చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

పట్టభద్రులంటే అధికారపార్టీకి అంతచులకనా?

by చైతన్యరధం
March 28, 2023
in ఆంధ్రప్రదేశ్, ముఖ్య వార్తలు
YS Jagan
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ప్రస్తుతం జరుగుతున్న శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్ కు కీలకం కానున్నాయి. వ్యవస్థలు నిర్వీర్యమై, అభివృద్ధి అడుగంటి అన్నిరంగాలలో అధోగతి పాలై భావితరాల భవిష్యత్ అగమ్యగోచరంగా తయారయింది. ఈ స్థితిలో పరిస్థితులు చక్కదిద్దేందుకు పట్టభద్రుల ముంగిట సువర్ణావకాశం నిలిచింది. చట్టసభల్లో విద్యావంతుల గళాన్ని వినిపించే సదుద్దేశంతో పట్టభద్రుల కోసం ప్రత్యేకంగా నియోజకవర్గం ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుత అధికార పార్టీ వైఖరి ఆ ఉద్దేశాన్ని నీరు గార్చటమే గాక, రాష్ట్రంలోని పట్టభద్రులు అందరినీ అవమాన పరిచేదిగా వుంది. అక్రమ మద్యం కేసులో అరెస్ట్ అయి బెయిల్ పై వున్న వ్యక్తిని రాయలసీమ తూర్పు నియోజకవర్గం అభ్యర్థిగా నిలిపింది. అదేవిధంగా ఒకండలిత యువకుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేయటం తో పాటు వివిధ రకాల అక్రమ వ్యాపారాలలో నిందితునిగా ఉన్న ఒక ఎమ్మెల్సీ కి అనుచరుడిని ఉత్తరాంధ్రలో ఎన్నికల బరిలో నిలిపారు. దీన్ని బట్టి అధికార పార్టీ నాయకులకు పట్టభద్రులు అంటే ఎంత చులకనభావం వుందో అర్థమవుతోంది.

సాంకేతికంగా అభ్యర్థి నేరమయ జీవితం ఎన్నికలలో పోటీకి ఆటంకం కాకపోవచ్చు. కానీ ఆ విధమైన అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా అధికార పార్టీ ఏవిధమైన సందేశం ఇస్తున్నట్టు? తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనే అహంభావ ధోరణికి నిదర్శనం కాదా? ఇప్పటికే భావి తరాల భవిష్యత్ అంధకారమై వున్న తరుణంలో, ప్రలోభాలు లేదా ఇతరత్రా కారణాలతో నేరమయ ఆరోపణలు వున్న వారిని ఎన్నుకుంటే పరిస్థితులు మరెంత దుర్భరంగా మారతాయో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరముంది. అంతేగాక పట్టభద్రుల నియోజకవర్గ ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు విచ్చలవిడిగా నమోదయ్యాయి. దొంగ ఓట్ల నమోదులో అధికార పార్టీ మరీ బరితెగించినట్టు స్పష్టమవుతోంది. చివరకు వైసీపీ కార్యాలయం చిరునామా తోనో పెద్ద సంఖ్యలో ఓట్లు నమోదు కావటం అధికార పార్టీ బరి తెగింపు కు పరాకాష్ట. వాలంటరీ వ్యవస్థను యధేచ్చగా దుర్వినియోగం చేసింది. వీటన్నింటి పైనా ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం రాజ్యాంగ సంస్థలకు ఫిర్యాదు ఇవ్వటంతో పాటు న్యాయ పోరాటానికి సిద్ధం అవుతోంది. అయితే ఈ విధమైన అరాచకాలను అడ్డుకొని అధికార పార్టీకి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత కేవలం ప్రతిపక్ష పార్టీల దేనా? విద్యావంతులు అందరూ ఎంతో విజ్ఞతతో ఆలోచించాల్సిన తరుణమిది. అధికార పార్టీ అరాచకాలను అడ్డుకొని, ఈ రాష్ట్ర భవిష్యత్ ను చక్కదిద్దే శక్తి విద్యావంతులు అందరిపైనా వున్నది. విద్యావంతులు తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు.

గత ఎన్నికలలో ఒక్క ఛాన్స్ ఎంత విధ్వంసానికి దారితీసిందీ ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ప్రజలు నమ్మి అధికారం అప్పగిస్తే వారి భవిష్యత్ ను చీకటి మయం చేశారు. దొంగ ఓట్లు, డబ్బు, మద్యం, అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు తో ఎన్నికలలో గెలవగలమని విర్రవీగుతున్న అధికార పార్టీ నాయకులకు కనువిప్పు కలిగించే విధంగా పట్టభద్రుల తీర్పు వుండాలి. ఏటేటా ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్, డీఎస్సీ నిర్వహణ వంటి వాటిపై మోసపూరిత హామీలు ఇచ్చి నిరుద్యోగులను అధికార పార్టీ దారుణంగా మోసగించింది. మరోవైపు ప్రయివేటు రంగంలోనూ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మృగ్యమయ్యాయి. నూతనంగా పరిశ్రమలు రాక, వున్నవి తరలిపోతుండటంతో ఉపాధి అవకాశాలు మరింత జటిలంగా మారాయి. అదే సమయంలో గంజాయి వంటి మాదకద్రవ్యాలు, నకిలీ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్న సంఘటనలు ప్రతిరోజూ వెలుగుచూస్తూనే వున్నాయి. పెట్రోలు, డీజిల్, విద్యుత్, ఆర్టీసీ బస్సు చార్జీలు, నిత్యావసరాల ధరలు ఇప్పటికే సామాన్యుడు మోయలేని స్థితికి చేరుకున్నాయి.

ప్రభుత్వ ఉద్యోగుల పరిస్తితి మరీ దారుణంగా తయారయింది. గతంలో తమ న్యాయపరమైన హక్కులు, డిమాండ్ ల కోసం పోరాడిన ఉద్యోగులు, ఇప్పుడు వేతనాలు కోసం వినతి పత్రం ఇచ్చే దయనీయ స్థితిలో వున్నారు. ప్రభుత్వం తాజాగా ఏప్రిల్ 1 వ తేదీనే వేతనం ఇస్తామంటూ వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏప్రిల్ 1,2 సెలవు దినాలు అయినప్పటికీ వారి వేతనాలు ఏ విధంగా జమ అవుతాయి? అన్న సందేహం కంటే మొత్తం మీద జీతాలు వస్తాయన్న చిన్న పాటి ఆశతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఆ ఆశ ఆవిరి కాకముందే 13 వ తేదీన జరుగనున్న పట్టభద్రుల ఎన్నికలలో తమ పబ్బం గడుపుకోవచ్చనేది అధికార పార్టీ ఆరాటంగా కానవస్తోంది. ఈ విధంగా సమాజంలో నున్న ప్రతివర్గమూ ఏదో ఒక సమస్యతో సతమతం అవుతూనే వున్నది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఈ ఎన్నికలలో అధికార పార్టీ అరాచకాలకు అడ్డుకట్ట వేయటంతో పాటు గట్టి గుణపాఠం చెప్పాల్సిన అవసరముంది. టిడిపి అభ్యర్థుల ను గెలిపించడం ద్వారా రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగం పంచుకునే అవకాశం పట్టభద్రుల ముంగిట నిలిచి వుంది.

Tags: ap cm jaganap cm ys jaganap cm ys jagan livecm jagancm jagan livecm ys jagancm ys jagan speechcommon man about cm ys jaganjaganys jaganys jagan latest speechys jagan liveys jagan mohanys jagan mohan reddyys jagan public meeting at rayachotiys jagan speech
Previous Post

లోకేష్ … ప్రజాసేవకు ప్రతిరూపం

Next Post

నా తల్లి కష్టమే నాకు స్ఫూర్తి : చంద్రబాబు నాయుడు

మరిన్ని వార్తలు

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు
ఆంధ్రప్రదేశ్

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

November 2, 2026
విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు
ఆంధ్రప్రదేశ్

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

November 2, 2026
బాలికను సొంత కూతురిలా చూసుకుంటా
ఆంధ్రప్రదేశ్

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

November 2, 2026
తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం
ఆంధ్రప్రదేశ్

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

November 2, 2026
బీసీలకు 40% సీట్లు
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ పునరుద్ధరణ పనులకు సిబ్బందిని పంపండి

November 2, 2026
గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి
ఆంధ్రప్రదేశ్

కూటమి శ్రేణులు సంయమనం పాటించాలి

November 2, 2026
Next Post
Chandrababu Naidu

నా తల్లి కష్టమే నాకు స్ఫూర్తి : చంద్రబాబు నాయుడు

ముఖ్య వార్తలు

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

by చైతన్యరధం
November 2, 2026

యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశం ఉన్నతాధికారులతో ముందస్తు కార్యాచరణపై సమీక్ష నేటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడి అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి...

తుఫాను బాధితుల కష్టం తెలుసు…ఆదుకుంటాం

by చైతన్యరధం
October 31, 2026

సాధారణ స్థితికి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం పంటల బీమాతోనే ప్రతి రైతుకూ ధీమా డెల్టా కాలువల ఆధునికీకరణతో ముంపు తొలగిస్తాం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు...

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

by చైతన్యరధం
October 30, 2026

క్షేత్రస్థాయి పరిశీలనతో వాస్తవ నష్టం అంచనా ప్రాథమికంగా రూ.4,600 కోట్ల నష్టం వాటిల్లింది ఆ నివేదికను ఇప్పటికే కేంద్రానికి కూడా పంపాం యంత్రాంగం అప్రమత్తంతో ప్రాణనష్టం తగ్గింది...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

‘మన మిత్ర’

‘మన మిత్ర’

by చైతన్యరధం
January 31, 2025

ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజా ప్రభుత్వం వాట్సప్‌ గవర్నెన్స్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్‌ ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి వాట్సప్‌...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 04-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 04-11-2026

by కార్యకర్త
November 4, 2026

చైతన్యరధం ఈ పేపర్ 03-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 03-11-2026

by కార్యకర్త
November 3, 2026

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

by కార్యకర్త
November 2, 2026

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

by చైతన్యరధం
November 2, 2026

ప్రజాస్వామ్యం గురించి జగన్‌రెడ్డి నీతులు చెబుతున్నారు పులివెందులలో ఉద్దేశపూర్వకంగానే సమస్య సృష్టించారు నాడు ఏకగ్రీవాలు ఎలా చేశారో అందరూ ప్రశ్నించాలి ఎన్నికల కోడ్ ఉండగా ర్యాలీ ఏ...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.