• సూళ్లూరుపేట నియోజకవర్గం వేముగుంటపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామం స్వర్ణముఖి నదిని ఆనుకొని ఉండటంతో వర్షాకాలంలో వరదనీరు గ్రామంలోకి వస్తోంది.
• ముంపునివారణకు స్వర్ణముఖి నది పొర్లుకట్టకు మరమ్మతులు చేపట్టాలి.
• శ్మశానానికి వెళ్లే రహదారి అస్త్యవ్యస్తంగా ఉంది, మరమ్మతులు నిర్వహించాలి.
• కరెంటులేని సమయంలో తాగునీటికోసం ఇబ్బందులు పడుతున్నాం, బోర్లు ఏర్పాటుచేయాలి.
• మా గ్రామంలో సమస్యల పరిష్కారానికి మీ వంతు సహకారం అందించండి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• జగన్ అండ్ కోకు దోచుకోవడం తప్ప ప్రాజెక్టుల నిర్వహణపై శ్రద్ధలేదు.
• వైసిపి ప్రభుత్వం కమీషన్ల కక్కుర్తితో స్వర్ణముఖి నది పొర్లుకట్ట నాసిరకంగా నిర్మించడంతో తరచూ మరమ్మతులకు గురవుతోంది.
• జగన్ ప్రభుత్వ నిర్వాకం కారణంగా అన్నమయ్య డ్యామ్, పులిచింతల, గుళ్లకమ్మ గేట్లు కొట్టుకుపోయాయి.
• టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పొర్లుకట్ట మరమ్మతులు చేపట్టి ముంపు బెడద నివారిస్తాం.
• గ్రామాల్లో వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికీ కుళాయి అందజేసి, 24/7 తాగునీరు అందజేస్తాం.
• గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించి గత వైభవం తెస్తాం.