- నిమ్మకూరులో చంద్రబాబునాయుడు
- పేదలను ఆదుకునేందుకు వికాసం పేరుతో ప్రత్యేక కార్యక్రమం
- గ్రామాల అభివృద్ది కోసం పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలి
- ప్రజలు ` ప్రభుత్వం – ప్రైవేటు – భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలన
- వైసీపీ ప్రభుత్వానికి పన్నులు పెంచడం తప్ప సంపద సృష్టించటం తెలీదు
- నిమ్మకూరులో చంద్రబాబునాయుడు
నిమ్మకూరు: పేదరికం లేని సమాజం చూడాలన్నదే ఎన్టీఆర్ ఆశయమని… దాన్ని నిజం చేసేందుకు ఆ మహనీయుడు పుట్టిన గడ్డ నుంచే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కృష్ణా జిల్లా నిమ్మకూరులో గురువారం పేదరిక నిర్మూలన కోసం వికాసం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రకటించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన చంద్రబా బు… తరువాత అక్కడ జరిగిన సభలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు పూర్ టు రిచ్ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించి… లక్ష్యాలను వివరిం చారు. సంపదను సృష్టించి పేదలకు లబ్ధి చేకూరేలా చేయడమే ఈ కాన్సెప్ట్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. నిమ్మ కూరు గ్రామం నుంచి పారిశ్రామికవేత్తలుగా, వివిధ రంగాల్లో ఉన్నతస్థాయికి ఎదిగినవారు ఇక్కడి కుటుం బాలను బాగుచేసే బాధ్యతను తీసుకోవాలని సూచిం చారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి అండగా ఉండాల న్నారు. ప్రభుత్వ, ప్రయివేటు, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు చేపట్టాలని… ఆదాయాన్ని రెట్టింపు చేసే మార్గాలను అన్వేషించాలన్నారు. ఈ పథకాన్ని ముందుగా ఎన్టీఆర్ గ్రామమైన నిమ్మకూరు, తన గ్రామమైన నారావారిపల్లె గ్రామాల్లో మొదలుపెడతా మని వెల్లడిరచారు.
ఎన్టీఆర్ సాధారణ రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి ఎదిగారు. కృషి పట్టుదల, క్రమశిక్షణ ఆయన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్లాయి. సినీరంగంలో ఎన్టీఆర్ పోషించి న పాత్రలు మరెవరూ పోషించలేరు. ఎన్టీఆర్ రాజకీ యాల్లో ఉన్నది 13 ఏళ్లే అయినా రాజకీయాలకు నూత న దిశ, దశ ఇచ్చారు. పేదలకు సేవ చేయటం, వారికి అండగా ఉండటమే రాజకీయం అని నిర్వచనం ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. పేదరికం లేని సమాజం చూడాలన్నదే ఎన్టీఆర్ ఆశయం. ఆ మహనీయుని వర్ధంతి సంద ర్భంగా పేదరికం లేని సమాజం కోసం పనిచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉంది. మన దేశంలో 1991 వరకు రోడ్లు బాగుండేవి కాదు. తరువాత తెచ్చిన సంస్కరణలతో అభివృద్ది చేశాం. రోడ్లు వేశాం, కరెంట్ కోతలు తొలగించాం. కాలేజీలు పెట్టాం. వైసీపీ ప్రభుత్వానికి పన్నులు పెంచటం తప్ప సంపద సృష్టించటం తెలియదు. ఒక చేత్తో పది ఇచ్చి మరో చేత్తో వంద రూపాయిలు లాగేస్తున్నారు. సంపద ద్వారా వచ్చిన డబ్బుల్ని… రెట్టింపు ఎలా చేయాలి, ఆ సంపదను పేదలకు ఎలా పంచాలన్నదే తన ప్రయత్న మని చంద్రబాబు చెప్పారు.
ఎన్టీఆర్ స్ఫూర్తితోనే..
నాలెడ్జి ఎకానమీలో రాష్ట్రాన్ని ప్రపంచంతో అను సంధానం చేసి ఈ గ్రామంలోని యువతకు అవకాశా లు కల్పిస్తాం. ఈ ఊరి నుండి సుమారు 500 మంది బయటకెళ్లి స్థిరపడ్డారు. వారిలో డాక్టర్లు 30 మంది, వ్యాపారస్థులు 20 మంది, ఉద్యోగస్తులు 450 మంది ఉన్నారు. వీరంతా ఒక్కొక్కరూ ఒక్కో కుటుంబానికి చేయూతనిచ్చి వారిని ఆర్థికంగా పైకి తీసుకురాగలిగితే పేదరికం లేకుండా చేయవచ్చు. దీని కోసం ప్రత్యేక మైన విధానాన్ని తీసుకువస్తాం. ఈ కార్యక్రమాన్ని షార్ట్ టర్న్, మీడియం టర్న్, లాంగ్ టర్న్ గా తీసుకుంటాం. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే పూర్ టు రిచ్ కార్యక్రమాన్ని నిమ్మకూరులో ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. మన గ్రామాన్ని ప్రపంచానికి అనుసంధానం చేసే వినూత్న కార్య క్రమమన్నారు. ఈ కార్యక్రమం అందరికీ మార్గదర్శకం కానుందని చంద్రబాబు పేర్కొన్నారు.
ప్రతి కుటుంబానికీ ఓ విజన్ ఉండాలి
మీ కుటుంబంలోని సభ్యులే మీ ఆస్తి…వారి ద్వారా ఎలా ఆస్తి సంపాదించాలో ఆలోచించాలి. వాళ్ల స్కిల్, శక్తి సామర్థ్యాలను పెంచి వారి ఆదాయం రెట్టింపు చేసే మార్గాలు అన్వేషించాలి. పిల్లలకు ఏం చదవాలి అనే గైడెన్స్ ఇవ్వటంతోపాటు వారికి ఆర్థికంగా తోడ్పాటు అందించాలి. అలా సేవాభావం ఉన్నవారిని ముందుకు రమ్మని పిలుపునిస్తున్నా. డబ్బు సంపాదించటం ఎంత ముఖ్యమో దాన్ని అర్థవంతంగా ఖర్చు చేయటం అంతే ముఖ్యం. ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామం (పీ 4) తో ఈ కార్యక్రమం నడుస్తుంది. హైదరాబాద్ లో రూపాయి ఖర్చు లేకుండా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కట్టాం. దాని ద్వారా ఇవాళ హైదరాబాద్ కి ఆదాయం వస్తోంది.
ప్రతి కుటుంబానికి ఒక విజన్ తయారు చేసుకోవాలి. ఏం పని చేస్తున్నారు, ఆదాయం పెరిగేందుకు ఏం చేయాలో ఆలోచించాలి. మీ పిల్లలతో పాటు గ్రామంలోని పిల్లల్ని చదవించండి. గ్రామాల నుంచి నేడు పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. గ్రామంలో కుటుంబాలను బాగుచేసే బాధ్యత వీరు తీసుకోవాలి. ప్రతి కుటుంబం ఓ విజన్‌ను తయారు చేసుకోవాలి. ఆదాయం ఎలా రెట్టింపు అవుతుందో ప్రణాళిక ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో పేదరికం లేని సమాజం నెలకొల్పుదాం. దీనికి ప్రజల సహకారం, మద్దతు కావాలి. ఇది కేవలం ఆరంభం మాత్రమే. అందరి ఆలోచనలను తీసుకొని ముందుకు సాగుదాం. ఈ కాన్సెప్ట్ విజయవంతమవుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు