- మీ కృషి అభినందనీయం
- సెకండరీ గ్రేడ్ టీచర్ రమణారెడ్డికి మంత్రి లోకేష్ ప్రశంసలు
అమరావతి (చైతన్యరథం): ప్రభుత్వ పాఠశాలను అత్యద్భుతంగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయుడిని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ అభినందించారు. వైఎస్సార్ కడప జిల్లా కలశపాడు మండలం కరణంవారిపల్లి పాఠశాలను గ్రామస్తుల సహకారంతో అందంగా తీర్చిదిద్దిన సెకండరీ గ్రేడ్ టీచర్ గానుగపెంట రమణారెడ్డి అందరిలో స్ఫూర్తి నింపుతున్నారని ప్రశంసించారు. సింగిల్ టీచర్‌గా ఆయన అడుగుపెట్టే నాటికి నలుగురు విద్యార్థులున్న పాఠశాల నేడు 26 మందికి చేరడం అభినందనీయం. పూర్వవిద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తుల సహకారంతో బడిని అందమైన గుడిలా మార్చారు. ప్రతీ బడి ఇలాగే అందరి సహకారంతో కార్పొరేటుకి దీటుగా తయారు కావాలని ఆకాంక్షిస్తున్నాను. దాతల సహకారంతో పాఠశాలకు స్మార్ట్ టీవీ, ప్రింటర్, కంప్యూటర్, సౌండ్ సిస్టమ్, లక్ష రూపాయలతో లైబ్రరీ పుస్తకాలు, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ సమకూర్చారు. బడిని బాగుచేసి, పిల్లలకు బంగారు భవిష్యత్తు చూపే సమగ్రవిద్యను అందిస్తున్న టీచర్ రమణారెడ్డి కృషి ప్రశంసనీయమని మంత్రి లోకేష్ అభినందించారు.















