- వరుసగా 4వరోజూ టిడిపి సభ్యుల సస్పెన్షన్
- టిడిపి ఆందోళనతో దద్దరిల్లిన ఉభయసభలు
- శాసనస మండలిలో తీవ్రస్థాయిలో వాగ్వివాదం
- 11గంటలపాటు నిరాటంకంగా శాసనమండలి
అమరావతి: రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో వరుసగా నాలుగోరోజు కూడా తెలుగుదేశం శాసనసభ్యులను అధికారపక్షం గొంతునొక్కింది. సంక్షోభంలో సం క్షేమం పేరుతో టిడిపి ప్రవేశపెట్టిన వాయిదాతీర్మానా న్ని తిరస్కరించిన స్పీకర్… నిరసన తెలుపుతున్న సభ్యులను నాలుగోరోజు కూడా సస్పెండ్ చేశారు. అంతకుముందు సంక్షోభంలో సంక్షేమం నినాదంతో నారా లోకేష్ ఆధ్వర్యంలో టిడిపి శాసనసభ పక్షం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వివిధ సంక్షేమ పథకా ల రద్దునిరసిస్తూ అసెంబ్లీ సమీపంలోని ట్రాఫిక్ పీఎస్ వద్ద తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. అన్న క్యాంటీన్లు,పెళ్లి కానుక, పండుగ కానుకలు, అంబేద్కర్ విదేశీ విద్యపథకాలు రద్దు నిర సిస్తూ ప్రదర్శన చేశారు. సబ్ ప్లాన్ నిధులు పక్కదారి, అమ్మ ఒడి కుదింపు, డ్వాక్రా కి టోకరా, కరెంట్ బిల్లుల ఆధారంగా ఫించన్ కోత తదితర అంశాలపై ఆం దోళన చేపట్టారు. రేషన్ బియ్యం కుంభకోణం, ఎస్సి, ఎస్టి, బీసీలకు నయ వంచన నినాదాలతో నిరసన తెలుపుతూ కాలినడకన అసెంబ్లీకి వెళ్లారు.
శాసనస మండలిలో తీవ్రస్థాయిలో వాగ్వివాదం
శాసనమండలిలో వ్యవసాయంపై చర్చసాగుతున్న సమయంలో మంత్రి కాకాని గోవర్ధనరెడ్డి,టీడీపీ సభ్యు ల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. వ్యవసా యాన్ని టీడీపీ హయాంలో నిర్లక్ష్యం చేశారని మంత్రి కాకాని ఆరోపించారు. నీరు చెట్టులో అవినీతి జరిగిందన్న కాకాని వ్యాఖ్యలపై టీడీపీ సభ్యులు తీవ్ర ఆగ్ర హం వ్యక్తంచేశారు. కోర్టులో ఫైళ్లు మాయం చేసి,కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు పోగొట్టారని కాకానిపై టీడీపీ సభ్యులు మండిపడ్డారు. ఫేక్ పత్రాలతో తప్పు డు ఆరోపణలు చేసి, దొంగకేసులు పెట్టించారంటూ దుయ్యబట్టారు. ఫోర్జరీ కాకాని, 420 కాకాని, కబ్జా కాకాని అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు చేశారు.
11గంటలపాటు నిరాటంకంగా శాసనమండలి
రాష్ట్ర శాసనమండలి మంగళవారం 11 గంటల పాటు నిరాటంకంగా కొనసాగింది.వ్యవసాయం అనం తరం సంక్షేమంపై స్వల్పకాలిక చర్చ సాగింది. అధి కారపార్టీ నేతల ప్రసంగం తర్వాత చర్చ మొదలు పెట్టిన టీడీపీ సభ్యుల ప్రసంగాన్ని అడుగడుగునా వైసీ పీ సభ్యులు అడ్డుకున్నారు. వైసీపీ పాలనలో బడుగు బలహీన వర్గాలపై జరిగిన దాడిని, అన్యాయాన్ని సభ ముందుకు తెచ్చే ప్రయత్నంచేశారు. టీడీపీ సభ్యుల ప్రసంగానికి మంత్రులు మేరుగ నాగార్జున, ఉషశ్రీ చరణ్, చెల్లిబోయిన వేణుగోపాల్, అంజాద్ బాషా, ఎమ్మెల్సీలు పోతుల సునీత, గంగుల ప్రతాప్ రెడ్డి అడుగడుగునా అడ్డుతగిలారు. టీడీపీ సభ్యుల ప్రసం గానికి మంత్రి మేరుగ నాగార్జున అడ్డుపడటాన్ని ఒకా నొక దశలో మండలి చైర్మన్ తప్పుబట్టారు.