- ఇక నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేస్తారు?
- క్రిష్టియన్ పేట రచ్చబండ కార్యక్రమంలో నారా లోకేష్
తాడేపల్లి(చైతన్యరథం): సీఎం ఇంటిపక్కనే ఉన్న వంతెననే నిర్మించలేకపోయారు, మళ్లీ వైసీపీని గెలిపిస్తే నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేస్తారని యువనేత నారా లోకేష్ ప్రశ్నించారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి క్రిస్టియన్ పేటలు శుక్రవారం జరిగిన రచ్చబండ సభలో లోకేష్ మాట్లాడుతూ…మంగళగిరికి ఈ ఎన్నికలు చాలా కీలకం. అన్నారు. కార్పొరేషన్ ను మనపై బలవంతంగా రుద్దారు. దీంతో పన్నుల భారం పెరిగింది. కానీ మౌలిక సదుపాయాలను మాత్రం కల్పించలేదు. ముఖ్యమంత్రి ఇంటి సమీపంలో కూడా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది. ఎన్నికల ప్రచారం కోసం కోయంబత్తూరు వెళ్తే అక్కడ కూడా ఏపీ గంజాయి లభిస్తోందని చెబుతున్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లో గంజాయికి చెక్ పెడతాం. గంజాయి సరఫరా చేసేవారిని కట్ డ్రాయర్లతో కటకటాల్లో పెడతాం. భూగర్భ డ్రైనేజీ నిర్మాణం, కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తామని లోకేష్ చెప్పారు. ఈ సందర్భంగా క్రిష్టియన్ పేట వాసులు తమ సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. ఇళ్ల పట్టాలు అందించాలి. నిరుద్యోగులకు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుచేసి, ఉద్యోగాలు కల్పించాలి. శ్మశానానికి ప్రహరీగోడ నిర్మించాలి. పేదలకు ఇళ్లు నిర్మించాలి. పుష్కరాల సమయంలో ఇళ్లు కోల్పోయిన వారిని ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. లోకేష్ స్పందిస్తూ… అన్ని సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తానన్నారు. పుష్కరాల సమయంలో ఇళ్ళు కోల్పోయిన వారికి కొంతమందికి ఇళ్లు నిర్మించామని, మిగతా వారికి కూడా న్యాయం చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.