- వైద్య విద్య బోధనలో ప్రమాణాలను పెంచాలి
- సమర్థులైన వైద్యులను సమాజానికి అందించాలి
- జాతీయస్థాయి ర్యాంకింగ్స్ సాధించేలా దృష్టిపెట్టాలి
- వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్
- నాణ్యత లేని సేవలను ఉపేక్షించేది లేదని వెల్లడి
- ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లతో సమీక్ష
అమరావతి(చైతన్యరథం): ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారు లను ఆదేశించారు. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్య విద్య బోధనలో ప్రమాణాలు పెంచడం ద్వారా సమర్థులైన డాక్టర్లను సమాజానికి అందించిన వారవుతారని, ప్రమాణాల విష యంలో ఏమాత్రం రాజీపడొద్దని స్పష్టం చేశారు. ప్రమాణాలను పాటించడం ద్వారా ఇక్కడ చదివిన వైద్య విద్యార్థులు ఏపీ బ్రాండ్ ఇమేజ్ను పెంచినవారవుతారని పేర్కొన్నా రు. వైద్య విద్యార్థుల హాజరుశాతంపై ప్రిన్సిపాళ్లు ప్రత్యేక దృష్టిని సారించాలని సూచిం చారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లతో బుధవారం వెలగపూడి ఏపీ సచివాలయం నుంచి మంత్రి వర్చువల్‌గా సమీక్షించారు. వైద్య కళాశాలల్లో బోధకుల హాజరు శాతం కూడా పక్కాగా ఉంటేనే సమర్థులైన వైద్యులను సమాజానికి అందించగలుగుతారని చెప్పారు. మిగతా విద్యార్థులతో వైద్య విద్యార్థులను పోల్చలేమని, మెరుగైన ఆరోగ్య సంరక్షణలో వీరు కీలకపాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు.
మన రాష్ట్రంలో వైద్య విద్యా ప్రమాణాలు ఏ మేరకు ఉన్నాయో అంచనా వేసుకోవడం ద్వారా మనం ఏ స్థాయిలో ఉన్నామనే విషయం అవగతమవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఇచ్చే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ (నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్) సాధించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేయాలని, ర్యాంకింగ్ పొందడం వల్ల వైద్య కళాశాలల ప్రతిష్ట మరింత పెరుగుతుందని తెలిపారు. ర్యాంకింగ్స్‌పై వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు దృష్టిపెట్టకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ఏ బీహెచ్ అక్రిడిటేషన్ పొందేందుకు కూడా కృషి చేయాలని సూచించారు. అంతర్జాతీయ జర్నల్స్‌కు పరిశోధన సంబంధింత వ్యాసాలను పంపించాలని, పరిశోధనా విభాగాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో రాష్ట్రంలో 40 మెడికల్ కాలేజీలు ఉండగా, దాదాపు 6500 మంది వైద్య విద్యార్థులున్నా రని చెప్పారు. బీ క్లినికల్, నాన్ క్లినికల్ విభాగాల్లో దాదాపు 3000 మంది పీజీ విద్యా ర్థులు ఉన్నారని తెలిపారు.
వైద్య కళాశాలల పనితీరుపై ఆరా
వైద్య విద్య కళాశాల పనితీరుపై ఆరా తీసిన మంత్రి వైద్య విద్య బోధన, ప్రజలకు అందుతున్న వైద్యసేవలపై ప్రిన్సిపాళ్లను మొత్తం 17 ప్రశ్నలు అడిగారు. వైద్య విద్యలో నాణ్యత పెంచేందుకు తక్షణం ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాల్సిన ఐదు పనుల గురించి చెప్పాలని కోరారు. వైద్యులు ప్రజల జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతారని చెప్పిన మంత్రి నాణ్యత లేని వైద్యులను, వైద్యసేవలను ఉపేక్షించేదిలేదని స్పష్టం చేశారు. మన రాష్ట్రంలో వైద్య విద్య నాణ్యతపై ఎప్పుడైనా మదింపు జరిగిందా అని అడిగిన ఆయన ఆ మదింపులో కనుగొన్న విషయాలు ఏమిటని ప్రశ్నించారు. నాణ్యత మెరుగుదల కోసం ఇటీవల తీసుకున్న చర్యలపైనా ఆరా తీశారు. ఒకవేళ మన రాష్ట్రంలో వైద్య విద్యకు 1 నుంచి 10 వరకు రేటింగ్ ఇవ్వాల్సి వస్తే ఏ నెంబర్ ఇవ్వొచ్చని ప్రశ్నించారు. దక్షిణ భారతదేశంలో, దేశవ్యాప్తంగా మనం వైద్య విద్యకు ఎలాంటి రేటింగ్ ఇవ్వొచ్చని అడిగా రు.
ఆల్ ఇండియా ర్యాంకులలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్ర మెడికల్ కాలేజీల గురించి అడిగి తెలుసుకున్నారు. అధ్యాపకుల నైపుణ్యాలు, కళాశాలల్లోని బోధన సామగ్రిని అప్‌గ్రేడ్ చేయడానికి ఏయే చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు. వైద్య వృత్తిని భారీగా డబ్బు సంపాదించే సాధనంగా చూసే బదులు నైతికత, సేవా భావాన్ని ప్రోత్సహించేలా సిలబస్ సమగ్రంగా ఉండేలా చూడాలని సూచించారు. యూనివర్శిటీ పరీక్షల గురించి అడిగారు. ఈ సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, డీఎంఈ నరసింహం పాల్గొన్నారు