చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

దార్శనికుడు చంద్రబాబుతోనే స్వర్ణాంధ్ర సాకారం

స్వర్ణాంధ్ర 2047 విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరణలో పవన్‌కళ్యాణ్‌

by చైతన్యరధం
Dec 14, 2024 at 6:10am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
దార్శనికుడు చంద్రబాబుతోనే స్వర్ణాంధ్ర సాకారం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • ఆయన నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా
  • భవిష్యత్తును అంచనా వేయడంలో దూరదృష్టి అద్భుతం
  • వికసిత భారతంలో ఆంధ్రప్రదేశ్‌ విరబూయాలి
  • విధ్వంసం నుంచి విజయతీరాలకు పురోగమించాలి
  • శాంతిభద్రతలు బలంగా ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడిదారులు
  • పర్యాటకంగా అద్భుత వనరులు..యువతకు అవకాశాలు
  • కులాలు, మతాలు దాటి అభివృద్ధి వైపు అడుగులు వేద్దాం
  • క్షేత్రస్థాయి నుంచి పైస్థాయి వరకు సమష్టిగా కృషి చేద్దాం
  • సంపద, శక్తి, సుస్థిరత, సమగ్రాభివృద్ధి ఇదే మన సంకల్పం
  • గత ప్రభుత్వం దుబారాతో ప్రజా ఖజానాను విచ్ఛిన్నం చేసింది
  • ప్రజలు అన్నీ గమనించే వారిని 11 స్థానాలకు పరిమితం చేశారు
  • స్వర్ణాంధ్ర 2047 విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరణలో పవన్‌కళ్యాణ్‌

విజయవాడ(చైతన్యరథం): ముఖ్యమంత్రి చంద్రబాబు 1995 సమయంలో విజన్‌ 2020 అని చెప్పినప్పుడు అపహాస్యం చేసిన వ్యక్తులే ఈరోజు సైబరాబాద్‌ ప్రాంతంలో స్థలాలు కొనుక్కుని ఆనందంగా ఉన్నారు.. 2047 నాటికి రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో తీసుకువచ్చిందే ఈ స్వర్ణాంధ్ర 2047 విజన్‌ డాక్యుమెంట్‌.. ఆయన నాయకత్వంలోనే సర్ణాంధ్ర సాకారం సాధ్యమని ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ ఉద్ఘాటించారు. శుక్రవారం విజయవాడ ఇందిరాగాంధీ క్రీడా మైదానంలో ఐశ్వర్య, ఆరోగ్య, ఆనందాంధ్రప్రదేశ్‌ సాకారమే లక్ష్యంగా ‘స్వర్ణాంధ్ర 2047 విజన్‌ డాక్యుమెంట్‌’ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పవన్‌కళ్యాణ్‌ పాల్గొన్నారు. విజన్‌ డాక్యుమెంట్‌ను ప్రతిబింబించే విధంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలు తిలకించారు. ఈ సందర్భంగా పవన్‌కళ్యాణ్‌ మాట్లాడుతూ ‘‘ట్విన్‌ టవర్స్‌ వంటి అద్భుతమైన కట్టడాలను నిర్మించడం చాలా కష్టం. వాటిని కూల్చివేసేందుకు తీవ్ర వాదులకు నిమిషాలే పట్టింది. ఏ వ్యవస్థ అయినా, నిర్మాణాన్ని అయినా నిర్మించడం చాలా కష్టం. కూల్చేయడం తేలిక. గత ప్రభుత్వం కూల్చివేతలతో తన పాలనను మొదలుపెట్టి పూర్తిగా కూలిపోయింది. ప్రజలు చాలా బలవంతులు. అన్నీ నిశితంగా గమనిస్తుంటారు. గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాన్ని వారు కళ్లారా చూశారు కాబట్టే 151 సీట్ల నుంచి 11 సీట్లకు వైసీపీని పరిమితం చేశారని వ్యాఖ్యానించారు.
గత ప్రభుత్వం విధ్వంసం నుంచి తేరుకుని పుంజుకోవాలి
‘రాష్ట్రంలోని కొన్ని గిరిజన గ్రామాల్లో సకాలంలో వైద్య సదుపాయం అందక డోలీల్లో రోగులను, బాలింతలను తీసుకొచ్చే పరిస్థితి ఉండటం బాధాకరం. ఇటీవల కలెక్టర్ల సదస్సులో రాష్ట్రంలో ఇలాంటి గ్రామాలు 2854 ఉన్నాయని అధికారులు చెప్పారు..అక్కడ రోడ్ల సదుపాయం, వైద్య సౌకర్యాల మెరుగుదలకు సుమారుగా రూ.3 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇంతటి కీలకమైన సమస్యను తీర్చడానికి ప్రభుత్వ ఖజానాలో తగినన్ని నిధులు లేవు. గత ప్రభుత్వం రుషికొండ ప్యాలెస్‌ కోసం రూ.500 కోట్లు, జగనన్న సర్వే రాళ్లు పాతేందుకు రూ.1200 కోట్లు దుబారా చేసింది. గత ప్రభుత్వం ఇష్టానుసారం ఖర్చు చేసిన నిధులే కనుక ఈరోజు మన దగ్గర ఉంటే కనీసం 1400 గిరిజన గ్రామాలకు రోడ్ల సదుపాయం, వైద్య సదుపాయాలకు వీలుడేందని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపుతో గిరిజన గ్రామాలకు మూడు దశల్లో రహదారుల సౌకర్యం కల్పించేందుకు కృషిచేస్తానని చెప్పడం ఆనందం కలిగించిందన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం నుంచి తిరిగి పుంజుకోవడానికి మనమంతా సమష్టిగా ముందుకు వెళ్లాలి.. గత ప్రభుత్వ విధానాలను క్షేత్రస్థాయి అధికారులు వీడాలని స్పష్టం చేశారు. ప్రజలకు ఏది అవసరమో గుర్తించి..రాష్ట్రానికి ఏది సముచితమో అర్థం చేసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
అధికారులు వారి బలం వారే తెలుసుకోవాలి
నిన్న స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సిసోడియా మాట్లాడుతూ ‘హనుమంతుని శక్తి ఆయనకు తెలియదు. సీతమ్మ వారిని తీసుకురావడానికి వెళ్లేప్పుడు సముద్రం దాటడానికి ముందుకు వెళ్లమంటే నాకు శక్తి లేదు అనగానే జాంబవంతుడు ఆయన బలాన్ని ఆయనకు తెలియజేస్తాడు. అప్పుడు ఆయన సముద్రాన్ని లంఘించగలిగాడు. అదేవిధంగా ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు మీ శక్తిని మీరు తెలుసుకోవాలి’ అని చెప్పారు. వ్యవస్థలను గాడిలో పెట్టే కీలకమైన శక్తి ప్రభుత్వ కార్యనిర్వాహక యంత్రాంగం దగ్గర ఉంది. దానిని తెలుసుకుని పనిచేస్తే మనందరం కలలుగనే కొత్త ఆంధ్రప్రదేశ్‌ కచ్చితంగా సాధ్యమవుతుంది. మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తే దేనికీ భయపడాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వంలో వ్యవహరించినట్లుగా ఒత్తిళ్లకు, భయాలకు అతీతంగా పనిచేయండి. మీకు కచ్చితంగా ప్రభుత్వ మద్దతు ఉంటుంది. మీరు చేసే పని ప్రజలకు మేలు చేసేది అయితే దానిని ప్రోత్సహించే బాధ్యత మేము తీసుకుంటాం. అధికారుల చేత బలంగా పనిచేయించాలి అంటే ప్రజలు భాగస్వామ్యులు కావాలి.
ముందు చూపుతో భవిష్యత్తును అంచనా వేయాలి
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు 1994 సమయంలో విజన్‌ 2020 అని చెప్పినప్పుడు అపహాస్యం చేసిన వ్యక్తులే ఈరోజు సైబరాబాద్‌ ప్రాంతంలో స్థలాలు కొనుక్కుని ఆనందంగా ఉన్నారు. 2047 నాటికి రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో తీసుకువచ్చిందే ఈ స్వర్ణాంధ్ర 2047 విజన్‌ డాక్యుమెంట్‌. ఏ రంగం ఎలా ముందుకు వెళ్లాలి? ఏ రంగానికి భవిష్యత్తులో ప్రాధాన్యం ఉంటుంది? ఆ రంగాల్లో మనం ఎలా ప్రగతి సాధించాలి అన్న పూర్తి విజన్‌ మనకున్నప్పుడే భవిష్యత్తు అందంగా మారుతుంది. అలాంటి గొప్ప భవిష్యత్తును ముందుగానే ఊహించగల దార్శనికులు చంద్రబాబు. రాబోయే కాలంలో యువతకు ఉద్యోగాలు ఉండాలి. 2047 నాటికి సాంకేతికతతో కూడిన వ్యవసాయం వస్తుంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పెరగాలి. నాణ్యమైన విద్య, వైద్యం అందరికీ అందాలి అనే గొప్ప లక్ష్యాలతో ప్రతిఒక్కరి అభిప్రాయాలు తీసుకుని ఈ డాక్యుమెంట్‌ రూపొందించారు. ఇది సాకారం చేసేందుకు క్షేత్రస్థాయి నుంచి పైస్థాయి వరకు సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు విజన్‌ చాలా గొప్పగా ఉంటుంది. దానికోసం ఐకమత్యంగా మన మంతా కష్టపడితే భావితరాలకు గొప్ప భవిష్యత్తును అందించవచ్చు.
రూల్‌ ఆఫ్‌ లా బలంగా ఉండాలి
చాలామంది పెట్టుబడుదారులు ఇతర దేశాలకు వెళ్లడానికి ప్రధాన కారణం అక్కడ రూల్‌ ఆఫ్‌ లా చాలా బలంగా ఉండటం. రూల్‌ ఆఫ్‌ లా అనేది బలంగా ఉన్నప్పుడే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది. అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలను కునే ప్రతిఒక్కరికీ కూడా రూల్‌ ఆఫ్‌ లా సమానంగా ఉండాలి. అలాగే రాష్ట్రంలో శాంతిభద్రతలు బలంగా ఉండాలి. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉన్నప్పుడు ఆ ప్రాంతానికి పెట్టుబడుదారులు తరలివస్తారు. అప్పుడు రాష్ట్రం కూడా అభివృ ద్ధి బాట పడుతుంది. ఇందులో ప్రతిఒక్కరూ భాగస్వాములే. స్వర్ణాంధ్ర విజన్‌ 2047 ప్రతిఒక్కరి సమగ్ర బాధ్యత. ‘‘ప్రతి ఒక్కరి జీవితంలో సంపద రావాలి. శక్తి రావాలి. సుస్థిరత రావాలి. సమగ్రాభివృద్ధి చెందాలి’’ ఇదే మన సంకల్పం. ఇది మహా సంకల్పంగా మారాలి.
రాష్ట్రంలో పర్యాటకంగా అద్భుత వనరులు
గోవా గొప్ప పర్యాటక ప్రాంతం. ఆ రాష్ట్రానికి సగం ఆదాయం పర్యాటకం మీదనే వస్తోంది. మన రాష్ట్రానికి కూడా విశాలమైన తీరప్రాంతం ఉంది. గోవా కంటే అద్భుతాలు చేయగలిగే వనరులు మన దగ్గర ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఒక మాఫియా తరహా వ్యక్తులు రాష్ట్ర పర్యాటకాన్ని పూర్తిగా దిగజార్చారు. రాష్ట్రానికి వచ్చే విదేశీ పర్యాటకులను భయపె ట్టారు. వారికి రక్షణ కల్పించడం మన ప్రధాన బాధ్యత. మన రాష్ట్రంలో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. సందర్శనకు వచ్చే వారిని సొంత మనుషుల్లా చూసుకుని వారికి తగిన ఆతిథ్యం ఇస్తే వాళ్లు మరోసారి మన రాష్ట్రానికి వస్తారు. అలాంటి గొప్ప సంస్కృతి మళ్లీ రావాలి. రాష్ట్రం పర్యాటకంగా కళకళలాడాలి. టూరిజం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందడమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. దానివల్ల రాష్ట్రం పురోగమిస్తుంది. ప్రజ లకు కూడా ఏదైనా విషయంలో నిరసన తెలిపే హక్కు ఉంటుంది. అయితే అది ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి. మీరు ఆవేశంలో ఒక బస్సు తగలపెడితే దాని నష్టం పన్ను రూపంలో మీ మీదనే పడుతుంది. అందుకే మీరు ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించేలా బాధ్యతాయుతంగా ఉండాలి.
ముఖ్యమంత్రి, నేనూ పరస్పరం గౌరవించుకుంటాం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాకు ఎంతో గౌరవం ఇస్తారు. ఏ విషయంలో కూడా సంప్రదింపులు లేకుండా ముందుకు వెళ్లరు. నేను కూడా ఆయన నాయకత్వ తీరును, ఓపికను దగ్గర నుంచి గమనిస్తూ ప్రతి అంశాన్ని ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలని భావిస్తాను. 2014లో సైతం విభజిత ఆంధ్రప్రదేశ్‌ బలంగా ముందుకు వెళ్లాలంటే చంద్రబాబు లాంటి గొప్ప నాయకుడు అవసరం అనే ఆనాడు ఏమీ ఆశించకుండా మద్దతు ఇచ్చాం. ఇప్పుడు ఆయన నాయకత్వంలో పని చేయడం కూడా గొప్ప అదృష్టంగానే భావిస్తున్నాం. ప్రజలు తమను నమ్మి ఇచ్చిన మెజారిటీని, వారి ఆశలను నెరవేర్చేలా ఇరువురం ఎల్లప్పుడూ పనిచేస్తాం. నేను ఆయనను ముందు వెళ్లమని చెప్పినా సరే ఆయన మాత్రం కలిసి నడుద్దామని చెబుతారు. ఇది ప్రతిఒక్కరూ అర్థం చేసుకుని విభేదాలు పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని మన స్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
కులాలు, మతాలు దాటి అభివృద్ధి వైపు అడుగులు వేద్దాం
21వ శతాబ్దంలో కూడా నా కులం, నా వర్గం, నా మతం అంటే కష్టం. విభేదాలు, సమస్యలు ఉంటే పరిష్కరించు కుందాం. సమస్యలు అందరికీ ఉంటాయి. వాటిని శాంతియుత పంథాలో పరిష్కరించుకుందాం. ప్రతి సమస్యకు పరిష్కా రం అనేది ఉంటుంది. ఈ సమయంలో కూడా కులాలు, మతాలు అని కూర్చుంటే అభివృద్ధి ముందుకు వెళ్లదు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి అందరి ఆలోచన కావాలి. ఎంతో గొప్ప నాయకత్వ లక్షణాలు ఒక భావ జాలాన్ని బలంగా తీసుకువెళ్లగల సత్తా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు మా సంపూర్ణ సహకారం ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలగన్న వికసిత్‌ భారత్‌ 2047లో ఏపీ అగ్రగామి కావాలి. వికసించిన భారతంలో రాష్ట్రం చిరునవ్వులు విరబూయాలి. భారత్‌ను చూసి ప్రపంచ దేశాలు భయపడాలన్నా, అభివృద్ధిలో చైనా లాంటి దేశాన్ని అధిగమించాలన్నా సరే దేశ అభి వృద్ధితో పాటుగా స్వర్ణాంధ్ర విజన్‌ 2047 సాధించడం చాలా కీలకం అనేది అర్థం చేసుకోవాలి అని తెలిపారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, 13 ఉమ్మడి జిల్లాల నుంచి పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సంబంధితవార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 28-04-2026

చైతన్యరధం ఈ పేపర్ 27-04-2026

జగన్‌రెడ్డి పాలనలో విద్యుత్ సంక్షోభం

Previous Post

నేడు విజయవాడలో ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవాలు

Next Post

మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి భూకబ్జా

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 28-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 28-04-2026

కార్యకర్త
@ April 28, 2026
చైతన్యరధం ఈ పేపర్ 27-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 27-04-2026

కార్యకర్త
@ April 27, 2026
జగన్‌రెడ్డి పాలనలో విద్యుత్ సంక్షోభం
ఆంధ్రప్రదేశ్

జగన్‌రెడ్డి పాలనలో విద్యుత్ సంక్షోభం

చైతన్యరధం
@ April 27, 2026
నో స్టాక్.. కనిపించకూడదు!
ఆంధ్రప్రదేశ్

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
టెక్‌మ్యాప్‌లో విశాఖకు చోటు
ఆంధ్రప్రదేశ్

టెక్‌మ్యాప్‌లో విశాఖకు చోటు

చైతన్యరధం
@ April 27, 2026
గ్లోబల్ ఏఐ హబ్‌గా విశాఖపట్నం
ఆంధ్రప్రదేశ్

గ్లోబల్ ఏఐ హబ్‌గా విశాఖపట్నం

చైతన్యరధం
@ April 27, 2026
వైసీపీ పాలన వ్యవసాయానికి చీకటి యుగం
ఆంధ్రప్రదేశ్

వైసీపీ పాలన వ్యవసాయానికి చీకటి యుగం

చైతన్యరధం
@ April 27, 2026
చైతన్యరధం ఈ పేపర్ 26-04-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 26-04-2026

కార్యకర్త
@ April 26, 2026
Load More

ముఖ్య వార్తలు

నో స్టాక్.. కనిపించకూడదు!

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

సాగుకు భద్రత..అధిక ఆదాయమే లక్ష్యం

చైతన్యరధం
@ April 25, 2026
ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

ఉత్తరాంధ్రకు పెట్టుబడుల పండుగ

చైతన్యరధం
@ April 24, 2026
ఎన్డీయేతోనే తమిళనాడుకు పూర్వవైభవం

ఎన్డీయేతోనే తమిళనాడుకు పూర్వవైభవం

చైతన్యరధం
@ April 22, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

కష్టాలు ఉన్నా.. కర్తవ్యం వీడలేదు!

చైతన్యరధం
@ February 18, 2026 6:15 AM
న్యాయవ్యవస్థపై 420 జగన్‌రెడ్డి విషపూరిత కుట్ర!

సైకో పోయాడు.. నవ నిర్మాత వచ్చాడు

చైతన్యరధం
@ December 21, 2025 6:00 AM
నాడు పరిశ్రమలు పరార్‌!

నాడు పరిశ్రమలు పరార్‌!

చైతన్యరధం
@ November 13, 2025 6:00 AM
మరిన్ని

తాజా సంఘటనలు

జగన్‌రెడ్డి పాలనలో విద్యుత్ సంక్షోభం

జగన్‌రెడ్డి పాలనలో విద్యుత్ సంక్షోభం

చైతన్యరధం
@ April 27, 2026
నో స్టాక్.. కనిపించకూడదు!

నో స్టాక్.. కనిపించకూడదు!

చైతన్యరధం
@ April 27, 2026
టెక్‌మ్యాప్‌లో విశాఖకు చోటు

టెక్‌మ్యాప్‌లో విశాఖకు చోటు

చైతన్యరధం
@ April 27, 2026
గ్లోబల్ ఏఐ హబ్‌గా విశాఖపట్నం

గ్లోబల్ ఏఐ హబ్‌గా విశాఖపట్నం

చైతన్యరధం
@ April 27, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist