- ఎర్రచందనం స్మగ్లింగ్ పై డిప్యూటీ సీఎం హెచ్చరిక
- తిరుపతి జిల్లా మామండూరులో విస్తృత పర్యటన
- ఎర్రచందనం గోదాము పరిశీలించిన డిప్యూటీ సీఎం
తిరుపతి (చైతన్య రథం): ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హెచ్చరించారు. తిరుపతిజిల్లాలోని మామండూరు అటవీ ప్రాంతాన్ని, మంగళంలోని ఎర్రచందనం గోదాము ను పరిశీలించారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో అటవీ అధికారులతో సమీక్ష అనంతరం మీడియాతో మాట్లా డారు. “ఎర్రచందనం చెట్టువెనుక ఆధ్యాత్మిక చరిత్ర ఉంది. వేంకటేశ్వరస్వామి గాయంనుంచి పుట్టిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఎర్రచందనం అక్రమ రవాణాపై జిల్లాల ఎస్పీలతో సమీక్ష నిర్వహించాం. శేషాచలం అడవు ల్లో స్మగర్లు దాదాపు 2లక్షల ఎర్రచందనం చెట్లు కొట్టేసి ఉంటారని అధికారుల అంచనా. అక్రమ రవాణాను అడ్డు కునేందుకు టాస్క్ ఫోర్స్న ఏర్పాటు చేశాం. స్మగ్లింగును అరికట్టేందుకు ఏపీ, కర్ణాటక మధ్య ఒప్పందం చేసుకుందామని కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కోరాం. ఇప్పటికే ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న నలుగురు కింగ్పన్స్ను గుర్తించాం. వారిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టాం” అని వెల్లడించారు.
“శేషాచలం అడవుల్లో మాత్రమే ఉండే ఎర్రచందనం చెట్లు పర్యావరణాన్ని కాపాడుతాయి. ఈ చెట్ల నరికివేతలో స్థానికులు పాల్గొనవద్దు. ఆపరేషన్ కగారు అమలుచేస్తున్న ఈదేశంలో..ఎర్ర చందనం స్మగర్ల ఆట కట్టించడం పెద్ద లెక్క కాదు. స్మగ్లింగ్ స్వచ్చందంగా ఆపకపోతే.. ఎలాంటి చర్యలకైనా వెనుకాడం. అటవీ చట్టం ప్రకారం.. ఎర్ర చందనం స్మగ్లర్ల ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకుం టుంది. ఒకసారి ఆపరేషన్ మొదలు పెడితే.. వెనుదిరిగే ప్రసక్తే ఉండదు. పర్యావరణాన్ని విధ్వంసం చేస్తే చూస్తూ ఊరుకోం. ఎర్రచందనం సరికివేతలో పాల్గొనే తమిళ నాడు కూలీలకు కూడా అవగాహనకల్పిస్తాం. వేంకటేశ్వర స్వామి భక్తులుకూడా ఎర్రచందనాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించాలి” అని పవన్ పిలుపునిచ్చారు.
మామండూరు అటవీ ప్రాంతాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్.. అక్కడ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతోపాటు శేషాచలంలో మాత్రమే కనిపించే అరుదైన మొక్కలు పరిశీలించి అటవీ అధికారులనుంచి వివరాలు తెలుసుకున్నారు. నేపియర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్ద ఉన్న వాచ్ టవర్ నుంచి మొత్తం అటవీ ప్రాంతాన్ని వీక్షించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్. టాస్క్ ఫోర్స్, అటవీ సిబ్బంది కూంబింగ్ తదితర వివరాలను డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారు. మంగళంలోని ఎర్రచందనం గోదామును పరిశీలించిన అనంతరం తిరుపతి జిల్లా కలెక్టరేట్లో అటవీ అధికారులతో సమీక్ష నిర్వహించారు.















