జగన్‌రెడ్డి దగాకోరు సంక్షేమం
– సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వం ఇచ్చిన సమాచారంతో వెల్లడైన వంచన
– గిరిజనులకు మొదటి నాలుగేళ్లలో క్రమంగా తగ్గిన నెలవారి పింఛన్
– సగటున పెరిగిన పింఛన్ నెలకు రూ.93 మాత్రమే
– 30 లక్షల గిరిజనుల్లో పింఛన్ దారులు మూడున్నలక్షలు మాత్రమే
– విద్యాదీవెన లబ్ధిదారులు కేవలం 41 వేలే
– ఫీజు రీయంబర్స్ మెంట్ హామీ రూ.30 -70 వేలు అయితే గిరిజనులకు దక్కింది రూ.18 వేలే
– వసతి దీవెన హామీ రూ.10-20 వేలు అయితే దక్కింది మాత్రం రూ.9 వేలే
– గిరిజనుల సంక్షేమానికి ప్రత్యేకంగా ఎట్టి పథకాలు లేవు
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమం అంతా డొల్లతనంతోనే కూడిరదని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపార్టీ మొదటి నుంచి ఆరోపిస్తూ వచ్చింది. ఈ ఆరోపణ పూర్తిగా వాస్తవమేనని జగన్ రెడ్డి ప్రభుత్వమే ఇటీవల అధికారికంగా ఇచ్చిన సమా చారంతో స్పష్టమైంది. రాష్ట్ర జనాభాలో ఆరు శాతంగా ఉన్న గిరిజనులు భౌగోళీక, సామాజిక, ఆర్థిక పరిస్థితు లు కారణంగా పలు సమస్యల వలయంలో నివసిస్తుం టారు. వీటిని దృష్టిలో పెట్టుకుని గిరిజనుల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు ఏమైన జగన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తుందో తెలుసుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాలెడ్జ్ సెంటర్ గిరిజనుల శ్రేయస్సు కోసం అమలౌతున్న పథకాలగురించి సమాచార హక్కు చట్టం కింద సమగ్ర సమాచారం కోరింది. దీనికి ప్రభు త్వం స్పందిస్తూ ఇటీవల ఇచ్చిన సమాధానం నివ్వర పరిచే విధంగా ఉంది. గిరిజనుల బాగుకోసం ప్రత్యేకం గా ఎటువంటి పథకాలు అమలులో లేవని… నలుగురి తో పాటే నారాయణ అని స్పష్టంచేస్తూ గిరిజన సంక్షేమ విభాగం తరుపున ట్రైకార్ (టైబల్ కార్పొరేషన్) 14 గిరిజన సంక్షేమ పథకాలగురించి సమాచారం ఇచ్చిం ది.ఈ సమాచారం జగన్‌రెడ్డి హయాంలో అమలౌవుతు న్న గిరిజన సంక్షేమంలోని డొల్లతనాన్ని పూర్తిగా ఎత్తిచూపింది.
పింఛన్లలో మోసం
జగన్ రెడ్డి గొప్పగా చెప్పుకునే నవరత్నాల్లో పింఛన్ల పథకం ప్రధానమైంది. పింఛన్లను రూ.2,000 నుంచి రూ.3,000లకు పెంచుతామని హామీ ఇచ్చి మడమ తిప్పిన జగన్‌రెడ్డి…లబ్ధిదారులను వంచనకు గురిచేసిన వైనం ఈ పథకాన్ని గిరిజనులకు అమలు చేసిన విధానంలో స్పష్టమైంది. 30లక్షలకు పైగా ఉన్న గిరిజ నులలో సామాజిక పింఛన్లు పొందేవారు కేవలం మూడు లక్షల 60వేల మందే.రాష్ట్ర ఐదుకోట్ల జనాభా లో పింఛన్‌దారులు 13 శాతం ఉండగా… గిరిజనుల్లో ఈ లబ్ధి పొందుతున్నవారు 12శాతానికిలోపే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన పింఛన్ దారులకు మొదటి నాలుగేళ్లలో (2019-2023) అందించిన సాయం వివరాలు విస్మయం కలిగించే విధంగా ఉన్నాయి.
2019-20లో గిరిజన పింఛన్ దారులకు జగన్ ప్రభుత్వం నెలకు రూ.2,201చెల్లించగా తదుపరి మూ డేళ్లలో అందించిన నెలవారి పింఛన్ దీనికంటే తక్కువ గా ఉండటం విడ్డూరంగా ఉండి సంక్షేమ విషయంలో జగన్‌రెడ్డి నిత్య అసత్యాలకు అద్దంపట్టింది. 2020 -2021లో నెలవారి పింఛన్ రూ.1,926కు పడిపోగా తదుపరి రెండు సంవత్సరాల్లో రూ.2,163 మరియు రూ.2,088గా ప్రభుత్వం వెల్లడిరచింది. అధికారంలోకి వచ్చాక నెలవారి పింఛన్‌ను రూ.3,000కు పెంచుతా మని జగన్‌రెడ్డి హామీ ఇవ్వగా… గిరిజనులకు అందిన పింఛన్ మొదటి నాలుగేళ్లలో క్రమంగా తగ్గి పోవడం జగన్‌రెడ్డి వంచనకు సాక్షిభూతంగా నిలిచింది. మొదటి నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం మేర కు సగటున పెరిగిన పింఛను నెలకు కేవలం రూ.93 మాత్రమే. దీన్ని బట్టి పింఛన్ల విషయంలోనే గిరిజనులు ఎంత భారీస్థాయిలో నష్టపోయారో తెలుస్తోంది.
విద్యాదీవెన
రాష్ట్ర జనభాలో విద్యాదీవెన లబ్ధిదారులు రెండు శా తం ఉండగా గిరిజనుల్లో మాత్రం భాగా తక్కువగా ఉం డటం గమనార్హం.పీజి విద్యార్థులకు కూడాగత చంద్ర బాబు ప్రభుత్వం ఫీజుచెల్లింపు సాయం అందించగా జగన్‌రెడ్డి దాన్ని రద్దు చేయడంతో పాటు ప్రస్తుతం అమలౌతున్న ఫీజు రియంబర్స్ మెంట్ పథకం అమలు లో విద్యార్థులు బాగా నష్టపోతున్నారు. ఈ విషయం గిరిజనుల విద్యార్థులకు మొదటి నాలుగు సంవత్సరా ల్లో అందించిన సాయం గురించి వెల్లడిరచిన సమా చారం ద్వారా స్పష్ట మైంది.
30 లక్షల గిరిజనుల్లో విద్యాదీవెన లబ్దిదారులు 41 వేల మంది మాత్రమే. పలు కారణాలుగా లబ్దిదారుల సంఖ్యను తగ్గించడానికి జగన్ ప్రభుత్వం చేసిన కుట్ర లు గిరిజనులను బాగా దెబ్బతీసినట్లు వెల్లడౌ తుంది. ఈ పథకం కింద వార్షిక ఫీజును కనీసంగా రూ.30 వేల నుంచి గరిష్టంగా రూ.70 వేల వరకు చెల్లిస్తామని జగన్ హామీ ఇచ్చారు. అయితే… మొదటి నాలుగేళ్లలో గిరిజనుల విద్యార్థులకు అందిన లబ్ధి జగన్ ఇచ్చిన కనీస హామీ కంటే తక్కువగా రూ.18 వేలు మాత్రమే ఉండటం జగన్‌రెడ్డి మోసపూరిత సంక్షేమానికి మరో సాక్షాత్కారం.ఈ స్వల్పసాయాన్ని కూడారాష్ట్ర ప్రభుత్వం 2020`2021లో విద్యార్థులకు ఇవ్వకుండా ఎగనా మం పెట్టడం జగన్‌రెడ్డి డొల్లసంక్షేమాన్ని వెల్లడిరచింది.
వసతి దీవెన
చదివే చదువును బట్టి విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యాలు కల్పించడానికి సంవత్సరానికి కనీసంగా రూ.10 వేల నుంచి గరిష్టంగా రూ. 20 వేల వరకు చెల్లిస్తామని జగన్ రెడ్డి ప్రగల్భాలు పలికారు. అయితే… సమాచారం హక్కు చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారం మేరకు గిరిజన విద్యార్థులు పొందిన సాయం జగన్ కనీస హామీ కంటే తక్కువగా రూ. 9,982 మాత్రమే. ఇదే కాకుండా… వసతి దీవెన సాయాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం 2020`2021లో ఎగ్గొట్టడం గమనార్హం.
చిత్తశుద్ధి లేని సంక్షేమం… ఇత వివరాలు
1. కొండ ప్రాంతాలు, రహదారి వసతులు లేని ప్రాంతాల్లో పలు కష్టాలు పడుతూ… అవసరమైనప్పుడు వైద్య చికిత్సకు కూడా నోచుకోక నానా ఇబ్బందులు పడుతున్న గిరిజన ప్రాంతాల్లో సంచార వైద్యశాల సేవల కల్పనకు మొదటి, నాలుగు సంవత్సరాల్లో జగన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. మధ్యలోని రెండు సంవత్సరాల్లో చేసిన మొత్తం ఖర్చు రూ.2 కోట్ల 74 లక్షలు మాత్రమే. ఇందులోనూ లబ్దిదారులుగా సంవత్సరానికి 701 చొప్పున రెండేళ్లలో చూపడం చిత్తశుద్ధి లేని జగన్ సంక్షేమానికి అద్దంపడుతుంది.
2. నైపుణ్యాభివృద్ధి పథకంలో మొదటి రెండు సంవత్సరాల్లో 1,432 లబ్ధిదారులపై రూ.6 కోట్ల 27 లక్షలు ఖర్చు చూపిన జగన్ ప్రభుత్వం తదుపరి రెండు సంవత్సరాల్లో చేసిన ఖర్చు శూన్యం.
3. విద్యోన్నతి పథకం కింద 30 లక్షల గిరిజనుల్లో కేవలం 336 లబ్దిదారులపై చేసిన ఖర్చు రూ.3 కోట్ల 5 లక్షలు మాత్రమే.
4. మరో విచిత్రమేమంటే గిరిజనుల శ్రేయస్సు కోసం మొదటి నాలుగు సంవత్సరాల్లో ఏడు నవరత్నాలతో పాటు మరో ఏడు ఇతర పథకాల కోసం చేసిన బడ్జెట్ ప్రతిపాదనలు రూ.6,519 కోట్లు కాగా… చేసిన ఖర్చు కూడా అంతే మాత్రంగా చూపెట్టడం విడ్డూరంగా ఉంది. బడ్జెట్ అంచనాలకు వాస్తవ ఖర్చు మొత్తాలకు ఎప్పుడూ ఎక్కువ తక్కువలు ఉంటాయి. అలా కాకుండా రెండు ఒకే విధంగా చూపటం గిరిజన సంక్షేమం గురించి జగన్ రెడ్డి ప్రభుత్వ సమాచార విశ్వసనీయతను ప్రశ్నించే విధంగా ఉంది.
గిరిజన సంక్షేమ విషయంలో వెల్లడైన జగన్ రెడ్డి డొల్లతనం ఆయన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల మొత్తం విశ్వసనీయతను ప్రశ్నించే విధంగా ఉంది.