- కేంద్రాన్ని ఒప్పించి నిధులు తెచ్చారు
- రాష్ట్రం నుంచీ ఆర్థిక సాయం చేశారు
- బాధ్యతగా ఉండాలని చెప్పటంలో తప్పేముంది
- సీఎం వ్యాఖ్యలను వక్రీకరించి దుష్ప్రచారం తగదు
- టీడీపీ రాష్ట్ర ఆధ్యక్షులు పల్లా శ్రీనివాస్
అమరావతి (చైతన్యరథం): సీఎం చంద్రబాబునాయుడు స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించేటట్లుగా ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేయటం తగదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు హితవు పలికారు. నష్టాల్లో స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవం కోసం కేంద్రం నుండి రాష్ట్రం సుమారు రూ. 14 వేల కోట్లు తీసుకొచ్చిన కూటమి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకుంది. దానిపట్ల బాధ్యతగా ఉండాల్సింది మాని లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు. బాధ్యతగా తీసుకొచ్చిన డబ్బులను సద్వినియోగం చేసుకోవాలన్న విషయాన్ని పక్కన పెట్టి కార్మికులను, ప్లాంట్ను ఏదో అన్నారని మాట్లాడడం మంచిది కాదు. కష్టపడి కేంద్రాన్ని ఒప్పించి రూ.14 వేల కోట్లు మంజూరు చేయించి, రూ.11 వేల కోట్లు తీసుకువచ్చాం. రాష్ట్రం నుంచి కూడా సుమారు రూ.2,600 కోట్లు ఆర్థిక సాయం అందించాం. 30 శాతం సామర్థ్యంతో నడుస్తున్న ప్లాంట్ని 80 శాతానికి చేరుకునేలా చేశాం. పబ్లిక్ సెకార్ లో ఉన్న ఏ పాంట్ అయినా లాభాలో -నడవాలంటే మేనేజ్మెంట్, కార్మికులు బాధ్యతగా -వ్యవహరించాలి.
వైసీపీ నాయకులతో కలిసి కొందరు సీఎం వ్యాఖ్యల్ని వక్రీకరించి మాట్లాడుతూ లేనిపోని “అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు కృషితోనే ఈ ప్లాంట్ లాభాలబాటలో “నడుస్తోందనే విషయాన్ని కార్మికులు, ప్రజానీకం, స్టీల్ ప్లాంట్ లోని వారందరు అర్థం చేసుకోవాలి. 2000వ సంవత్సరంలో కూడా వాజ్పేయి నేతృత్వంలోని “అప్పటి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1350 కోట్లు తీసుకొచ్చి ప్లాంట్ను చంద్రబాబు నిలబెట్టారు. ఇప్పుడు రూ. 14 వేల కోట్లు తెచ్చి స్టీల్ ప్లాంట్ను “నడిపిస్తున్నారు. ఇన్ని చేసిన చంద్రబాబునాయుడు గురించి చెడుగా మాట్లాడడం మంచిదికాదు. నేడు స్టీల్ ప్లాంట్ నడుస్తోందంటే ఎన్డీయే కూటమి వల్లనే *అనే విషయం అందరూ తెలుసుకోవాలి.
అధికారులపై బురద జల్లడం మంచిపద్ధతి కాదు. కార్మికులు, యాజమాన్యం, ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్షానికి కూడా ఆ బాధ్యత -ఉండాలి. లేనిపోని అపోహలు సృష్టించడం మంచిదికాదు. స్టీల్ ప్లాంట్ను పరిరక్షించే బాధ్యత ఎన్డీయే ప్రభుత్వంపై ఉంది. అందులో భాగంగానే కేంద్రాన్ని ఒప్పించి రూ. 11,400 కోట్లు తీసుకుచ్చాం. రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది కాబట్టే ప్రభుత్వం నుంచి నీరు, విద్యుత్, పన్నులు ఇతరత్రా రూపంలో సుమారు 2,600 కోట్ల మేర ఉపశమనం కల్పించింది. దేశంలో ఏ పబ్లిక్ సెక్టార్ సంస్థకు కూడా రాష్ట్రం నిధులు ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు.
ఏపీలో కార్మికులను, నిర్వాసితులను దృష్టిలో ఉంచుకుని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని దృష్టిలో పెట్టుకొని ప్లాంట్ కోసం అహర్నిశలు కష్టపడి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చాం. ప్రజా ధనాన్ని వెచ్చిస్తున్నాం కాబట్టి అందరూ బాధ్యతగా ఉండాలంటే.. వక్రీకరించడం సబబు కాదు. కార్మికులను భయాందోళనకు గురిచేయొద్దు. ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు. ఈ ప్రయత్నాలు మానుకోవాలి. ఎంత వక్రీకరించి మాట్లాడినా విజ్ఞులైన ప్రజలు అర్థం చేసుకోగలరు. ఎన్డీయే కూటమిపై ప్రజలకు అపార నమ్మకం ఉంది. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, కార్మికులే కాకుండా ప్రతిపక్షం కూడా బాధ్యతగా ఉండాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సమష్టిగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అందరిపైనా ఉందని పల్లా స్పష్టం చేశారు.













