- అధైర్యపడొద్దంటూ కార్యకర్తల కుటుంబాలకు భువనేశ్వరి భరోసా
- మూడోరోజు ఐదు కుటుంబాలకు పరామర్శ, ఆర్థికసాయం
రాజమహేంద్రవరం: తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలను ఆయన సతీమణి భువనే శ్వరి పరామర్శించి.. మీతో మేమున్నాం, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నిజం గెలవాలి మూడో రోజు పర్యటన సందర్భంగా శుక్ర వారం ఐదుగురు కార్యకర్తల కుటుంబీకు లను భువనేశ్వరి పరామర్శించి ఓదార్చా రు. అనపర్తి నియోజకవర్గం బలభద్రపురం ఎంఎస్‌ఆర్ విడిది కేంద్రం నుంచి బయలు దేరిన భువనేశ్వరి బిక్కవోలులోని శ్రీ గోలిం గేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బిక్కవోలు గ్రామంలో పార్టీ కార్యకర్త రాణిమ్మ(53) కుటుంబాన్ని పరామర్శించారు. ఆమె గత ఏడాది సెప్టెం బర్ 13న గుండెపోటుతో మృతి చెందారు. రాణిమ్మ కుమారుడు రవిరాజు, కుమార్తె ఇందిర, కుటుంబ సభ్యులను భువనేశ్వరి ఓదార్చి,రూ.3లక్షలు ఆర్థికసాయం అందిం చారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు మండలంలోని,కాలవచర్ల గ్రామంలో కార్య కర్త మన్నెం శ్రీనివాసరావు(38) కుటుంబా న్ని భువనేశ్వరి పరామర్శించారు. శ్రీనివాస రావు గత ఏడాది సెప్టెంబర్ 14న గుండె పోటుతో మృతిచెందారు. శ్రీనివాసరావు తల్లిదండ్రులు అనంతలక్ష్మి, ముసలయ్య, భార్య రామలక్ష్మి, కుమార్తెలు శ్రీదుర్గ, అనం తలక్ష్మి, సత్యసాయి కుటుంబ సభ్యులను భువనేశ్వరి పరామర్శించారు. భువనేశ్వరిని చూసిన శ్రీనివాసరావు భార్య, కుమార్తెలు భావోద్వేగానికి గురవ్వడంతో వారికి భువ నేశ్వరి ధైర్యం చెప్పి, రూ.3లక్షలు ఆర్థికసా యం అందించారు. అనంతరం నిడద వోలు మండలం, పందలపర్రు గ్రామంలో కార్యకర్త భోగిరెడ్డి సత్యనారాయణ(75) కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. సత్యనారాయణ గత ఏడాది సెప్టెంబర్ 24న గుండెపోటుతో మృతిచెందారు. సత్యనారాయణ భార్య అమ్మాజి, కుమారు డు జగపతి, కుమార్తె శిరోమణి, కుటుంబ సభ్యులను భువనేశ్వరి ఓదార్చి, రూ.3 లక్షల ఆర్థికసాయం అందించారు. అనంత రం నిడదవోలు మండలం, తిమ్మరాజు పాలెం గ్రామంలో కుసుమె వెంకటలక్ష్మి (52) కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శిం చారు. వెంకటలక్ష్మి గత ఏడాది సెప్టెంబర్ 11న గుండెపోటుతో మృతిచెందారు. వెం కటలక్ష్మి కుమారులు హరీష్, సురేష్, రమే ష్, మహేష్, ఇతర కుటుంబ సభ్యులను భువనేశ్వరి ఓదార్చి, ధైర్యం చెప్పారు. బాధి త కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసా యం చేశారు.చివరిగా రాజానగరం నియో జకవర్గం, సీతానగరం మండలం, కాటవ రం గ్రామంలో కార్యకర్త దాసరి హరిప్రసా ద్(46) కుటుంబాన్ని భువనేశ్వరి పరామ ర్శించారు. హరిప్రసాద్ గత ఏడాది అక్టో బర్ 8న గుండెపోటుతో మృతిచెందారు. హరిప్రసాద్ సోదరులు అప్పారావు చౌదరి, శ్రీనివాసరావు, కుటుంబ సభ్యులను భువనే శ్వరి పరామర్శించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పర్యటన ముగించుకుని రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుని హైదరాబాద్ తిరుగుపయనమయ్యారు. విమానాశ్రయం వద్ద ఉమ్మడి తూర్పుగోదా వరి జిల్లా టీడీపీ నాయకులు భువనేశ్వరికి వీడ్కోలు పలికారు.