టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వెదురు సొసైటీలను పునరుద్దరించి వెదురు కొనుగోలుకు సబ్సిడీలు అందజేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. యువగళం పాదయాత్రలో భాగంగా మంగళవారం అనంతపురం సూర్యనగర్ లో మేదర సామాజిక వర్గీయులు లోకేష్ ను కలిసి వారి సమస్యల గురించి విన్నవించారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందించారు.
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి బిసిల వెన్నెముక విరిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మేదర్లు వస్తువులను విక్రయించుకునేందుకు ఎగ్జిబిషన్లలో స్టాళ్లు కేటాయిస్తాం. మేదర్లు తయారుచేసిన వస్తువులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.