదాకా పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అందులో భాగంగా అనంతపురం జిల్లాలో తెలుగుదేశం ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తామన్నారు.