- తిరుమల శ్రీవారి ఆదాయానికి నష్టం
- లడ్డూ కల్తీపై నిజాలు బయటపడుతున్నాయి
- ఐదేళ్ల జగన్ పాలనలో తిరుమలను దోచారు
- యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహాయాదవ్
మంగళగిరి(చైతన్యరథం): గత జగన్‌రెడ్డి పరిపాలనలో తిరు మల శ్రీవారి ఆదాయానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ఏపీ యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి.నరసింహాయాదవ్ అన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో 90 శాతం నెయ్యికి బదులు పామాయిల్ కలపడం, ఇతర రసాయనాల కల్తీ జరగడం వంటి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయన్నారు. దీనిపై సిట్ విచారణ జరుగుతోందని..16వ నిందితుడి అరెస్టు వరకు ఈ కల్తీ వ్యవహారాలు బయటపడుతు న్నాయని తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీవారి హుండీ లెక్కించే విషయంలో కూడా ఒక టీటీడీ ఉద్యోగి కోట్లాది రూపా యల ఆస్తులు కూడబెట్టారన్నారు. ఈ దోపిడీలో నాటి పాలకులు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి, జగన్‌రెడ్డి ప్రమేయం స్పష్టమని.. దీనిపై హైకోర్టు విచారణకు ఆదేశించిందని ప్రస్తావించారు. గతం లో లడ్డూ కల్తీపై తాము వెంకటగిరి సభలో చెప్పినా పట్టించు కోలేదని, కానీ ఇప్పుడు నిజాలు బయటపడుతున్నాయని తెలిపా రు. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో నీతి వాక్యాలు చెప్పే కరుణాకర్‌రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తున్నామన్నారు. గత పాలనలో జరిగిన స్వామివారి దర్శనాల వ్యవహారంపై, లడ్డూ ప్రసాదాల్లో జరిగిన నెయ్యి కల్తీ విషయంలో హుండీ దోపిడీలో భాగస్వామ్యం వహించి ఆస్తులు కూడబెట్టుకుని లోక్‌అదాలత్‌లో సెటిల్ చేసుకు న్న తీరుపై కరుణాకర్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశా రు.
వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డిలు జగన్‌రెడ్డికి సమీప బంధు వులు కావడం వల్లనే గత ఐదేళ్లపాటు టీటీడీ పాలకవర్గం వారి కనుసన్నల్లోనే నడిచిందని విమర్శించారు. జగన్‌రెడ్డి పాలనలో దర్శనాల పేరిట పుంకాలుగా టికెట్లు అమ్ముకుని స్వామివారిని అవమానించారని, వైఎస్ కూడా ఏడుకొండలను రెండు కొండలు అంటూ వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్టీఆర్ పార్టీ ఆవిర్భావం నుంచే బీసీలకు శాసనసభ, పార్లమెంట్‌లో అవకాశా లు కల్పించిన చరిత్ర టీడీపీకే దక్కుతుందని స్పష్టం చేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకు బీసీ సంక్షేమ మంత్రి సవితమ్మ ఆధ్వర్యంలో విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్‌లో మూడు రోజుల పాటు అన్ని కార్పొరేషన్ల చైర్మన్లతో సమావేశం జరిగిందని తెలిపారు. గత జగన్ పాలనలో కుప్పకూలిన వ్యవస్థలను సరి చేయడం, రాబోయే రోజుల్లో బీసీలకు ముఖ్యంగా కులవృత్తులు, చేతివృత్తుల వారికి ‘ఆదరణ’ పథకంతో అండగా నిలవడానికి సమగ్రంగా చర్చలు జరిగాయని తెలిపారు. కొందరు వ్యక్తులు కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రంలో జరుగుతున్న పరిపాల నను చూసి ఓర్వలేక జగన్‌రెడ్డి కనుసన్నల్లో అలజడి సృష్టించ డానికి ప్రయత్నిస్తున్నారని హెచ్చరించారు. బీసీ వర్గాలు అప్రమ త్తంగా పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు.















