పేదవాడి సొంతింటి కలను నిజం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యం. అందుకే.. టీడీపీ ప్రభుత్వ హయాంలో .. TIDCO గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించి.. 90 శాతం పనులు పూర్తి చేసింది. టీడీపీ హయాంలో టిడ్కో ఇళ్లను పక్కాగా ప్లాన్ చేసి.. 40 నుంచి 60 అడుగుల అంతర్గత రోడ్లను ప్లాన్ చేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ .. టిడ్కో ఇళ్ల నిర్మాణం వద్ద రోడ్ల వెడల్పును 12 అడుగులకు కుదించారు.. అంతేకాకుండా.. మిగిలిన 10 శాతం టిడ్కో ఇళ్లను పూర్తి చేస్తే.. ఆ క్రెడిట్ చంద్రబాబుకే.. దక్కుతుందనే భయంతో .. రాష్ట్రంలో పనులు ఆపేశారు.
2019 నాటికి టీడీపీ హయాంలో 90 శాతం అంటే 81,040 ఇళ్లు, 75-90 శాతం మధ్య 71,488 ఇళ్లు, 25-75 శాతం మధ్య 38,416 ఇళ్లు, 25 శాతం దిగువన 1,22,888 ఇళ్ళను నిర్మించింది. మొత్తం 3,13,832 ఇళ్లను ప్రారంభించారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక.. 51,616 టిడ్కో ఇళ్లను రద్దు చేయగా.. ప్రస్తుతం ఆ ఇళ్ల సంఖ్య 2,62,216 కు చేరుకుంది. అయితే వాటిలో 3,488 ఇళ్లను మాత్రమే .. పంపిణీ చేశారు. మిగిలిన వాటిలో ఎన్ని పూర్తయ్యాయో.. పేదలకు ఎన్ని ఇస్తారో.. సర్కార్ లెక్కలు చూపడం లేదు. 2023-2024 బడ్జెట్‌లో ప్రధాని ఆవాస్ యోజన పథకం కింద.. కేంద్రం.. 5,300 కోట్ల రూపాయలు కేటాయించారు, అయితే 2024 నాటికి.. ఏపీలో మిగిలిన 2 లక్షల ఇళ్లను పూర్తి చేయడానికి 20,000 కోట్లకు పైగా అవసరం.
జగన్ వచ్చిన నాటి నుంచి.. నాలుగేళ్లుగా.. నిరుపేదలకు పూర్తిగా టిడ్కో ఇళ్ల పంపిణీ నిలిచి పోయింది. దీంతో ఆ లబ్ధిదారులు తాము పొందిన అప్పుకు వడ్డీలు చెల్లిస్తూనే అద్దె ఇళ్లలో నివసించాల్సి వస్తోంది. మరోవైపు.. దాదాపు 90% పనులు పూర్తయినా.. జగన్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఇంటి కోసం అనేక వేల మంది లబ్దిదారులు ఎదురుచూస్తున్నారు. 2022 డిసెంబర్ నాటికి కనీసం 1.5 లక్షల ఇళ్లను పంపిణీ చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కానీ.. ఆ ఆదేశాలు కూడా అమలుకు నోచుకోలేదు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం టిడ్కోగృహాలను పూర్తి చేయాలని.. జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలతో.. వినూత్నంగా.. జగన్ రెడ్డి సర్కార్.. టీడీపీ హయాంలో పేదలకు కట్టిన ఇళ్లను ప్రచార సాధనంగా మలచుకుంటోంది. 2019లో గుడివాడలో 9,812 టిడ్కో నివాసాలను టీడీపీ నిర్మించింది. కానీ ఇప్పుడు ఆ భవనాలకు.. వైసీపీ రంగులు వేసింది. ఏపీలో కొన్ని చోట్ల.. ఇడ్కో ఇళ్లను .. వైసీపీ కార్యాలయాలుగా మార్చారు. రాష్ట్రంలో పేద ప్రజలు.. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారని.. కానీ.. జగన్ సర్కార్ అవేమీ పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. టీడీపీ హయాంలో పూర్తైన టిడ్కీ ఇళ్లను ఇచ్చేందుకు.. వైసీపీకి మనసు రావడం లేదు .. కొత్తగా .. పేదలకు.. ఇళ్ల కట్టిస్తారని… జగన్ చెప్పడం హాస్యాస్పదమే అవుతుంది.