- ఆందోళన, అధైర్యం వద్దు
- టీడీపీ, జనసేన ప్రభుత్వం రాగానే మొత్తం టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్
- మళ్లీ అప్రెంటిస్ విధానం జగన్నాటకంలో భాగమే
- ఈ అన్యాయాన్ని సరిదిద్దుతాం
- బహిరంగ లేఖలో నిరుద్యోగులకు లోకేష్ హమీ
అమరావతి: టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారం లోకి రాగానే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి రాష్ట్రంలో ఖాళీ గా ఉన్న టీచర్ పోస్టులన్నీ భర్తీ చేస్తామని నిరుద్యో గులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. జగన్ మోసంతో నిండా మునిగిన నిరుద్యోగులు ఆందోళన చెందవద్దు, అధైర్యపడొద్దం టూ శుక్రవారం లోకేష్ బహిరంగలేఖ రాశారు. త్వర లో టీడీపీ-జనసేన ప్రభుత్వం వస్తుంది.. ఖాళీ టీచర్ పోస్టులు పారదర్శకంగా భర్తీచేస్తుందని హామీ ఇచ్చారు. 2019 ఎన్నికలకి ముందు అధికారంలోకి రాగానే 23 వేల టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ ప్రకటిస్తానని జగన్ హామీ ఇచ్చాడు. నమ్మి ఓట్లేసి గెలిపించిన నిరు ద్యోగులకు ఇచ్చిన హామీని ఐదేళ్లపాటు మరిచిపోయా డు. తీరా పదవి నుండి దిగిపోయే ముందు 6వేల ఉపా ధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ వేస్తున్నానంటూ జగన్ మరోసారి చేస్తున్న మోసాన్ని గుర్తించండి. 2013లో రద్దయిన అప్రెంటిస్ విధానాన్ని మళ్లీ తేవడం జగన్ నాటకంలో భాగమే. 2019 ఎన్నికల ముందు డీఎస్సీ హామీ ఇచ్చాడు, 2024 ఎన్నికలొస్తున్నప్పుడు ఆ హామీ ని అమలు చేస్తానంటున్న జగన్ మాయమాటలు నమ్మొ ద్దు నిరుద్యోగులారా అని లోకేష్ హితవు పలికారు.
మరోసారి నిరుద్యోగుల్ని వంచించే కుట్రే..
ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు డీఎస్సీ నోటిఫికేష న్ ఇస్తే, ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే కనీసం పరీక్ష నిర్వహణ కూడా సాధ్యం కాదు. ఇటువంటి పరిస్థితుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ అంటే మరోసారి నిరుద్యోగుల్ని వంచించే కుట్రే. ఎన్టీఆర్, చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వాలు ఇప్పటివరకూ 1,70,000 టీచర్ పోస్టులు పారదర్శకంగా భర్తీ చేసిన ఘనత దక్కించుకున్నాయి. ఇదే అనుభవంతో టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం. కొత్త పోస్టులు భర్తీ చేయకపోగా, ఉన్న పోస్టులు ఎత్తేసేందుకు జగన్ ప్రభుత్వం తెచ్చిన 117 జీవో వల్ల 65 వేల పోస్టులు రద్దయిపోయాయి. వేల టీచరు పోస్టుల్ని మాయం చేసిన జగన్నాటక జీవో 11 ఎత్తేస్తాం. 2013లో రద్దయిన అప్రెంటిస్ విధానాన్ని అమలుచేస్తూ జగన్చేస్తోన్న అన్యాయాన్ని సరిదిద్దుతాం. అప్రెంటిస్ విధానం రద్దుచేసి పూర్తిస్థాయి పేస్కేల్ అమ లు చేస్తాం. 2014, 2019లో రెండు మెగా డీఎస్సీల ద్వారా 16,790 నిరుద్యోగులకు టీచర్ ఉద్యోగాలు కల్పించిన చంద్రబాబు మళ్లీవస్తున్నారు. జగన్ మోసం తో నిరాశ చెందకుండా డీస్సీికి ఇప్పటి నుంచే సిద్ధం అవ్వాలని నిరుద్యోగులకు లోకేష్ పిలుపు ఇచ్చారు.
ఒక్క పోస్టూ భర్తీ చేయలేదు..
ఎన్నికల ముందు ఉపాధ్యాయ పోస్టుల్లో 23 వేల ఖాళీలు ఉన్నాయన్న జగన్, ఎన్నికల తరువాత 18 వేల ఖాళీలే అని మాట మార్చాడు. ఖాళీగా ఉన్న 8,366 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. చివరికి 6 వేల పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ అంటూ ఎలక్షన్ డ్రామా మొదలుపెట్టారు. ఏపీలో 50వేల టీచర్ పోస్టు లు ఖాళీగా ఉన్నాయని పార్లమెంటులో కేంద్రం వెల్లడిర చింది. ఐదేళ్లకి ముందు 23 వేలు పోస్టులుంటే, జగన్ పాలనలో ఒక్క పోస్టూ భర్తీ చేయలేదు, ఈ కాలంలో రిటైరయిన పోస్టులు కలిపితే రెండిరతలు కావాలి. అయితే జగన్ మాయతో వేల టీచర్ పోస్టులు గల్లంత య్యాయి. దీనిపై నిరుద్యోగ యువతకు జగన్ సర్కారు సమాధానం చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు.