- జగన్‌రెడ్డీ ప్రజలకు సమాధానం చెప్పు
- రాష్ట్రాన్ని లూటీ చేసి కాకమ్మ కబుర్లా
- ప్రభుత్వంపై విషప్రచారం చేస్తే నమ్మరు
- పులివెందులకే నీళ్లివ్వని నువ్వా మాట్లాడేది
- వాలంటీర్లు, నిరుద్యోగులను మోసగించారు
- ప్రాజెక్టులను భ్రష్టు పట్టించి రైతులను ముంచావ్
- అందుకే గాలికి పుట్టిన పార్టీ వైసీపీ గాలి తీశారు
- చంద్రబాబు సారథ్యంలో అభివృద్ధి దిశగా అడుగులు
- చెప్పిన విధంగా సూపర్‌సిక్స్ అమలు చేస్తున్నాం
- టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి
మంగళగిరి(చైతన్యరథం): పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్‌రెడ్డి పరిస్థితి చూస్తే జాలివేస్తోందని.. అధికారం కోల్పోయి ఏం చేయాలో పాలుపోక నేడు ప్రజల ముందుకు వచ్చి ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వంపై విషప్రచారం చేస్తున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి ధ్వజమెత్తారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని దోపిడీ చేసి దేశంలోనే ఏపీని 29వ స్థానంతో అథ: పాతాళానికి తీసుకెళ్లాడు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో రాష్ట్రం విడిపో యి అనేక కష్టాల్లో ఉన్నా రాష్ట్రానికి రాజధాని కావాలని చెప్పి సంకల్పించుకుని అప్పటి సీఎం చంద్రబాబు 33 వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించారు. పోలవరం ప్రాజెక్ట్‌ను యుద్ధప్రాతిపదికన నిర్మిస్తే రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రజలకు తాగు, సాగు నీటికి ఎంతో ఉపయోగపడుతుందని ఢిల్లీ చూట్టు పరుగులు పెట్టి 2019 కల్లా 72 శాతం పనులు పూర్తి చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి మూడు రాజధానుల పేరుతో రాజధాని అమరావతిని సర్వనాశనం చేశాడు. పోలవరం ప్రాజెక్ట్ ను గాలికొలిలేశాడు.
అమరావతిలో జరుగుతున్న అనేక నిర్మాణాన్ని ధ్వంసం చేశాడు. రాయలసీమ ప్రాజెక్టులను పూర్తిగా నిర్వీర్యం చేశాడు. సొంత జిల్లా కడపలో ఒక్క నీటి ప్రాజెక్ట్‌ను కూడా నిర్మించలేదు. కనీసం ఒక్క రూపాయి ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేయలేదు. పోని సొంత నియోజకవర్గమైన పులివెందుల ప్రజలకు ఏమైనా చేశావా అంటే ఐదేళ్ల కాలంలో తాగునీరు లేదని ప్రజలు రోడ్డెక్కే పరిస్థితికి తీసుకొచ్చావ్. ఇప్పుడు బయటకు వచ్చి కూటమి ప్రభుత్వంపై ఏడునెలల కాలంలో అప్పులు చేశారని అబద్ధాలు చెబుతున్నావ్. నువ్వు రూ.12 లక్షల కోట్ల అప్పు చేసి ఒక్క రూపాయితో ఎక్కడైనా అభివృ ద్ధి కార్యక్రమం చేపట్టావా? సంక్షేమం పేరుతో దోపిడీ చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించావ్. రూ.12 లక్షల కోట్లకు ముందు సమాధానం చెప్పు. కూటమి ప్రభుత్వంపై విషప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారా అని ప్రశ్నించారు. 2019లో అనేక సంక్షేమ పథకాలు రద్దు చేసిన నువ్వు…
ఈ రోజు మళ్లీ సంక్షేమ పథకాలపై మాట్లాడతావా? అసలు సంక్షేమ పథకాలు మీరు ఎక్కడ అమలు చేశారు? లక్షల మంది పెన్షన్‌దారులు, వృద్దులు, వితంతువులు, దివ్యాంగులకు మాయమాటలతో రకరకాల కారణాలతో పెన్షన్ల లో కోత విధించి ఇబ్బంది పెట్టావ్. ఈ రోజు కూటమి ప్రభుత్వం పెన్షన్లు పెంచి అం దజేస్తుంటే విమర్శలు చేస్తున్నావ్. మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను దశల వారీగా అమలు చేస్తు న్నాం. ఈ ఏడునెలల సమయంలోనే మతిపోయి ఇష్టం వచ్చినట్టు అవి పాయే..అవి పాయే అంటూ విషం చిమ్ముతున్నావ్. ఏ పథకాలు పోలేదు..అన్ని అమలు చేస్తున్నాం. ఇది మంచి ప్రభుత్వమని ప్రజలు హర్షిస్తున్నారు. నీ మాయమాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని హితవుపలికారు.
చంద్రబాబు నేతృత్వంలో అభివృద్ధి దిశగా రాష్ట్రం
చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రం దూసుకుపోతోంది. 6.78 లక్షల కోట్ల పెట్టుబడు లు తీసుకొచ్చి రాష్ట్రాన్ని సంపద రాష్ట్రంగా తయారు చేసేందుకు కృషి చేస్తున్నారు. దీన్ని ప్రజలు హర్షిస్తున్నారు. ఇప్పటికే 4.28 లక్షల మందికి ఉద్యోగ కల్పన చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల సబ్ ప్లాన్ నిధులు ఇచ్చి ప్రోత్సహించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. మా హయాంలో 2.50 లక్షల వాలంటీర్ ఉద్యోగాలు పోయాయని ఏడుస్తున్నావ్. వాలం టీర్లను రెన్యువల్ చేయాల్సిన బాధ్యత మీదే. కానీ ఆ పని మీరు చేయలేదు. ఎన్నికల వేళ రాజకీయం కోసం వాడుకుని వారి చేత రాజీనామాలు చేయించి 2.50 లక్షల మందిని పచ్చి మోసం చేసింది నువ్వు కాదా? ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నావ్. ప్రజల్లో మేము తిరుగుతున్నాం. ప్రతి వాలంటీర్ జగన్‌రెడ్డి మోసం చేశాడని మాట్లాడుతున్నారు. ఐదేళ్లలో ఒక డీఎస్సీ పోస్టు అయినా ఇచ్చావా… చంద్రబా బు అధికారంలోకి రాగానే 16347 డీఎస్సీ పోస్టులకు ఆరు నెలల్లోనే భర్తీకి చర్యలు తీసుకుంటున్నారు. 6100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నాం. మీ హయాంలో విదేశీ విద్య నాశనం చేశావ్ అని ధ్వజమెత్తారు.
రైతులకు ఏం చేశావ్ జగన్‌రెడ్డీ…
రైతులకు గత ఐదేళ్ల కాలంలో ఒకక్క డ్రిప్ పరికరం అయినా ఇచ్చారా? మా ప్రభుత్వంలో 5 ఎకరాలు ఉంటే 90 శాతం, 10 ఎకరాలు ఉన్న వారికి 70 శాతం సబ్సి డీతో డ్రిప్ పరికరాలు అందచేస్తున్నాం. రాయలసీమను హార్టీ కల్చర్ హబ్‌గా చేయడానికి సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారు. పెండిరగ్ ప్రాజెక్టులను మొదలు పెట్టేందుకు ప్రక్రియ కొనసాగుతోంది. నీ ఐదేళ్ల కాలంలో రాయలసీమపై కానీ.. కడపపై కానీ ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. పులివెందుల రింగ్ రోడ్ సుందరీకరణకు వందల కోట్లు ఖర్చు చేసిన నువ్వు… సొంత నియోజకవర్గ ప్రజలకు నీరు ఇవ్వలేకపోయావ్. కూటమి ప్రభుత్వం వచ్చాక పోలవరం ప్రాజెక్టుకు కావాల్సిన నిధులను కేంద్రం నుంచి రాబట్టి 2027 లోపు పూర్తి చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నాం. పోలవరం పూర్తయితే ఉత్తరాంధ్ర, కోస్తాం ధ్ర రాయలసీమకు నీరు తీసుకొచ్చి వ్యవసాయం రంగం అందలం ఎక్కించేలా చేస్తు న్నాం. రాజధాని నిర్మాణానికి నిధులు సమీకరించి పనులు ప్రారంభించాం. మూడేళ్లలో పనులు పూర్తి చేసి అద్భుతమైన రాజధానికి చూపిస్తాం.
హంద్రీనీవా ఇతర పెండిరగ్ ప్రాజెక్ట్ పనులకు నిధులు కేటాయించాం. టెండర్లు పిలిచి పనులు అప్పగించాం. ఒక్క నీటి బొట్టు కూడా వృథా కాకూడదనే సంక్పలంతో చంద్రబాబు పనిచేస్తున్నారు. రాష్ట్రం లో సంక్షేమ పథకాల అమలు కోసం సంపద సృష్టించి అమలు చేసేందుకు చర్యలు తీసు కున్నాం. సూపర్ సిక్స్ పథకాలు ఆరు నూరైనా తల తాకట్టు పెట్టయినా అమలు చేస్తాం. ఇది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని లూటీ చేసి పేదలను ముంచేసి రూ.10 లక్షల కోట్లు విలువ చేసే భూములు కొట్టేసి లక్షల కోట్లు దోపిడీ చేశావ్. ఈ రోజు విషప్రచారం చేస్తుంటే ప్రజలు నమ్మరని హితవుపలికారు. మీరు ప్రజల్లోకి వెళ్లే నైతిక అర్హత కోల్పోయారు. ప్రజలు మళ్లీ మళ్లీ మీకు ఛాన్స్ ఇవ్వరు. ఇప్పటికే మీ పార్టీని వదిలేసి అంతా పోతున్నారు. 42 ఏళ్ల టీడీపీని భూస్థాపితం చేస్తామంటున్నారు. గాలికి వచ్చిన పార్టీ..గాలికి పుట్టిన పార్టీ..అక్రమ సంపాదనతో వచ్చిన పార్టీ వైసీపీ పార్టీ.. 2024లో ప్రజలు మీ పార్టీ గాలి తీసేశారు. మీరు గాలికి కొట్టుకుపోయారు. ప్రజలు ఇంకా మీ మాయ మాటలను నమ్మే పరిస్థితిలో లేరని గుర్తుపెట్టుకోవాలని హితవుపలికారు.