• వినుకొండ నియోజకవర్గం వనికుంట గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామంలో 500కుటుంబాలు నివసిస్తున్నాయి.
• గ్రామస్తులంతా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాం.
• పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాం.
• పిల్లలను చదివించుకోవడం కూడా కష్టంగా మారింది.
• మా గ్రామంలో మంచినీటి సమస్య అత్యధికంగా ఉంది.
• ఫ్లోరైడ్ నీటి వల్ల అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాం.
• గత నాలుగేళ్లుగా మా గ్రామం అభివృద్ధికి నోచుకోలేదు.
• మీరు అధికారంలోకి వచ్చాక మా గ్రామ సమస్యలను పరిష్కరించాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• వ్యవసాయంపై అవగాహన లేని ముఖ్యమంత్రి రాష్ట్రరైతాంగాన్ని అప్పుల్లో ముందువరసలో నిలిపారు.
• గతంలో రూ.75వేల ఉన్న ఎపి రైతుల సగటు అప్పు, ఇప్పుడు 2.5లక్షలకు చేరింది.
• రైతులకు గిట్టుబాటు ధర అందించేందుకు రూ.3,500 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేస్తానన్న జగన్ ఎన్నికల తర్వాత ముఖం చాటేశారు.
• టిడిపి అధికారంలోకి రాగానే పెట్టుబడులు తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం.
• వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతిఇంటికీ కుళాయి అందించి స్వచ్చమైన తాగునీరు అందిస్తాం.