విజయవాడ (చైతన్య రథం): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ‘యోగాంద్రా’ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ యోగా గురువు బాబా రామ్వ్, రాష్ట్ర విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమం అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బ్రాహ్మకుమారిస్ ఆధ్వర్యంలో వ్యసనముక్త భారత అభియాన్ ప్రచార వాహనం ఝండా ఊపి. ప్రారంభించారు. అనంతరం ‘ఈగిల్-1972’ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈగల్ ఆంధ్రప్రదేశ్ విభాగం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు, ప్రజా భద్రత, అవగాహన కార్యక్రమాల గురించి ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ ముఖ్యమంత్రికి వివరించారు.
ఈగల్ సంస్థ చేపడుతున్న ప్రజోపయోగ కార్యక్రమాలు, సేవలను తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ఐజీపీ ఆకే రవికృష్ణను ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా సేవా కార్యక్రమాలను విస్తరించాలని సూచిస్తూ ఈగల్ బృందాన్ని ప్రోత్సహించారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర బాబు, పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఈగల్ ఎస్పీ స్వరూపా రాణి, హెడ్క్వార్టర్స్ డీఎస్పీ సింగయ్య, విజయవాడ ఈగల్ ఇన్స్పెక్టర్ రవీంద్ర సహా ఈగల్ టీమ్ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.















