- చివరిరోజు జన సంద్రంగా ఫ్లెమింగో ఫెస్టివల్స్
- వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున సందర్శకులు
- పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షుల కేంద్రంలో రద్దీ
- పర్యావరణ సమతుల్యాన్ని కాపాడదాం: కలెక్టర్
- ఫెస్టివల్ నిర్వహణ అభినందనీయమన్న పర్యాటకులు
- భోజన ఏర్పాట్లు, ఇతర వసతులపై సంతోషం
- మంచి నిర్ణయమని సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు
తడ/సూళ్లూరుపేట(చైతన్యరథం): ఫ్లెమింగో ఫెస్టివల్స్ సందర్భంగా చివరిరోజైన మూడో రోజు సోమవారం కూడా నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం జనసంద్రంగా మా రింది, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున పర్యాటకులు తరలివచ్చారు. తడ మండలం పరిధిలోని నేలపట్టు పక్షుల అభయారణ్యాన్ని కలెక్టర్ వెంకటేశ్వర్ సందర్శించి విద్యార్థులు, పర్యాటకులతో మాట్లాడి ఏర్పాట్లు, వారి అనుభూతిని అడిగి తెలుసుకున్నారు. పులికాట్ సరస్సులో పెలికాన్ పక్షులు చేపలను ఆహారంగా తీసుకు ని వాటి సంతతిని పెంపొందించుకుని తిరిగి వాటి సొంత ప్రాంతానికి వెళతాయని తెలిపారు. పులికాట్ పర్యావరణం ఒక విలక్షణమైన ఎకోలాజికల్ సిస్టమ్ కలిగి ఉం టుందని వివరించారు. ఈ సరస్సు, నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం పర్యావరణ సమతు ల్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని సూచించారు. నేలపట్టు పక్షుల అభయారణ్యాన్ని అందరూ సందర్శించి ప్రకృతిని ఆస్వాదించాలని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని ఈ పరిసర ప్రాంతాల్లో వినియోగించరాదని కోరారు. పర్యాటకుల సందర్శ నార్థం వారికి గైడ్లను ఏర్పాటు చేయడంతో పాటు తగినంత భద్రతా ఏర్పాట్లు, మౌలిక వసతులు కల్పించడం జరిగిందని వివరించారు. చివరిరోజు ఇంత పెద్దఎత్తున అశేష జనసందోహం వచ్చి ప్రకృతిని ఆస్వాదించడం ఈ ఫెమింగో ఫెస్టివల్‌కు ఉన్న స్పందన ఎటువంటిదో తెలుస్తుందని అన్నారు. అనంతరం బైనాక్యులర్‌తో పక్షులను వీక్షించారు. అంతకుముందు సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రాన్ని సందర్శించి పర్యాటకులతో ముచ్చటించారు. సందర్శకులు అక్కడ ఏర్పా టు చేసిన ఆటలు, ఛాయాచిత్ర ప్రదర్శన, పర్యావరణ విజ్ఞాన కేంద్రంలో ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. పక్షులను వీక్షించుటకు బారులు తీరారు. నేలపట్టు ప్రాంతంలో ఉన్న విదేశాల నుంచి వచ్చే రకరకాల పక్షులను చూసేందుకు తిరుపతి, నెల్లూరు జిల్లాల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి వచ్చారు.
పక్క రాష్ట్రాల నుంచి పర్యాటకులు
అలాగే పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, ఇతర ప్రాంతాల నుంచి కూడా పక్షుల పండుగను వీక్షించేందుకు కుటుంబసమేతంగా వచ్చామని పలువురు తమ అను భూతిని వ్యక్తం చేశారు. ఇక్కడ అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయని పేర్కొంటూ గైడ్‌ల ఏర్పాటుతో మంచి విజ్ఞానాన్ని అందిస్తున్నారని, విద్యార్థులకు భోజన వసతి కూడా కల్పించారని ఏర్పాట్లపై సంతోషం వ్యక్తం చేశారు. సందర్శకుల రాకతో నేలపట్టు ప్రాం తం పండగ వాతావరణంతో నిండిపోయింది. ఇలాంటి పక్షుల పండుగ వీక్షించే అవకా శాలు చాలా అరుదుగా ఉంటాయని, ఐదేళ్ల తర్వాత ఫెమింగో ఫెస్టివల్‌ను నిర్వహించేలా ఆదేశాలిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. వైద్యశిబిరాలు, తాగు నీరు, భోజన వసతి, టాయిలెట్స్ ఇలా అన్ని సౌకర్యాలు, ఏర్పాట్లను చక్కగా చేసేందుకు చర్యలు తీసుకున్న పర్యాటక మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఇటువంటి మంచి నిర్ణయాల వల్ల పర్యాట క ప్రాంతాలకు మరింత గుర్తింపు వస్తుందని తెలిపారు.
మరపురాని అనుభూతి
గూడూరులోని ఓ స్కూల్‌కు చెందిన ప్రదీప్త, రుచిత అనే విద్యార్థులు మాట్లాడుతూ నాలుగేళ్లుగా ఇలాంటి కార్యక్రమాలు జరగటం చూడలేదని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వా త ఇలాంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం విద్యార్థులకు ఆహ్లాదకరంగా ఉంటుం దని ఆనందం వ్యక్తం చేశారు. పక్షులను తిలకించిన ఈ అనుభూతిని మాటలలో చెప్ప లేని మరుపురాని తీయని జ్ఞాపకంగా పేర్కొంటూ ఇలాగే ప్రతి సంవత్సరం వేడుకలు జరి గితే ఎంతోమంది విద్యార్థులు సందర్శించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. స్థాని క ప్రజలు మాట్లాడుతూ ఈ కొలనులో పెలికాన్ వంటి ఎన్నో రకాల విలక్షణ పక్షులు ఉంటాయని, వాటిని చూడటం చాలా ఆనందంగా ఉందన్నారు. సుమారు మూడు నాలు గు మాసాలు పక్షులు ఈ ప్రాంతంలో ఉండటం వల్ల కుంటలలో ఉన్న నీరు, పొలాల మీదుగా ఈ పక్షులు వెళ్లినప్పుడు వాటి విసర్జిత వ్యర్థాలు సారవంతమైన నత్రజని కలిగి ఉండడం వల్ల వాటిని దేవత పక్షులు అని అంటుంటారని తెలిపారు. గత ప్రభు త్వంలో ఇలాంటి సందర్భాలు రాలేదని చెబుతూ ఫ్లెమింగో ఫెస్టివల్‌ను నిర్వహించేలా ఆదేశాలి చ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు గూడూరు సబ్‌కలెక్టర్ రాఘవేంద్ర మీనా, మాజీ మంత్రి పరసారత్నం, సంబంధిత అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.