చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Home ఆంధ్రప్రదేశ్

హామీల అమలు, అప్పులపై శ్వేతపత్రం విడుదల చేశాకే ఓట్లు అడగాలి

జగన్‌ రెడ్డికి టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల సవాల్‌

చైతన్యరధం by చైతన్యరధం
January 7, 2024
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు
హామీల అమలు, అప్పులపై శ్వేతపత్రం విడుదల చేశాకే ఓట్లు అడగాలి
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ‘85 శాతం హామీల అమల్లో జగన్‌ రెడ్డి ఫెయిల్‌’..!
  • టీడీపీ వేసిన పుస్తకంలోని అంశాలపై వాస్తవాలు వెల్లడించే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా?
  • నవరత్నాలు,మేనిఫెస్టో,పాదయాత్ర హామీల్లో జగన్‌ రెడ్డి అమలు చేసింది కేవలం 15శాతమే
  •  జగన్ రెడ్డి 5ఏళ్ల పాలన విధ్వంసకరం, నియంతృత్వం, అవినీతి, అబద్దాలమయం.
  • 99 శాతం హామీలు అమలు చేశామంటూ ప్రజల్ని  మోసగించడం కాదు.. టీడీపీ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి
  • మద్య నిషేధం, సీపీఎస్‌ రద్దు, ప్రత్యేకహోదా, 2.30లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, అంగన్‌ వాడీ, మున్సిపల్‌ కార్మికుల జీతాల పెంపు హామీలు ఏమయ్యాయి?
  • పోలవరం, అమరావతి నిర్మాణాల మాటేమిటి? ఏటా ప్రతి రైతుకి ఇస్తామన్న రూ.12,500ల సంగతేమిటి?
  • చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప రాష్ట్రానికి, ప్రజలకు భవిష్యత్‌ లేదు.

అమరావతి: వైసీపీ ప్రభుత్వ పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులే ప్రజలకు వాస్తవాలు చెప్పే పరిస్థితి వచ్చిందని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌ విమర్శించారు. తమదాకా వస్తే గానీ వాస్తవం అర్థం కాదన్నట్టుగా వైసీపీ ఎమ్మెల్యేలంతా ముక్తకంఠంతో ఇచ్చిన హామీలు అమలుచేయనందున, ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదని బహిరంగంగానే చెబుతున్నారని, దీనికంతటికీ కారణం జగన్మోహన్‌ రెడ్డి అన్ని విధాలా ప్రజల్ని మోసగించి, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించటమేనని కనకమేడల స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ విడిపోయినప్పుడు జరిగిన నష్టం కంటే, జగన్మోహన్‌ రెడ్డి పాలనలో జరిగిన నష్టమే ఎక్కువ అన్నారు. రాష్ట్రం తిరిగి కోలుకోవడానికి కనీసం 15 ఏళ్లు పడుతుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప రాష్ట్రానికి, ప్రజలకు భవిష్యత్‌ లేదు. 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వాన్ని గెలిపించి, చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేస్తేనే రాష్ట్రానికి విముక్తి..ప్రజలకు సంతోషం అన్నారు. పోలీస్‌ వ్యవస్థతో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసి, రాష్ట్రాన్ని జగన్‌ భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. హామీల అమలు, అప్పులపై శ్వేతపత్రం విడుదల చేశాకే జగన్‌ తిరిగి ప్రజలను ఓట్లు అడగాలని డిమాండ్‌ చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2014, 2019 ఎన్నికలకు ముందుగానీ, అధికారంలో ఉన్న ఇన్నేళ్లలో గానీ జగన్‌ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలెన్ని అమలుచేసినవెన్నో గమనిస్తే కేవలం 15శాతం హామీలు మాత్రమే అమలుచేశారని చెప్పారు. 85శాతం హామీలు పూర్తిగా బుట్టదాఖలు చేశారు. ప్రజలకు కల్లబొల్లి మాటలు చెబుతూ కాలక్షేపం చేసుకొస్తున్నారు. ఇది పూర్తిగా వాస్తవం. జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి రావడానికి ముందు నవరత్నాలనే హామీలిచ్చాడు. వాటిలో 99 శాతం అమలు చేశానని కూడా చెప్పుకుంటున్నాడు. 99శాతం హామీలు అమలుచేశామని చెప్పుకుంటున్న జగన్‌ రెడ్డి, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా అని కనకమేడల నిలదీశారు.

మద్య నిషేధం చేశాకే మరలా ఓట్లు అడుగుతామన్నవారు.. వాస్తవంలో చేస్తున్నది ఏమిటి?
మద్యనిషేధం చేశాకే మరలా ఓట్లు అడుగుతానని జగన్‌ రెడ్డి చెప్పింది నిజం కాదా? ఇప్పుడు తన పార్టీవారికి చెందిన కంపెనీల ద్వారానే కల్తీమద్యం తయారు చేయిస్తూ, దాన్ని అధికధరకు అమ్ముతూ, కల్తీమద్యం తాగిస్తూ పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నది నిజం కాదా? మద్యం అమ్మకాల్లో కేవలం నగదు చెల్లింపులు మాత్రమే స్వీకరిస్తూ అంతు లేని అవినీతి చేస్తున్నారు. అమ్మేదే కల్తీ మద్యం..అదికూడా ఎక్కువ ధరకు. దానిలో మరలా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టడం. మద్యం అమ్మకాలపై భవిష్యత్‌ లో వచ్చే ఆదాయాన్ని 25ఏళ్లపాటు తాకట్టు పెట్టి రూ.8వేల కోట్లకు పైగా అప్పులు తేవడం. ఇవన్నీ ఏమిటి? మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన హామీలో జగన్మోహన్‌ రెడ్డి విఫలమైనట్టా..కాదా? దీనిపై వైసీపీ నేతలు, మంత్రులు ఏం సమాధానం చెబుతారు? ఇష్టమొచ్చినట్టు మాట్లాడకుండా నేరుగా అడిగిన వాటికి సమాధానం చెప్పాలని కనకమేడల డిమాండ్‌ చేశారు.

ప్రత్యేకహోదా సాధించి యువతకు ఉపాధి కల్పిస్తామన్న హామీ సంగతేమిటి?
25 మంది ఎంపీలను గెలిపిస్తే, రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించి పరిశ్రమలు వచ్చేలా చేసి, యువతకు లక్షలాది ఉద్యోగాలు ఇస్తానని జగన్మోహన్‌ రెడ్డి చెప్పింది వాస్తవం కాదా? 2019కు ముందు తన పార్టీ ఎంపీలతో రాజీనామాల డ్రామాలాడిన జగన్‌ రెడ్డి.. తరువాత వైసీపీ ఎంపీలతో ఇన్నేళ్లలో ఎప్పుడైనా ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని డిమాండ్‌ చేయించాడా? హోదా కోసం ఎప్పుడైనా పార్లమెంట్లో వైసీపీ ఎంపీలు పోరాడారా? అధికారంలోకి రాకముందు ఒకటిచెప్పి, తరువాత మాట మార్చారు. మెడలు వంచి ప్రత్యేకహోదా తెస్తామన్న వారు.. చివరకు కేంద్రం ముందు మెడలు వంచింది నిజం కాదా అని కనకమేడల అడిగారు.

అమరావతి నిర్మాణంపై ఎందుకు నాలుక మడతేశారు?
అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నాయకుడి హోదాలో అమరావతి నిర్మాణానికి సమ్మతించిన జగన్మోహన్‌ రెడ్డి, అధికారంలోకి వచ్చాక ఎందుకు మాట మార్చాడు? చివరకు రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా.. అనాథ రాష్ట్రంగా మార్చారు. అమరావతి ప్రాంతాన్ని అడవిలా మార్చారు. రాజధానిలోని రూ.10వేల కోట్ల విలువైన నిర్మాణ సామగ్రిని వృథాచేశారు. మూడు రాజధానుల ఆలోచన తెరపైకి తెచ్చి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. అమరావతి నిర్మాణం విషయంలో ఎందుకిలా చేశారో, ఇంతకుముందు ఇలా చెప్పామని, అధికారంలోకి వచ్చాక ఇలా చేశామని, రేపు మరలా అధికారంలోకి వస్తే ఇలా చేస్తామని 2024 ఎన్నికల ప్రచారంలో చెప్పగల ధైర్యం జగన్మోహన్‌ రెడ్డికి ఉందా అని కనకమేడల ప్రశ్నించారు.

సాగునీటి రంగానికి సంబంధించిన హామీలన్నీ గాలికొదిలేశారు… సాగునీటి రంగం.. ప్రాజెక్టుల నిర్మాణంపై ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా జగన్మో హన్‌ రెడ్డి నెరవేర్చలేదు. పోలవరం నిర్మాణంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని తప్పుడు ఆరోపణలు చేసి, దానిని తామే పూర్తి చేస్తామన్న జగన్‌ ఇప్పటివరకు ఏమీ చేయలేదు. జలయజ్ఞం కింద రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీళ్లిస్తామన్నారు? ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చారో చెప్పగలరా? పోలవరం నిర్మాణం ఎందుకు ముందుకు తీసుకెళ్లలేకపోయారో చెప్పగలరా? వెలిగొండ ప్రాజెక్ట్‌ ను యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తామన్నారు. రాష్ట్రంలోని సాగునీటి చెరువులన్నింటినీ నీళ్లతో నింపుతామన్నారు. ఇవన్నీ ఏమయ్యాయని కనకమేడల నిలదీశారు.

ఉద్యోగాల భర్తీ, విద్యుత్‌ ఛార్జీల పెంపు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఏం సమాధానం చెబుతారు?
2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఏమైంది? నిత్యావసరాల ధరలు, విద్యుత్‌ ఛార్జీలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు చంద్రబాబు బాగా పెంచాడని దుష్ప్రచారం చేసి.. మేము వస్తే తగ్గిస్తామని జగన్‌ ఇచ్చిన హామీ ఏమైంది. జగన్మోహన్‌ రెడ్డి హయాంలో 5 సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచాడు. ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు. నిత్యావసరాల ధరలు ఊహించని విధంగా పెరిగాయి. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెట్రోల్‌, డీజిల్‌ అధికరధరకు అమ్మిస్తున్నారు. కేంద్రప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ పై ఎక్సైజ్‌ సుంకం తగ్గించినా, రాష్ట్రప్రభుత్వ వాటాగా తగ్గించాల్సిన సొమ్ము ఎందుకు తగ్గించలేదు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో లీటర్‌ కు రూ.10 నుంచి రూ.15వరకు తేడా ఉండటం నిజం కాదా? పెట్రోల్‌..డీజిల్‌ అమ్మకాలతో ఎన్నివేల కోట్లు కొల్లగొట్టారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదే. చమురు ధరల పెంపుతో నిత్యావసరాల ధరలు ఇంకా పెరుగుతున్నాయి. ప్రజల జీవనప్రమాణాలు బాగా దెబ్బతిన్నాయి. ఇవేవీ ప్రజలకు ఎందుకు చెప్పరని కనకమేడు మండిపడ్డారు

ప్రతిరైతుకి ఏటా రూ.12,500లు ఇస్తామన్న హామీ ఏమైంది?
రైతు భరోసా కింద ఏటా ప్రతి రైతుకి నేరుగా రూ.12,500 ఇస్తామన్నారు. అదే మొత్తం సాయాన్ని కౌలురైతులకు కూడా ఇస్తామన్నారు. ఎందుకు ఇవ్వలేదు? ఆఖరికి రైతులకు పంటనష్టం పరిహారం కూడా ఇవ్వలేని దుస్థితికి వచ్చింది నిజం కాదా? రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలిపారని కనకమేడల విమర్శించారు.

సీపీఎస్‌ రద్దు సంగతేమిటి? ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో ప్రధానమైంది సీపీఎస్‌ రద్దు చేస్తామని చెప్పడం. అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల్ని బెదిరించి వాళ్ల నోళ్లు మూయించారు. సీపీఎస్‌ రద్దు కాదుకదా …చివరకు 1వ తేదీన జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చారు. పోలీసులకు వీక్లీ ఆఫ్‌ ఇస్తామన్నారు. అదీ లేదు. అంగన్‌ వాడీ సిబ్బంది, మున్సిపల్‌ కార్మికుల జీతాలు పెంచుతామన్నారు. అదీ లేదు. అంగన్‌ వాడీ సిబ్బంది 26 రోజులుగా సమ్మె చేస్తుంటే, వారికి న్యాయం చేయలేక చివరకు ఎస్మా చట్టం ప్రయోగించారు. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ చెల్లింపుల్లో కోతలు పెట్టారు. జీవోనెం-77 తెచ్చి చదువుకునే యువతకు అన్యాయం చేశారు. ఆరోగ్యశ్రీ పరిధి పెంచి అందరికీ వర్తింపచేస్తామన్నారు. కానీ చివరకు మార్పులు చేసి, పాక్షికంగా నే అమలుచేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయని కనకమేడల అన్నారు.

హామీల అమల్లో మడమతిప్పిన జగన్మోహన్‌ రెడ్డి…
నవరత్నాలు, మేనిఫెస్టోలో జగన్మోహన్‌ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు మొత్తం 199. అమలు చేసినవి 17 మాత్రమే. అసలు అమలు కాని హామీలు 109. ఇవి కాకుండా పాదయాత్ర సమయంలో జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలు 51, వాటిలో అమలుచేయనివి 44. అంటే 86శాతం హామీలు అమలే చేయలేదు. అలానే పాదయాత్రలో జిల్లాల్లో, నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ స్థానికంగా ఇచ్చిన హామీలు 480. వాటిలో అమలుచేసినవి కేవలం 3. అమలు కానివి 477..అంటే 98శాతం అని కనకమేడల వివరించారు.

ఈ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయగలదా?
ఇవన్నీ కలిపితే జగన్మోహన్‌ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు 730 అయితే, వాటిలో అమలుచేసింది కేవలం 15శాతం మాత్రమే. 85శాతం హామీలకు మస్కా కొట్టి, ప్రజల్ని మోసగించారు. జగన్మోహన్‌ రెడ్డి హామీల అమల్లో చేసిన మోసాల్ని వాస్తవాలతో వివరిస్తూ తెలుగుదేశం పార్టీ ‘నవరత్నాలుGమేనిఫెస్టోGజగన్‌ రెడ్డి ఇచ్చిన హామీల అమల్లో 85 శాతం ఫెయిల్‌’ అనే పేరుతో పుస్తకం కూడా ముద్రించింది. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదు. టీడీపీ తరుపున ముద్రించిన పుస్తకంలోని అంశాలకు సమాధానంగా శ్వేతపత్రం విడుదల చేయగలరా అని ముఖ్యమంత్రిని కనకమేడల ప్రశ్నించారు.

చంద్రబాబుతో పోలిస్తే సంక్షేమరంగానికి జగన్‌ రెడ్డి పెట్టిన ఖర్చు తక్కువే
సంక్షేమ కార్యక్రమాల అమలుకు ముఖ్యమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏమిటో జగన్మోహన్‌ రెడ్డి చెప్పగలరా? ఈ రోజు వరకు రాష్ట్రంపై సుమారుగా ఉన్న అప్పు రూ.12లక్షల కోట్లు. రెవెన్యూ ఆదాయం గతంలోకంటే ఈ ప్రభుత్వంలో విపరీతంగా పెరిగింది. బడ్జెట్‌ లెక్కలు.. కాగ్‌ లెక్కల ప్రకారం ఆదాయం పెరిగినట్టు ఈ ప్రభుత్వమే చెప్పింది. పెరిగిన రెవెన్యూ ఆదాయానికి తగినట్టుగా సంక్షేమ కార్యక్రమాలకు నిధులు ఎందుకు కేటాయించలేదు? చంద్రబాబు హయాంలో మొత్తం బడ్జెట్లో సంక్షేమ రంగానికి 42.44 శాతం నిధులు కేటాయిస్తే, వైసీపీ ప్రభుత్వం బడ్జెట్‌ పెంచినా, సంక్షేమ రంగానికి కేటాయింపులు ఎందుకు పెంచలేదు? 40 నుంచి 42 శాతమే ఖర్చు చేయడమేంటి? సంక్షేమ రంగానికి 44 శాతం నిధులు కేటాయించిన చంద్రబాబు ప్రభుత్వం, మిగిలిన సొమ్మును మౌలిక వసతుల కల్పన, రాష్ట్రాభివృద్ధికి ఖర్చుపెట్టింది. కానీ ఈప్రభుత్వంలో మౌలిక వసతుల కల్పనే జగరడం లేదు. రోడ్లులేవు..డ్రైనేజ్‌ లు లేవు. ప్రజలకు మంచినీరు, రైతులకు సాగునీరు అందించలేదు. ఎక్కడా కొత్తగా నిర్మాణాలు చేసిందిలేదు . వీటన్నింటికీ తోడు అదనంగా కేంద్ర ప్రభుత్వమిస్తున్న నిధులు కూడా దారి మళ్లించి ఎక్కడికక్కడ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారు. నిజంగా అవినీతి జరగకపోతే ఆదాయం పెరిగి.. అప్పులు పెరిగినా రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకు జరగలేదో జగన్మోహన్‌ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని కనకమేడల డిమాండ్‌ చేశారు.

అప్పుల సొమ్ముతో పాటు, దోపిడీతో వేలకోట్లు కొట్టేశారు
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, అప్పుల వివరాలు దాచడంపై ఈ ప్రభుత్వానికి కాగ్‌ ఏటా మొట్టికాయలు వేస్తోంది. ట్రెజరీ అనుమతులు లేకుండా ఖర్చులు చేశారు. బడ్జెటేతర అప్పులు తెచ్చారు. కేవలం అప్పుల కోసమే కొన్ని కార్పొరేషన్లు సృష్టించారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిదాటి అప్పులు తేవడంపై కేంద్ర ఆర్థిక శాఖ తాఖీదులు కూడా ఇచ్చింది. అయినా కూడా ఎవరికీ ఎలాంటి సమాధానం చెప్పకుండా ఈ రోజుకి కూడా అప్పులనే నమ్ముకున్నారు. నిన్నగాక మొన్న కూడా రూ.3వేల కోట్లు అప్పు తెచ్చారు. ఈ సొమ్మంతా ఎటుపోతోంది? అప్పుల సొమ్ము కాకుండా ఇసుక, మద్యం అమ్మకాలతో, మైనింగ్‌ దోపిడీతో వేలకోట్లు దోచేస్తున్నారని కనకమేడల దుయ్యబట్టారు.

శ్వేతపత్రం విడుదల చేశాకే ఓట్లు అడగాలి
2014కు ముందు, 2019 ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలెన్ని.. అమలుచేసినవి ఎన్నో జగన్మోహన్‌ రెడ్డి చెప్పాలి. జగన్‌ అధికారంలోకి రాకముందు రాష్ట్రంపై ఉన్న అప్పులెన్ని.. 2019 నుంచి ఇప్పటివరకు చేసిన అప్పు ఎంత? వీటన్నింటిపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం జగన్మోహన్‌ రెడ్డికి ఉందా? శ్వేతపత్రం విడుదల చేశాకే మరలా ప్రజల్ని ఓట్లు అడగాలి. ప్రజలకు ఇప్పటికైనా వాస్తవాలు చెప్పకపోతే, ఈ ప్రభుత్వానికి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని కనకమేడల స్పష్టం చేశారు.

Tags: 85 శాతంజగన్‌ రెడ్డి ఫెయిల్‌’హామీలు
Previous Post

అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగమా..జగన్‌ రెడ్డి నియంతృత్వానికి నిదర్శనం: అచ్చెన్నాయుడు

Next Post

నయవంచనకు ప్రతిరూపం జగన్‌రెడ్డి: శ్రావణ్‌కుమార్‌

Next Post
నయవంచనకు ప్రతిరూపం జగన్‌రెడ్డి: శ్రావణ్‌కుమార్‌

నయవంచనకు ప్రతిరూపం జగన్‌రెడ్డి: శ్రావణ్‌కుమార్‌

[mc4wp_form id="35898"]
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6

© 2026 Telugu Desam Party.