- బంధాల గురించి మాట్లాడితే మారీచుడు కథ గుర్తొస్తోంది
- సీఎం కుర్చీ కోసం తండ్రి శవం పక్కన రాజకీయాలు చేయలేదా?
- చంద్రబాబు కుటుంబం గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదు
- కక్షసాధింపులో భాగంగానే స్కిల్ కేసులో బాబును అరెస్టు చేశారు
- అందుకు కారకులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలి
- సూత్రధారులు జగన్, సజ్జల, కొల్లిపై విచారణ జరిపించాలి
- టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్
మంగళగిరి(చైతన్యరథం): జగన్ మాటలు రక్తమాంసాల రుచి మరిగిన మారీచుడికి మాంసం గురించి తెలియదన్నట్లుందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తెలిపారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాటాడారు. చంద్రబాబు ఏ తప్పు చేయరు.. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆయనను అరెస్టు చేయడం అక్రమం, అన్యాయం. జగన్ కక్షసాధింపులో భాగమే చంద్రబాబు అరెస్టు చేశారని మండిపడ్డారు. స్కిల్ డెవలప్‌మెం ట్ కేసులో ఫైనాన్స్ సెక్రటరీ పి.వి.రమేష్ సాక్ష్యం చెప్పారని పోలీసులు తప్పుదోవ పట్టించారు..తప్పుదోవ పట్టించిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. దుర్మార్గపు పోలీసు అధికారి కొల్లి రఘురామిరెడ్డి కల్పించిన దొంగ కేసే స్కిల్ డెవలప్ మెంట్ కేసు..అయితే ఈ కేసులో ఏమీ సాధించలేకపోయారన్నారు. చంద్రబాబు అరెస్టు కు తప్పుడు సమాచారం ఇచ్చిన పోలీసు అధికారులపై డీజీపీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు అక్రమ అరెస్టులో సూత్రధారులు ఏ1 జగన్, ఏ2 సజ్జల, యాక్టివ్ పార్ట్ తీసుకున్న వ్యక్తి కొల్లి రఘురామిరెడ్డిని క్షుణ్ణంగా విచారించాలని డిమాండ్ చేశారు.
నీ తండ్రి బెంగళూరు పంపింది వాస్తవం కాదా?
చంద్రబాబు రాజమండ్రి జైల్లో చెక్క కుర్చీలో కూర్చోవడాన్ని చూసిన మాకు గుండె తరుక్కుపోయింది..కడుపు మండిరది. అయినా దుర్మార్గుల పాలనలో ఏమీ చేయలేకపో యాం. చంద్రబాబు జైల్లో వేడి నీరు అడిగితే దాన్ని రాద్దాంతం చేశారు. కూటమి ప్రభుత్వం మా కుటుంబంపై కక్ష కట్టిందని తల్లి, చెల్లి దూరమైనా జగన్ నంగనాచి కబుర్లు చెబుతున్నాడు. డిజిటల్ కార్పొరేషన్ శాఖలో జగన్‌కు దాసోహమైన అధికారులు ఇంకా కొనసాగుతున్నారు. వారి గురించి కూడా పట్టించుకోవాలి. చంద్రబాబు ఏ విధం గా తల్లిదండ్రులను ప్రేమించారో నారావారిపల్లె వాసులనడిగితే తెలుస్తుంది. పరువు తీస్తాడని వైఎస్‌ఆర్ కొడుకుని బెంగుళూరు పంపితే..రోశయ్యతో విజయమ్మ మొరపెట్టు కుంది వాస్తవం కాదా? గొడ్డలితో హత్య చేయబడిన బాబాయ్ వివేకానందరెడ్డి కేసును.. ఎవరు చంపారో వెలికితీయండని ఏనాడైనా జగన్ పోలీసు అధికారులతో చెప్పారా? మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ చావుకు కారణమైన జగన్‌కు దళితుల ప్రేమ, అభిమానమంటే జనం నమ్మరు. ఈ జగన్ మాకు వద్దు అని 11 సీట్లిచ్చి మూలన కూర్చోబెట్టింది మా దళితులే. పరమత ఆచారాలు పాటించే జగన్ రెంటికీ చెడ్డ రేవడిలా మిగిలిపోయాడని వ్యాఖ్యానించారు.
తండ్రి శవం పక్కన సీఎం కుర్చీ కోసం పాకులాడలేదా?
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సాక్ష్యాలు, ఆధారాలు లేవంటే కావాలని కేసు పెట్టి అరెస్టు చేసినట్లే కదా? నేను చెప్పింది వేరు, పోలీసులు రాసుకున్నది వేరు అని ఫైనాన్స్ సెక్రటరీ పి.వి.రమేష్ సాక్ష్యం చెప్పడం జరిగింది. ఎవరయ్యా నీ కుటుంబం.. నువ్వు, నీ భార్య, ఇద్దరు పిల్లలేగా.. చెల్లి, తల్లి, బామ్మర్ది ఇప్పుడు ఎక్కడున్నారు? నీ దగ్గర ఉన్నారా? చంద్రబాబు కుటుంబం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. చంద్రబాబు తన తల్లిదం డ్రులకు దగ్గరుండి పిండప్రదానం చేశారు. నీవు తండ్రి చనిపోతే పట్టించుకోకుండా సీఎం కుర్చీ కోసం పాకులాడుతూ సంతకాలు చేయించుకుని సోనియాకు పంపావు. ఇలాంటి నీకు బంధుత్వాల గురించి మాట్లాడే అర్హత నీకెక్కడిది. వర్రా రవీంద్రారెడ్డి పెట్టిన పోస్టులు అతి నీచాతినీచంగా ఉన్నాయి. అలాంటి పోస్టులపై ఒక్క మాట కూడా మాట్లాడకుండా వాటిని సమర్థిస్తూ నీ తల్లి, చెల్లిని కించపరచిన నీచ మనస్తత్వం నీది. అదే నీ అనుజ్ఞ లేకుండా వర్రా రవీంద్రారెడ్డి అటువంటి అసభ్య పోస్టులు పెడితే అతను బతికి బట్టకట్టగలడా? అని ప్రశ్నించారు.
దళితులపై దాడి అంటూ దుర్మార్గపు మాటలు
టీడీపీ కార్యాలయంపై దాడితో పాటు అనేక అక్రమ కేసులు, దుర్మార్గాలకు పాల్పడి అరెస్టు అయిన నందిగం సురేష్‌పై జగన్ వల్లమాలిన ప్రేమ చూపిస్తున్నాడు. దళితులపై దాడి అంటూ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు చంపారు. అసలు దళితుల గురించి మాట్లాడే అర్హత మీకెక్కడిది? అని ప్రశ్నించారు. మా దళితులే కదా మీకు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పింది. అన్యమతస్థులైన మీకు హైందవ మతం గురించి ఏం తెలుసు? రెంటికి చెడ్డ రేవడిలా మీరు ఉన్నారు. చంద్రబాబు తల్లిదండ్రుల గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని హితవుపలికారు. బంధుత్వాలు, బంధాలంటేనే మీకు తెలియదు. అందుకే తల్లి, చెల్లి దూరమైంది. అలాంటి నీవు బం ధుత్వాల గురించి మాట్లాడితే రక్త మాంసాలు తినే మారీచుడు తనకు మాంసం గురించి తెలియదన్నట్లుగా ఉంటాయి జగన్ మాటలుంటాయని మండిపడ్డారు.