అమరావతి (చైతన్యరథం): టీటీడీ గోశాలలో ఆవుల మరణాల గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న నిరాధారమైన, దురుద్దేశపూరిత ప్రచారాన్ని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ తీవ్రంగా ఖండిరచారు. ఆ ప్రచారంలో ఓ మాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. వాస్తవాలేంటో టీటీడీ స్పష్టంగా తెలియజేసింది. అయినప్పటికీ ప్రజలను, ముఖ్యంగా తిరుమల శ్రీవారి భక్తులను తప్పుదారి పట్టించటానికి, రెచ్చగొట్టడానికి వైసీపీ నేతలు సాగిస్తున్న తప్పుడు కథనాలను, దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కోరుతున్నా. రాజకీయ లాభం కోసం పవిత్ర సంస్థల గురించి అబద్ధాలను వ్యాప్తి చేయడం సిగ్గుచేటు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.