- ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మంత్రి లోకేష్ అభినందనలు
- లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న నలుగురు విద్యార్థులు
- భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి లోకేష్ ప్రశంసలు
సత్యవేడు (చైతన్యరథం): తమ అద్భుత ప్రతిభతో లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన నలుగురు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందించారు. సత్యవేడులో గురువారం ఉదయం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థులు.. మంత్రి నారా లోకేష్ ను కలిశారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మంగళపల్లి జడ్పీ హైస్కూల్ కు చెందిన హేమ, పునీత్ సాయి, లహరి, రేవతి అనే విద్యార్థులు ‘‘పై (జూ) ’’ వాల్యూను ఒక్కొక్కరు 1000 డెసిమెల్స్‌ను చూడకుండా చెప్పి లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కారు. విద్యార్థుల ప్రతిభను ఈ సందర్భంగా మెచ్చుకున్న మంత్రి లోకేష్.. భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.