చైతన్యరధం ఈ-పేపర్
అభిప్రాయం
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
టీడీపీ లో చేరండి
విరాళం
Telugu Desam
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
TDP - తెలుగు దేశం పార్టీ
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
    • స్వర్ణ ఆంధ్రా 2047
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారత దేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
    • Form C7 – MLC Election 2025
    • Form C2 – MLC Election 2025
    • Form C7 – General Election 2024
    • Form C2 – General Election 2024
    • Form C2 – Rajya Sabha Election 2026
    • Form C7 – Rajya Sabha Election 2026
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
    • జాతీయ కమిటీ
    • ఆంధ్రప్రదేశ్ కమిటీలు
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • సూపర్ 6
No Result
View All Result
TDP - తెలుగు దేశం పార్టీ
No Result
View All Result
Telugu Desam
Home ఆంధ్రప్రదేశ్

ఇస్రో ప్రస్థానం స్ఫూర్తిదాయకం

డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ప్రశంస

by చైతన్యరధం
Aug 14, 2024 at 7:10am
in ఆంధ్రప్రదేశ్, చైతన్యరధం, తాజా సంఘటనలు, ముఖ్య వార్తలు
ఇస్రో ప్రస్థానం స్ఫూర్తిదాయకం
Share on FacebookShare on TwitterShare on Whatsapp
  • అపూర్వ ప్రయాణం వెనుక ఎందరో శాస్త్రవేత్తల శ్రమ
  • గ్లోబల్‌ స్పేస్‌ ఎకానమీలోనూ భారత ముద్ర
  • ఎన్డీయే ప్రభుత్వంలో అంతరిక్ష పరిశోధనలకు ప్రాధాన్యం
  • అపజయంలోనూ శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ ఇచ్చిన ధైర్యం గొప్పది
  • ఇస్రోకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తగిన విధంగా సహకరిస్తుంది
  • విద్యార్థులు, యువత కోసం ఇస్రోతో ఎంఓయూ చేసుకుంటాం
  • షార్‌లో జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి

శ్రీహరికోట(చైతన్యరథం): సామాన్యుడు ఈ రోజు ఎంతో ఆనందంతో అనుభవిస్తున్న శాస్త్ర, సాంకేతిక రంగాల ప్రతిఫలాల వెనుక… జీవితంలో సుఖాలను, సంతోషాలను, బాధలను, బంధాలను సైతం త్యాగం చేసిన ఎందరో శాస్త్రవేత్తల శ్రమ దాగుంది.. అంతరిక్ష పరిశోధనలే ప్రాణంగా పని చేస్తున్న ఎందరో మహానుభావుల పరిశ్రమ దాగుంది.. దేశం కోసం, జాతి కోసం తమ సొంత కుటుంబాలను, ఇష్టాలను వదులుకొని, అవమానాలు, అవహేళనలను పట్టించుకోకుండా ముందుకు సాగిన గొప్ప వ్యక్తుల సాహస ప్రయాణం దాగుంది.. వారే ఈ దేశానికి నిజమైన హీరోలు.. వారే నాకు నిజ జీవిత హీరోలుగా అనిపిస్తారు.. తెరపై కనిపించకుండా దేశం కోసం జీవితాన్ని ధారబోసిన శాస్త్రవేత్తలు నాకు నిజమైన స్ఫూర్తిప్రదాతలని ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ (షార్‌) మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో పవన్‌ కళ్యాణ్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన పవన్‌ కళ్యాణ్‌..చిన్నారులు, కళాశాల యువత, షార్‌ శాస్త్రవేత్తలు, సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ ఒక ఫార్ములా కనుక్కోవడానికి, ఓ ప్రయోగం నిర్వహించేందుకు శాస్త్రవేత్తలు చేసే మేధో మధనం చాలా విలువైనదన్నారు. ఆలోచనల్లో పడి ఒక్కోసారి వారు నిద్ర, ఆహారానికి కూడా దూరం అవుతారు. దేశానికి ఏదో చేయాలనే తపన, ఏకాగ్రత, శ్రమ అమూల్యమైనవి. వారికి ఈ దేశం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేదు. అలాంటి హీరోల గురించి ప్రజలకు తెలియాలి. యువతలో వారు నిరంతరం స్ఫూర్తి నింపాలి. చిన్నచిన్న విషయాలకే తల్లడిల్లిపోయే నేటి తరం యువతకు శాస్త్రవేత్తలు స్ఫూర్తిప్రదాతలుగా మారి, దారి చూపాలి. శాస్త్రవేత్తల కష్టాన్ని జాతి గుర్తించాలి. వారికి తగిన గౌరవం ఇవ్వడం, వారి మాటలను జాగ్రత్తగా వినడం ద్వారా కచ్చితంగా అవి గొప్ప జీవితం వైపు తీసుకెళ్తాయని పవన్‌ అన్నారు.

సంబంధితవార్తలు

వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఇళ్లు కోల్పోయి త్యాగాలు చేసిన నిర్వాసిత కుటుంబాలకు బుధవారం మరో రూ.200 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం అందించింది.

గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా ఎన్నికైన టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్యకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు.

విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను దళవాయి రమాదేవి, కుటుంబసభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు

బలంగా కోరుకుంటే మంచి తప్పకుండా జరుగుతుంది
నేను నెల్లూరులో చదువుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి శాస్త్రసాంకేతిక రంగాలు, అంతరిక్ష ప్రయోగాలపై మక్కువ ఉండేది. స్కూళ్లో టీచర్‌ను పదేపదే దీనిపై ప్రశ్నలు అడిగేవాడిని. టీచర్‌ నాలో ఉన్న తపనను గుర్తించి… నన్ను స్కూలు సైన్స్‌ టీంలో వేసి ఆర్యభట్ట ఉపగ్రహ ప్రయోగం మీద ఓ నమూనా తయారు చేసి తీసుకురమ్మన్నారు. నానా రకాల పాట్లు పడి… అప్పుడున్న వనరులతో సాధారణ పేపర్‌ నమూనా తయారు చేయడానికే నాకు చుక్కలు కనిపించాయి. మరి అంతరిక్షంలోకి ప్రయోగించే, అక్కడ పని చేసే ఉపగ్రహాల తయారీకి, వాటి ప్రయోగానికి శాస్త్రవేత్తలు ఎంత కష్టపడతారో అన్న ఆలోచన నాకు శాస్త్రవేత్తలపై అమితమైన గౌరవాన్ని పెంచింది. వారు చేసే ప్రయోగాలకు జీవితం ధారబోస్తారు. అందరికీ అవసరమయ్యే సాంకేతికను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వారు నిత్యం శ్రమిస్తారు. నెల్లూరులో ఉన్నపుడు శ్రీహరికోటలో రాకెట్‌ ప్రయోగిస్తారని తెలుసుకొని ఎప్పుడైనా ఇక్కడకు రావాలని అనుకునేవాడిని. అనుకోకుండా ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం యాదృచ్ఛికం అయినా, జీవితంలో మంచిని బలంగా కోరుకుంటే అవుతుందనడానికి ఇది నిదర్శనమని పవన్‌ అన్నారు.

దేశానికి సేవ చేయడం మహద్భాగ్యం
శాస్త్రవేత్తలు, నిపుణులు నిజమైన దేశభక్తులు. వారి మేధస్సులోని అపార జ్ఞానం దేశానికి మాత్రమే చెందాలని భావించడం వారి దేశభక్తికి నిదర్శనం. విదేశాలకు వెళ్లే వీలున్నా, అక్కడ హోదా, ధనం వచ్చే అవకాశమున్నా వారంతా దేశానికి కట్టుబడి చేసిన సేవలు, వారి ప్రతిభే దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయి. 1969 నుంచి ఇంతింతై వటుడిరతై అన్నట్లు సాగిన భారతదేశ అంతరిక్ష పరిశోధన ప్రయాణం నేడు ప్రపంచంలోనే మేటిగా మారింది. భారత్‌ను బలమైన శక్తిగా నిలపడంలో ఎందరో కనిపించని హీరోల కష్టం దాగుంది. వారి విజ్ఞానం ఉపయోగించుకొని నిరంతరం ముందుకు సాగుతున్న వారికి మాత్రమే విజిల్స్‌, చప్పట్లు దక్కాలని భావిస్తానని పవన్‌ చెప్పారు.

దైవం మానుష రూపేణా
చిన్నప్పుడు మా అమ్మ ప్రతిరోజు సాయంత్రం అవగానే ఇంట్లో బల్బు స్విచ్‌ వేసి దణ్ణం పెట్టుకోవడం గమనించేవాడిని. నువ్వు ఎవరికి మొక్కుతున్నావు అని అడిగితే బల్బు కనిపెట్టిన థామస్‌ అల్వా ఎడిసన్‌ కు అని చెప్పేది. అంటే శాస్త్రవేత్తలను, వారి జ్ఞానాన్ని దేవుడిగా నమ్మే సంస్కృతి మనది. పది మందికి మంచి చేసేవారికి దణ్ణం పెట్టడమే భారతీయ ధర్మం. దైవం మానుష రూపేణా అని భావిస్తాం. అలాగే పది మందికీ మంచి చేసే వారిని దేవుడిగా భావిస్తాం. అలాగే దేశం కోసం పనిచేసే ప్రతి శాస్త్రవేత్తకు జాతి రుణ పడి ఉంటుందని పవన్‌ అన్నారు.

ఎక్కడో ఒక చోట అడుగుపడితేనే…
ఎక్కడో కేరళలోని తుంబ అనే ప్రాంతంలో చిన్నస్థాయిలో మొదలైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయాణం నాకు స్ఫూర్తిదాయకం. ఎక్కడో ఒక చోట అడుగుపడితేనే అది వేల మైళ్ల ప్రయాణానికి దారి చూపుతుంది. అతి చిన్నస్థాయిలో మొదలైన భారతీయ పరిశోధన సంస్థ ప్రస్థానం నేడు ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే స్థాయికి ఎదగడం ఓ గొప్ప రికార్డు. ఇస్రో పని తీరు వల్ల ప్రపంచ దేశాలన్నీ మన వైపు చేసేలా చేసింది. ఈ దేశం అన్ని రంగాల్లో అగ్రగామి కావాలి. ప్రపంచానికే భారతదేశం దిక్సూచి కావాలని బలంగా ఆకాంక్షిస్తున్నానని పవన్‌ అన్నారు.

శ్రీహరికోట.. పర్యావరణహిత ప్రయోగాల వేదిక
శ్రీహరికోటకు హెలికాప్టర్‌ లో వస్తున్న సమయంలో పైనుంచి ఈ ప్రయోగ ద్వీపాన్ని చూస్తుంటే ముచ్చటేసింది. పచ్చగా అడవిని తలపించేలా షార్‌ కనిపించింది. శ్రీహరికోట నిర్మాణం ఓ అద్భుతం. చుట్టూ సముద్రం, మరో పక్క సరస్సు మధ్యలో ఉన్న ద్వీపంలో అంతరిక్ష ప్రయోగశాల నిర్మాణం దేశానికే తలమానికంగా నిర్మించుకోవడం గొప్ప విశేషం. దీంతోపాటు పర్యావరణానికి ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా, అడవిని తలపించే వాతావరణంలో షార్‌ నిర్వహణ ఓ ప్రకృతి ప్రేమికుడిగా నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. 40 వేల ఎకరాల్లో ఎక్కడా కూడా పర్యావరణాన్ని విధ్వంసం చేసే చర్యలు లేవంటే మామూలు విషయం కాదు. లోపలికి వచ్చాక కూడా పచ్చటి తోరణాల్లా షార్‌ లో చెట్లు స్వాగతం పలుకున్న తీరు చూసి గొప్పగా ఉంది. జనసేన మూల సిద్ధాంతాల్లో ఒకటైన ‘పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం’ అనేది ఇక్కడ నాకు కనిపించింది. బయో డైవర్సీటీకి అటవీశాఖ చేస్తున్న కృషి గొప్పగా ఉందని పవన్‌ అభినందించారు.

అంతరిక్ష పరిశోధనల్లో భారత్‌ రాజీపడదు
ఓ హాలివుడ్‌ సినిమాకు పెట్టిన ఖర్చు కంటే తక్కువ ఖర్చుతో భారతదేశం మార్స్‌ మిషన్‌ మంగళ్‌యాన్‌ పూర్తి చేసింది. ప్రపంచంలో ఇంత తక్కువ ఖర్చుతో అంతరిక్ష పరిశోధనలు చేసిన దేశాలు లేవంటే మామూలు విషయం కాదు. ఇస్రోలో పని చేస్తున్న సఫాయి దగ్గర నుంచి ఛైర్మన్‌ వరకు అంతా ఈ గొప్ప ప్రయాణంలో భాగస్వాములే. అంతరిక్ష పరిశోధనల్లో భారత్‌ ఎక్కడా రాజీ పడకుండా ప్రయాణం చేస్తోంది. ఇస్రో ప్రయోగాలకు తగిన విధంగా కేంద్రం ఎప్పటికప్పుడు బడ్జెట్‌ ను పెంచుతోంది. ప్రయోగాలకు అవసరం అయిన నిధులను అందజేస్తోంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఇస్రోకు ఏటా రూ.5,615 కోట్లు మాత్రమే కేటాయిస్తే, అదే ఎన్టీయే ప్రభుత్వంలో 2022-23 బడ్జెట్‌ లో రూ.13,700 కోట్లకు చేరింది. చంద్రయాన్‌ ` 2 ప్రయోగం విఫలమైనపుడు నిరాశలో, బాధలో ఉన్న శాస్త్రవేత్తలకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా విచ్చేసి ధైర్యం చెప్పడం, గుండెలకు హత్తుకోవడం గొప్ప విషయం. ఆయన ఇచ్చిన ధైర్యంతోనే ఇస్రో శాస్త్రవేత్తలు ధైర్యంగా ముందడుగు వేసి చంద్రయాన్‌ ` 3 విజయవంతం చేశారు. అపజయం వచ్చినపుడు శాస్త్రవేత్తలను నిందించకుండా, వారికి బాసటగా నిలిచిన మోదీ ఓదార్పు నన్ను కూడా కదలించిందని పవన్‌ అన్నారు.
గగన్‌ యాన్‌కు ఏపీ ప్రభుత్వం సహకరిస్తుంది
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే గగన్‌ యాన్‌ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తగిన సహాయ, సహకారాలు అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష పరిశోధనలను పూర్తిస్థాయిలో ప్రొత్సహిస్తుంది. శాస్త్రవేత్తల కృషి, వారి జ్ఞానం వినియోగించుకొని అద్భుతాలు చేయాలని భావిస్తోంది. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇప్పుడు స్పేస్‌ ఎకానమీ ని సృష్టించే స్థాయికి ఎదిగింది. విదేశాలకు చెందిన ఉపగ్రహాలను మనం కక్ష్యలో ప్రవేశపెట్టడం ద్వారా స్పేస్‌ ఎకానమీని సాధిస్తున్నాం. మొత్తం గ్లోబల్‌ స్పేస్‌ ఎకానమీలో 2 నుంచి 3 శాతం సాధించే స్థాయికి ఇస్రో చేరుకుంది. ఇస్రో సక్సెస్‌ రేటు కూడా ప్రపంచదేశాల అంతరిక్ష పరిశోధన సంస్థలతో పోల్చుకుంటే చాలా బాగుంది. ఇతర దేశాలు కూడా ఇస్రో సేవల కోసం అభ్యర్థిస్తున్నాయి. ఇది ఒక్క రోజులో వచ్చిన విజయం కాదు. ఎన్నో మేధస్సుల కలయిక… ఎందరో మేధావుల పరిశ్రమ. ఇస్రో కేవలం ప్రయోగాలకే పరిమితం కాకుండా విద్యార్థులకు విజ్ఞాన ప్రదర్శనలు, పోటీలు నిర్వహించడం గొప్ప విషయం. భావి తరాల భవిష్యత్తు దృష్ట్యా పిల్లలను ప్రోత్సహించడం అభినందనీయమని పవన్‌ అన్నారు.
ఆ రోడ్డు ఐదు రోజుల్లో పూర్తవుతుంది
బుచ్చినాయుడు కండ్రిగ నుంచి షార్‌కు వచ్చే 17 కిలోమీటర్ల రోడ్డు బాగాలేదని షార్‌ అధికారులు నా దృష్టికి తెచ్చారు. వెంటనే కలెక్టరుతో మాట్లాడి రోడ్డు పనులు మొదలుపెట్టాం. మరో 5 రోజుల్లో పనులు పూర్తి అవుతాయి. ఇలాంటి పనులను వెంటనే పూర్తి చేసే బాధ్యతను మేం తీసుకుంటాం. ఇస్రో కోసం దేశం నలుమూలల నుంచి వచ్చి శాస్త్రవేత్తలు పనిచేస్తారు. భాష, భావం, భావజాలం వేరైనా అందరి గుండె భారతదేశం అని కొట్టుకుంటుంది. అదే మనందరినీ కలిపి ఉంచుతుందని పవన్‌ చెప్పారు.
ఇస్రోతో ఎంఓయూ
ఆంధ్రప్రదేశ్‌ యువతలో అపరిమితమైన జిజ్ఞాస ఉంది. దీన్ని సరైన రీతిలో ముందుకు తీసుకెళ్లే దారి లేక యువత ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. ఈ విషయంలో విజ్ఞాన విషయాలను పంచుకునేందుకు, విలువైన సూచనలు యువతకు అందించే నిమిత్తం ఇస్రోతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎంఓయూ చేసుకోవాలని భావిస్తున్నాను. దీనిపై నేను క్యాబినెట్‌ లో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాను. భావితరాలకు అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి ఏర్పడాలి. యువతకు అంతరిక్ష పరిశోధనలపై ఉన్న ఆకాంక్షకు తగిన ఉపాధి మార్గం లేదా పరిశోధనల మార్గం చూపేలా ఇస్రో అధికారులు తగిన గైడెన్స్‌ ఇచ్చేలా మాట్లాడుతాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులను అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తిని పెంచేలా ముందుకు వెళ్లాలి. దీనికి ప్రత్యేకంగా ఓ ఎంఓయూ చేసుకొని సంయుక్తంగా ముందుకు వెళ్లేలా ప్రయత్నాలు చేస్తాం. శాస్త్రవేత్తలే ఈ దేశపు బలం. జాతి సంపద. వారు ఈ దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను. భావి భారతం మరిన్ని ప్రయోగాలకు వేదిక కావాలని కోరుకుంటున్నానని డిప్యూటీ సీఎం పవన్‌ అన్నారు.
ఈ కార్యక్రమంలో సతీష్‌ ధావన్‌ అంతరిక్ష పరిశోధన కేంద్రం (షార్‌) డైరెక్టర్‌ ఎ.రాజరాజన్‌, అసోయేట్‌ డైరక్టర్‌ సయ్యద్‌ సమీద్‌, షార్‌ కంట్రోలర్‌ ఎం.శ్రీనివాసరెడ్డి, జనరల్‌ మేనేజర్‌ శంభు ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.
చంద్రయాన్‌ ` 3 రాకెట్‌ నమూనా బహూకరణ
జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ని సత్కరించి… అనంతరం షార్‌ డైరెక్టర్‌ ర్రాజరాజన్‌ చేతుల మీదుగా చంద్రయాన్‌ ` 3 రాకెట్‌ ప్రయోగ నమూనాను బహూకరించారు. అనంతరం పవన్‌ కళ్యాణ్‌ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమాల పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

Previous Post

పర్యాటకాభివృద్ధికి అవకాశాలు పుష్కలం

Next Post

అవినీతిలో అడ్డగోలుగా దొరికి కులాల ప్రస్తావనా?

మరిన్ని వార్తలు

చైతన్యరధం ఈ పేపర్ 19-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 19-08-2026

కార్యకర్త
@ August 19, 2026
చైతన్యరధం ఈ పేపర్ 18-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 18-08-2026

కార్యకర్త
@ August 18, 2026
ఎల్‌నినోను ఎదుర్కొనేలా మూడేళ్ల కార్యాచరణ
ఆంధ్రప్రదేశ్

ఎల్‌నినోను ఎదుర్కొనేలా మూడేళ్ల కార్యాచరణ

చైతన్యరధం
@ August 18, 2026
ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి
ఆంధ్రప్రదేశ్

ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

చైతన్యరధం
@ August 18, 2026
భోగాపురానికి తొలి విమానం కొత్త అధ్యాయానికి శ్రీకారం
ఆంధ్రప్రదేశ్

భోగాపురానికి తొలి విమానం కొత్త అధ్యాయానికి శ్రీకారం

చైతన్యరధం
@ August 18, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్

డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

చైతన్యరధం
@ August 18, 2026
చైతన్యరధం ఈ పేపర్ 17-08-2026
చైతన్యరధం

చైతన్యరధం ఈ పేపర్ 17-08-2026

కార్యకర్త
@ August 17, 2026
వైసీపీకి తగిన బుద్ధి చెబుతాం!
ఆంధ్రప్రదేశ్

వైసీపీకి తగిన బుద్ధి చెబుతాం!

చైతన్యరధం
@ August 17, 2026
Load More

ముఖ్య వార్తలు

ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

చైతన్యరధం
@ August 18, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

చైతన్యరధం
@ August 18, 2026
వైసీపీకి తగిన బుద్ధి చెబుతాం!

వైసీపీకి తగిన బుద్ధి చెబుతాం!

చైతన్యరధం
@ August 17, 2026
వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ

వాటర్ మూమెంట్ ప్లాన్ ప్రకారమే నీటి నిర్వహణ

చైతన్యరధం
@ August 15, 2026
మరిన్ని

అత్యధికంగా వీక్షించినవి

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

ఆదర్శ నియోజకవర్గంగా మంగళగిరి!

చైతన్యరధం
@ August 9, 2026 6:20 AM
దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

దళితులపై జగన్‌ది కపట ప్రేమ!

చైతన్యరధం
@ July 9, 2026 6:00 AM
చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చంద్రబాబు విజన్‌తో విద్యుత్ ధగధగలు 

చైతన్యరధం
@ April 29, 2026 7:10 AM
అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

అమ్మకు ఆసరా…చెల్లెమ్మలకు భరోసా…

చైతన్యరధం
@ March 8, 2026 6:30 AM
మరిన్ని

తాజా సంఘటనలు

ఎల్‌నినోను ఎదుర్కొనేలా మూడేళ్ల కార్యాచరణ

ఎల్‌నినోను ఎదుర్కొనేలా మూడేళ్ల కార్యాచరణ

చైతన్యరధం
@ August 18, 2026
ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

ధైర్యముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి

చైతన్యరధం
@ August 18, 2026
భోగాపురానికి తొలి విమానం కొత్త అధ్యాయానికి శ్రీకారం

భోగాపురానికి తొలి విమానం కొత్త అధ్యాయానికి శ్రీకారం

చైతన్యరధం
@ August 18, 2026
డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

డేట్, టైమ్ ఫిక్స్ చెయ్…ఎక్కడైనా..ఎప్పుడైనా చర్చకు సిద్ధం

చైతన్యరధం
@ August 18, 2026
మరిన్ని
TDP-Logo-mini
మన పార్టీ
  • మన సిద్ధాంతం
  • జై హింద్ - జై తెలుగుదేశం
  • మన చరిత్ర
  • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
  • కార్య నిర్వాహక వర్గం
మన నాయకత్వం
  • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
  • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
  • NTR శత జయంతి ఉత్సవాలు
మన విజయాలు
  • భారత దేశం
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • 44 సంవత్సరాల విజయాలు
డౌన్లోడ్స్
  • మ్యానిఫెస్టో
  • మహానాడు 2022 తీర్మానాలు
  • నాయకుడితో నా చిత్రం
  • లోగోలు
  • నాయకుల చిత్రాలు
ప్రచార సమాచారం
  • బ్యానర్స్ / బుక్ లెట్స్
  • పోస్టర్స్ / కరపత్రాలు
  • ప్రచార గీతాలు
  • ఎన్నికల సమాచారం / సూచనలు
మీడియా వనరులు
  • పత్రికా ప్రకటనలు
  • ప్రసంగాలు
  • కార్యక్రమాలు
  • ముఖాముఖి & కథనాలు
  • ఫోటో గ్యాలరీ
  • వీడియో గ్యాలరీ

© 2026 తెలుగుదేశం పార్టీ. Privacy Policy | Terms Conditions.

Telegram Whatsapp Facebook Twitter Instagram Youtube
Sanbrains
No Result
View All Result
  • హోమ్
  • మన పార్టీ
    • పార్టీ సిద్ధాంతం
    • జై హింద్ – జై తెలుగుదేశం
    • మన చరిత్ర
    • జాతీయ రాజకీయాలపై తెలుగుదేశం ప్రభావం
    • కార్య నిర్వాహక వర్గం
  • మన నాయకత్వం
    • వ్యవస్థాపకుని జీవిత చరిత్ర
    • పార్టీ అధినాయకుని జీవిత చరిత్ర
    • NTR శత జయంతి ఉత్సవాలు
    • NTR శత జయంతి ఉత్సవాలు
  • మన విజయాలు
    • భారతదేశం
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • 44 సంవత్సరాల విజయాలు
  • డౌన్లోడ్స్
    • ప్రజా మ్యానిఫెస్టో 2024
    • మహానాడు 2022 తీర్మానాలు
    • నాయకుడితో నా చిత్రం
    • లోగోలు
    • నాయకుల చిత్రాలు
    • ప్రచార సమాచారం
      • బ్యానర్స్ / బుక్ లెట్స్
      • పోస్టర్స్ / కరపత్రాలు
      • TDP పాటలు
      • ఎన్నికల సమాచారం / సూచనలు
  • మీడియా వనరులు
    • పత్రికా ప్రకటనలు
    • ప్రసంగాలు
    • కార్యక్రమాలు
    • ముఖాముఖి & కథనాలు
    • ఫోటో గ్యాలరీ
    • వీడియో గ్యాలరీ
  • నాయకులు
    • పోలిట్ బ్యూరో
  • కార్యకర్తలు
    • కార్యకర్తల సంక్షేమం
    • కార్యకర్తల బీమా
  • విరాళం
  • అభిప్రాయం
  • చైతన్యరధం ఈ-పేపర్
  • జిల్లా వెబ్‌సైట్‌లు
    • Ananthapuramu
    • Anakapalli
    • Bapatla
    • Chittoor
    • EastGodavari
    • Eluru
    • Guntur
    • Kadapa
    • Kakinada
    • Krishna
    • Kurnool
    • Manyam
    • Nandyala
    • Nellore
    • Palnadu
    • Prakasam
    • Srikakulam
    • Tirupati
    • Visakhapatnam
    • Vizianagaram
    • WestGodavari
  • సూపర్ 6

© 2022 Telugu Desam Party. Designed by Tecbrains.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Create New Account!

Fill the forms below to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.
All fields are required. Log In

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist