చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ముఖ్య వార్తలు

వైసీపీ సైకోలకు ఐపీసీ సెక్షన్ల పవర్‌ చూపిస్తాం

హింస టీడీపీ విధానం కాదని స్పష్టం చేసిన పట్టాభి

by చైతన్యరధం
June 11, 2024
in ముఖ్య వార్తలు
గౌతమ్‌ సవాంగ్‌ బుకాయింపులు ఆపి తక్షణమే రాజీనామా చేయాలి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • లోకేష్‌ రెడ్‌బుక్‌ను వాస్తవంలోకి తెస్తాం
  • వైసీపీ పాపాలకు చట్టప్రకారమే శిక్ష పడేలా చేస్తాం
  • జగన్‌ సహా వైసీపీ నేతలందరూ జైలుకెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి
  • చంద్రబాబుపై, మాపై దాడులు చేసినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకురాలేదా?
  • సిగ్గులేకుండా వైసీపీ నేతల నంగనాచి కబుర్లు
  • 11సీట్లతో మోకాళ్లపై కూర్చోబెట్టినా వైసీపీ నేతల అరాచకాలు ఆగడంలేదు
  • కర్నూలు జిల్లాలో టీడీపీ నేత గిరినాథ్‌ను దారుణంగా హతమార్చారు

అమరావతి(చైతన్యరథం): ప్రజలు మక్కెలు విరగొట్టి 11సీట్లతో మోకాళ్లపై కూర్చోబెట్టినా వైసీపీ పిల్ల సైకోల అరాచకాలు ఆగడం లేదని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సిద్ధం చేసిన రెడ్‌ బుక్‌ అనేది వాస్తవమని, అందులో పేర్లు నమోదైన వారిని చట్ట ప్రకారమే శిక్షిస్తామన్నారు. వైసీపీ పిల్ల సైకోలకు ఐపీసీ సెక్షన్ల పవరేంటో చూపిస్తామన్నారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదని, చట్టం ప్రకారం తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దాడులు చేయడం టీడీపీ విధానం కాదని, హింసను చంద్రబాబు ప్రోత్సహించబోరన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు టీడీపీ, కూటమి నేతలు కట్టుబడి ఉన్నారని తెలిపారు. సోమవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలు సైకోలుగా ముద్ర వేయించుకున్న వైసీపీ నాయకులు నేడు మీడియా ముందుకు వచ్చి నంగనాచుల్లాగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ వారిపై దాడులు జరుగుతున్నాయంటూ రకరకాల డ్రామాలు మొదలు పెట్టారు. గత ఐదేళ్లుగా ఎన్నో అరాచకాలకు పాల్పడిన వైసీపీ నేతలు ఏ పాపం తెలియనట్లుగా మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రజలు విస్తుపోతున్నారు. జూన్‌ 4 నియంత పాలనకు ముగింపు పలికిన రోజు. ఆ రోజు రాష్ట్ర ప్రజలు దీపావళి జరుపుకున్నారు. రాష్ట్ర ప్రజలంతా ‘నారా చంద్రబాబు అను నేను’ అనే మాటలు వినడానికి ఎదురు చూస్తున్నారు. ఆ రోజున కొన్ని నెలలు ముందుగానే సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారని పట్టాభి అన్నారు.

హింసను ప్రేరేపిస్తున్నది ఎవరు..
జరుగుతున్న వాస్తవాలు గమనిస్తే కర్నూలు జిల్లా బొమ్మిరెడ్డిపల్లిలో టీడీపీ నాయకుడు గిరినాథ్‌ చౌదరిని అత్యంత కిరాతకంగా నడిరోడ్డుపై వైసీపీ మూకలు హతమార్చారు. మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కుటుంబ సభ్యులు, అనుచరులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ దారుణ హత్యకు వైసీపీ నేతలు ఏం సమాధానం చెబుతారు. నంగనాచుల్లా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న గుడివాడ నాని, పేర్ని నాని ఇప్పుడు ఏం చెబుతారు. హింసను ప్రేరేపిస్తున్నది ఎవరో వైసీపీ నేతలు చెప్పాలి. రాష్ట్రంలో హింసకు కారణం వైసీపీ సైకో మూకలే. ఒక పక్క ప్రజలు 11 సీట్లతో మిమ్మల్ని మోకాళ్లపై కూర్చోబెట్టినా ఇంకా బుద్ది తెచ్చుకోకుండా దారుణాలు, హత్యలు, సైకో చేష్టలు కొనసాగిస్తూ.. నంగనాచిలా మాట్లాడుతున్నారు. గవర్నర్‌ వద్దకు వెళ్లి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ సిగ్గులేకుండా విన్నపాలు చేస్తున్నారు. టీడీపీ నేతలను కిరాతకంగా చంపడాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అంటారా? ఐదు సంవత్సరాలు వైసీపీ నేతలు చేసిన పాపాల పర్యవసానమే జూన్‌ 4 ఫలితం. సిగ్గులేకుండా ఏ ముఖం పెట్టుకుని జనాల్లోకి వస్తున్నారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా మీకు దక్కలేదు. నిజమైన దేవుడి స్క్రిప్ట్‌ ఏంటో ఆ భగవంతుడు చూపించాడని పట్టాభి అన్నారు.

చట్ట ప్రకారమే బుద్ధి చెబుతాం
వైసీపీ ఐదు సంవత్సరాల పరిపాలన ఈ రాష్ట్రానికి ఒక కళంకం. అందుకే 151 కి మధ్యలో ఉన్న 5 అంకెను చెరిపేసి కేవలం 11 మాత్రమే ఉంచాడు ఆ భగవంతుడు. టీడీపీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ.. కూటమి పార్టీలు ప్రజాస్వామ్యాన్ని బతికించాయి. అటువంటి మాకు ప్రజాస్వామ్యం గురించి చెప్పే హక్కు వైసీపీ వారికి లేదు. చంద్రబాబు బాబు మాకు ఒక క్రమశిక్షణను అలవాటు చేశారు. ప్రజాస్వామ్య విలువలు గురించి మాకు తొలినుంచీ బోధిస్తున్నారు. వైసీపీ సైకో మూకలు ప్యాంట్లు తడుపుకోవాల్సిన అవసరంలేదు. టీడీపీ తరఫున హామీ ఇస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడా కూడా వైసీపీ వారిపై భౌతిక దాడులు జరగవు. మీ ఇళ్లపై దాడులకు తెగబడరు, మీ కుటుంబ సభ్యులను ఎవరూ భయపెట్టరు. మేము హింసను ప్రేరేపించం. ఆ మార్గం మాది కాదు. కానీ చట్టం, ఐపీసీ సెక్షన్‌ల పవర్‌ ఏంటో చూపిస్తాం. దాంట్లో ఎక్కడా రాజీ పడం. లోకేష్‌ రెడ్‌బుక్‌లో నమోదు అయిన వైసీపీ సైకోలు, అవినీతిపరులైన అధికారుల అందరి సంగతి తేలుస్తాం.. చట్టానికి లోబడి గట్టిగా బుద్ధి చెబుతాం. రెడ్‌ బుక్‌ను రియాల్టీలోకి తెస్తామని పట్టాభి స్పష్టం చేశారు.

అప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా?
దేవాలయం లాంటి టీడీపీ కార్యాలయంపై దాడిచేసినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? మా అందరికి తండ్రిలాంటి వ్యక్తి నారా చంద్రబాబు ఇంటిపై జోగి రమేష్‌ దాడి చేసినప్పుడు, మాచర్లలో బొండా ఉమా, బుద్ధా వెంకన్నలపై దాడిచేసినప్పుడు, చంద్రబాబు అమరావతి పర్యటనకు వెళ్లినప్పుడు రాళ్లు, కర్రలతో దాడి చేసి అది వారి భావ ప్రకటన స్వేచ్ఛ అన్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా దాడులను కట్టడిచేయాల్సిన వ్యక్తి మాకు బీపీలు రావా అన్నప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడికి పోయింది? తోట చంద్రయ్యను అత్యంత కిరాతకంగా పీక కోసి చంపేశారు. కంచర్ల జల్ల్లయ్య, కిరణ్‌, డాక్టర్‌ సుధాకర్‌, అమర్నాధ్‌, అబ్దుల్‌ సలాం లాంటి వ్యక్తులను దారుణంగా హతమార్చారు. సెప్టెంబర్‌ 2022 లో చెన్నుపాటి గాంధీ పై దాడి చేసి ఆయన కన్ను పోగొట్టారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం, నందిగామలలో చంద్రబాబుపై రాళ్లతో దాడి చేశారు. మీకు కొమ్ముకాస్తున్న పోలీసులతో గోడలు దూకించి మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని అక్రమంగా అరెస్ట్‌ కొల్లు రవీంద్రపై లేనిపోని నిందలు మోపి ఆయన్ను అరెస్ట్‌ చేయించారు. మా ఇంటిపై దాడి చేసి నా బిడ్డను భయబ్రాంతులకు గురిచేసి నా ఇంటిని ధ్వంసం చేశారు. నడిరోడ్డులో నా కారును ధ్వంసం చేశారు. నారా లోకేష్‌ పాదయాత్రపై 22 సార్లు దాడులు చేశారు. అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే రాజమండ్రిలో వారిపై పెట్రోల్‌ పోశారు. కనదుర్గమ్మ దర్శనానికి వెళితే మహిళలపై రక్తం వచ్చేలా దాడులు చేశారు. మా నాయకుడు లోకేష్‌ను కనకదుర్గమ్మ వారధిపై ఐదు గంటల పాటు నిర్బంధించారు. మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్‌ రెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి వెళితే సీబీఐ అధికారులపై దాడిచేశారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఇంటిపై ఎన్ని సార్లు దాడులు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పల్నాడులో గ్రామాలకు గ్రామాలు ఖాళీచేయించి పారిపోయేలా చేశారు. బాధితుల కోసం మేం గుంటూరులో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇవాళ మళ్లీ వైసీపీ నేతలు సిగ్గులేకుండా మాకు పాఠాలు చెబుతారా. కౌంటింగ్‌ రోజు దాదాపు 13 చోట్ల దాడులు చేశారు. ఎన్నో అరాచకాలకు పాల్పడిన వైసీపీ నేతలు దేవినేని అవినాష్‌, కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని, అనిల్‌ కుమార్‌ యాదవ్‌ లను ఎవరినీ వదిలిపెట్టం. జగన్‌రెడ్డి సహా రేపు వీళ్లంతా వెళ్లబోయేది జైలుకే. అక్కడ ఉండేందుకు ఇప్పటి నుంచే మానసికంగా సిద్ధం కావాలి. నిజమైన ఐపీఎస్‌, పోలీసు అధికారులు డ్యూటీలో ఉంటే ఏరకంగా ఉంటుందో చూపిస్తాం. ఎక్కడ దాక్కున్నా ఈడ్చుకొస్తాం.. ఎవరినీ వదిలిపెట్టం. వైసీపీ నేతల పాపాల చిట్టా మొత్తర మా దగ్గర ఉంది. అన్నీ బయటకు తీసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పట్టాభి స్పష్టం చేశారు.

పోలీసులపై దాడులు మరిచారా?
పోలీసులు చర్యలు తీసుకోవడంలేదని వైసీపీ నేతలు తప్పుబడుతున్నారు. పోలీసుల పట్ల వైసీపీ నేతలు చేసిన దుర్మార్గాలను మర్చిపోయారా? చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు పోలీస్‌ కానిస్టేబుల్‌ను గుద్ది చంపారు. నంద్యాలలో పోలీసు అధికారి గూడూరు నరేంద్ర కుమార్‌ను అత్యంత దారుణంగా చంపేశారు. కృష్ణాజిల్లా పమిడిముక్కలలో మట్టితవ్వకాలను అడ్డుకున్న పోలీసులపై అక్కడ ఉన్న వైసీపీ సర్పంచ్‌ దాడి చేస్తే కానిస్టేబుల్‌ బాలకృష్ణ తల పగిలింది. వైసీపీ ఎంపీగా ఉన్న నందిగం సురేష్‌ .. కృష్ణలంక పోలీస్‌ సేషన్‌కు వెళ్లి దౌర్జన్యం చేసి అక్కడ ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. సీదిరి అప్పలరాజు.. జనం అందరి ముందే పోలీసులను దుర్భాషలాడారు. కుప్పం నియోజకవర్గంలో సీఐ సాధిక్‌పై వైసీపీ నేతలు దాడి చేశారు? విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఆఫీసుపై దాడి జరిగిప్పుడు అడ్డుకున్న పోలీసులపై వైసీపీ నేతలు దాడి చేశారు. ఇవన్నీ మర్చిపోయి పోలీసుల గౌరవం గురించి, పోలీసుల మర్యాద గురించి మాట్లాడే హక్కు వైసీపీ నేతలకు లేదని పట్టాభి అన్నారు.

అందరి లెక్కలు తేలుస్తాం
చంద్రబాబు పాలనలోనే పోలీసులకు నిజమైన స్వేచ్ఛ దొరుకుతుంది. నిజాయితీ గల పోలీసులు రొమ్ములు విరుచుకుని డ్యూటీ చేసేది టీడీపీ పాలనలోనే. రాష్ట్రంలో శాంతియుత వాతావరణం కావాలి. ప్రజలు ప్రశాంతతను కోరుకుంటున్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ.. చట్టబద్ధంగా వ్యవహరిస్తాం. చట్టం పవరేంటో చూపిస్తాం… సైకో మూకలను ఎవరినీ వదిలిపెట్టకుండా బుద్ధి చెప్పాలని ప్రజలు కోరుకుంటున్నారు. సాక్ష్యాలు సేకరిస్తున్నాం. అందరి లెక్కలు తేలుస్తాం. చంద్రబాబు పాలనలో పెట్టుబడులు వస్తాయి. ప్రజలు సంతోషంగా ఉంటారు. దేశంలో నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా ఏపీని తీర్చుదిద్దుకుందామని పట్టాభి అన్నారు.

Tags: అక్రమ కేసులుకొమ్మారెడ్డి పట్టాభిరామ్‌జగన్ రడ్డి దాడులుజగన్ రెడ్డి అక్రమాలుతప్పుడు పోలీసులు
Previous Post

ఒక్కో టీచర్‌ బదిలీకి రూ.3 నుంచి 6 లక్షలు వసూలు

Next Post

అమరావతికి కొత్తకళ!

మరిన్ని వార్తలు

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా
ఆంధ్రప్రదేశ్

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

November 2, 2026
తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం
ఆంధ్రప్రదేశ్

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

November 2, 2026
ఆంధ్రప్రదేశ్

తుఫాను బాధితుల కష్టం తెలుసు…ఆదుకుంటాం

October 31, 2026
నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు
ఆంధ్రప్రదేశ్

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

October 30, 2026
నష్ట అంచనాలకు కేంద్ర బృందాలను పంపండి
ఆంధ్రప్రదేశ్

తుఫాన్ నష్టంపై కేంద్రానికి నివేదిక

October 29, 2026
నష్ట అంచనాలకు కేంద్ర బృందాలను పంపండి
ఆంధ్రప్రదేశ్

నష్ట అంచనాలకు కేంద్ర బృందాలను పంపండి

October 29, 2026
Next Post
అమరావతికి కొత్తకళ!

అమరావతికి కొత్తకళ!

ముఖ్య వార్తలు

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

బాలికను సొంత కూతురిలా చూసుకుంటా

by చైతన్యరధం
November 2, 2026

ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది మరో 48 గంటలు కీలకం...సురక్షితంగా రావాలని ప్రార్థిద్దాం విద్యార్థుల రక్షణే మా మొదటి ప్రాధాన్యం దాడులు పునరావృతం కాకుండా...

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

తుఫాన్ సహాయక చర్యలకు సన్నద్ధం

by చైతన్యరధం
November 2, 2026

యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశం ఉన్నతాధికారులతో ముందస్తు కార్యాచరణపై సమీక్ష నేటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు వెల్లడి అమరావతి(చైతన్యరథం): రాష్ట్రానికి మరో తుఫాను ముప్పు పొంచి...

తుఫాను బాధితుల కష్టం తెలుసు…ఆదుకుంటాం

by చైతన్యరధం
October 31, 2026

సాధారణ స్థితికి తెచ్చేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం పంటల బీమాతోనే ప్రతి రైతుకూ ధీమా డెల్టా కాలువల ఆధునికీకరణతో ముంపు తొలగిస్తాం తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు...

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

నేడు రాష్ట్రానికి కేంద్ర బృందాలు

by చైతన్యరధం
October 30, 2026

క్షేత్రస్థాయి పరిశీలనతో వాస్తవ నష్టం అంచనా ప్రాథమికంగా రూ.4,600 కోట్ల నష్టం వాటిల్లింది ఆ నివేదికను ఇప్పటికే కేంద్రానికి కూడా పంపాం యంత్రాంగం అప్రమత్తంతో ప్రాణనష్టం తగ్గింది...

మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్ర!

by చైతన్యరధం
August 21, 2025

స్టార్టప్‌లకు ఊపిరి పోసేలా రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ అమరావతితోపాటు ఐదుచోట్ల ఆర్టీఐహెచ్‌ కేంద్రాలు రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇన్నోవేషన్‌ బిజినెస్‌...

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

గొడ్డలి పార్టీకి దెబ్బకొట్టాలి ‘స్థానికం’లో కూటమే గెలవాలి

by చైతన్యరధం
October 12, 2026

గెలిచే అభ్యర్థులకే టికెట్లు మిత్రపక్షాలతో పక్కా సమన్వయం ఉండాలి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ అమరావతి (చైతన్యరథం): స్థానిక సంస్థల...

‘మన మిత్ర’

‘మన మిత్ర’

by చైతన్యరధం
January 31, 2025

ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజా ప్రభుత్వం వాట్సప్‌ గవర్నెన్స్‌ను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్‌ ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి వాట్సప్‌...

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

దాడులు… పిటిషన్లు… లిటిగెంట్లు…ఇదే గొడ్డలి పార్టీ నైజం

by చైతన్యరధం
October 25, 2026

అదే హింస...అవే అబద్ధాలు...అవే అరాచకాలు వైసీపీ పాలనలో చేసిన దారుణాలు మరిచిపోయారా? ప్రజలను భయభ్రాంతులు చేసి ఏకగ్రీవాలు చేసుకున్నారు స్వేచ్ఛగా నామినేషన్లు వేస్తూనే వ్యవస్థలను తప్పుపడుతున్నారు నేం...

మరిన్ని

తాజా సంఘటనలు

చైతన్యరధం ఈ పేపర్ 03-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 03-11-2026

by కార్యకర్త
November 3, 2026

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

చైతన్యరధం ఈ పేపర్ 02-11-2026

by కార్యకర్త
November 2, 2026

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

ప్రజాప్రభుత్వంలో పారదర్శకంగా స్థానిక ఎన్నికలు

by చైతన్యరధం
November 2, 2026

ప్రజాస్వామ్యం గురించి జగన్‌రెడ్డి నీతులు చెబుతున్నారు పులివెందులలో ఉద్దేశపూర్వకంగానే సమస్య సృష్టించారు నాడు ఏకగ్రీవాలు ఎలా చేశారో అందరూ ప్రశ్నించాలి ఎన్నికల కోడ్ ఉండగా ర్యాలీ ఏ...

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

విద్యార్థుల్లో మానసిక ధైర్యం నింపేందుకు చర్యలు

by చైతన్యరధం
November 2, 2026

రాప్తాడు ఘటన నేపథ్యంలో కౌన్సెలింగ్ 20 మందితో ప్రత్యేక బృందం ఏర్పాటు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి మానసిక ధైర్యం, భద్రతపై భరోసా కల్పించేలా లోకేష్ చర్యలు అమరావతి(చైతన్యరథం):...

మరిన్ని
[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ
© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.
Telegram Whatsapp Facebook X-twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.